Read more!

సుభాషితం - (Subhashitam) దానం చేసేవారు దరిద్రులుగా...

 

సుభాషితం - (Subhashitam)

 

దానం చేసేవారు దరిద్రులుగా...


దాతా దరిద్రః కృపణో ధనాడ్యః

పాపీ చిరాయు స్సుక్రుతీ గతాయుః

రాజా౭ కులీన స్సుకులీ చ భ్రుత్యః

కలియుగే షడ్గుణమాశ్రయంతి

 

జాలీదయలతో ఇతరులకు దానాలు చేసేవారు దరిద్రులుగా మారడం, పరమ పిసినారులు ధనవంతులు కావడం, పాపులు చిరంజీవులై కలకాలం జీవించడం, పుణ్యాత్ములు త్వరగా చనిపోవడం, అల్పులు అధికారులు కావడం, ఉత్తములు పనివారుగా మారడం కలియుగంలో ఎక్కువౌతుంది.