వసంత పంచమి రోజు సరస్వతి విగ్రహం లేదా చిత్రపటం ఏ దిశలో ఉంచితే మంచిదంటే..!

 

వసంత పంచమి రోజు సరస్వతి విగ్రహం లేదా చిత్రపటం ఏ దిశలో ఉంచితే మంచిదంటే..!


హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమిని మాఘ శుద్ద పంచమి రోజు జరుపుకుంటారు.  సరస్వతి దేవి సాగర మధనం నుండి ఆవిర్భవించింది ఈ రోజే.. అందుకే ఈ రోజున సరస్వతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.  ఈ కారణంగానే వసంత పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారు. విద్య, జ్ఞానం, సంగీతం,  కళలకు దేవత అయిన సరస్వతి దేవి అనుగ్రహం కోసం ప్రతి ఇంట్లో దేవిని ప్రతిష్టించి పూజించుకుంటారు. సరస్వతి దేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని తప్పుడు దిశలో ప్రతిష్టించడం వల్ల పూజ చేసినా దానికి తగిన ఫలితాలు పొందలేము. ఇంట్లో సరస్వతి దేవి చిత్రపటం లేదా విగ్రహం ఎలా ప్రతిష్టించాలి,  ఏ దిశలో ప్రతిష్టించాలి? అలా ఎందుకు చేయాలి? తెలుసుకుంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం సరస్వతి దేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించడానికి తూర్పు దిశ శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో సరస్వతి దేవిని ఉంచి పూజించడం వల్ల జ్ఞానం,  సరస్వతి దేవి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.


తూర్పు దిశ మాత్రమే కాకుండా  ఈశాన్య దిశను శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో సరస్వతి దేవిని ప్రతిష్టించడం వల్ల సంపద పెరుగుతుంది,  కెరీర్ లో విజయానికి మార్గం సుగమం అవుతుంది.

ఆనందం,  శ్రేయస్సును పెరగాలంటే ఉత్తర దిశలో సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించవచ్చు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది.  వృత్తి,  ఉద్యోగంలో విజయాన్ని తెస్తుంది.


సరస్వతి దేవి ఏ భంగిమలో ఉండాలి?

వసంత పంచమి రోజున కమలం పువ్వుపై కూర్చున్న సరస్వతి దేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు.  ఈ ఆసనాన్ని ఏకాగ్రతకు చిహ్నంగా భావిస్తారు.

సరస్వతి దేవి ముఖం ఉల్లాసంగా ఉండాలి. సరస్వతి దేవి  ఫోటో లేదా విగ్రహం ముఖం విచారంగా అస్సలు ఉండకూడదు.  సరస్వతి రెండు చేతుల్లోనూ వీణను పట్టుకుని ఉంటుంది. దీనిని సంగీతం,  కళలకు చిహ్నంగా భావిస్తారు.

                              *రూపశ్రీ