సిల్లీ ఫెలో - 109

 

 

సిల్లీఫెలో - 109

- మల్లిక్


ఏకాంబరం వెళ్ళిన తర్వాత మోహన్ స్నానం చేసి న్యూస్ పేపర్ పట్టుకుని కూర్చున్నాడు. ఉదయం లేవగానే చదవగా మిగిలిన ఆ కాస్త న్యూస్ చదివి ముగించాడు. ఆఫీసు టైమైవుతుంది... భోజనం వడ్డించమని అడగడానికి వంట గదిలోకి వెళ్ళాడు మోహన్. అక్కడ రామలక్ష్మి లేదు. బెడ్ రూంలోకి వెళ్ళాడు. ఆమె అక్కడా లేదు.

పూజగది దగ్గర కెళ్ళి గుమ్మంలో నిలబడి చూశాడు.

రామలక్ష్మి కళ్ళు మూస్కుని, రెండు చేతులూ జోడించి దండం పెడ్తూ దీక్షగా పూజ చేస్కుంటోంది.

మరి సీత ఎక్కడుంది? అనుకున్నాడు మోహన్.

స్నానం చేస్తుందేమో?

బాత్రుం వైపు వెళ్ళాడు.

లోపలి నుండి నీళ్ళశబ్దం వినిపిస్తోంది.

సీత స్నానం చేస్తుంది. పూర్తిగా బట్టలు విప్పి స్నానం చేస్తుంది!

ఆ ఆలోచనకే అతని నరాలు జివ్వుమన్నాయి. అందుకే అతనికి దుర్బుద్ధి పుట్టింది.

దీక్షగా పూజ చేస్కుంటున్న రామలక్ష్మి ఓ పది నిమిషాలదాకా ఆ వైపు రాదని తెలుసు. ఆ బాత్ర్రూమ్ తలుపుకి చిన్న రంధ్రం ఉందనీ అతనికి తెలుసు. తలుపుకి ఓ మూలగా ఆ రంధ్రం ఉన్న విషయం సీతకి తెలీదన్న విషయం కూడా అతనికి తెలుసు.
దడదడలాడే గుండెతో వంగి రంధ్రంలోంచి లోపలికి చూశాడు మోహన్.

అతని గుండె కాస్సేపు ఆగి మళ్ళీ భారంగా కొట్టుకాసాగింది.

లోపల...

పచ్చని శరీరంతో... అందమైన ఒంపుల్తో స్నానం చేస్తూ సీత!

  
శరీరంలోని రక్తం మొత్తం మెదడులోనికి తన్నినట్టు తల భారంగా అయిపోయింది అతనికి. క్రమక్రమంగా అతని శరీరం వేడెక్కసాగింది.