కేవలం 5నిమిషాల పారాయణ.. జీవితంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది..!

 

కేవలం 5నిమిషాల పారాయణ.. జీవితంలో అన్ని సమస్యలు  పరిష్కరిస్తుంది..!

మనిషికి కష్టం వస్తే మొదట దేవుడే గుర్తు వస్తాడు. చాలామంది కష్టం ఎదురవ్వగానే దేవుడి ముందు కూర్చుని పూజలు చేయడం,  తమ సమస్యకు తగినట్టు ఏవైనా శ్లోకాలు, జపాలు చేయడం  చేస్తుంటారు.  అయితే జీవితంలో వచ్చే ఏ సమస్యకు అయినా అండగా ఉండి సమస్యను పరిష్కరించే అతిశక్తివంతమైన పారాయణ ఒకటి ఉంది. కేవలం 5 నిమిషాల సమయం వెచ్చిస్తే చాలు.. జీవితంలో చాలా గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకీ అంత శక్తివంతమైన పారాయణ ఏంటి? ఎలా చేయాలి? తెలుసుకుంటే..

హనుమాన్ చాలీసా..

తులసీ దాసు గారు ఆ రామ కథను రామచరిత మానస్ గా ఈ భారతీయులకు అందించారు. అయితే దానికంటే కూడా హనుమాన్ చాలీసా చాలా గుర్తింపు పొందింది. హనుమాన్ చాలీసా గురించి తెలియని, వినని,  జీవితంలో ఒక్కసారైనా పారాయణ చేయని హిందూ భారతీయుడు అంటూ ఉండడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  అయితే హనుమాన్ చాలీసాకు ఇంత శక్తి ఎలా వచ్చింది? ఇన్ని శ్లోకాలు, ఇన్ని మార్గాలు ఉండగా హనుమాన్ చాలీసా ఇంత శక్తివంతమైన స్తోత్రంగా ఎలా గుర్తింపు పొందింది?

తులసీ దాసు.. హనుమాన్ చాలీసా..

హనుమాన్ చాలీసాను తులసీదాసు గారు ఒక ప్రణాళికా బద్దంగా రూపొందించినది కాదు.  ఇది చాలా విచిత్ర సంఘటన మధ్య అశువుగా ఆయన నోటి నుండి వచ్చింది.  తులసీదాసు గారెని అక్భర్ బంధించి, చెరసాలలో పెట్టమని ఆజ్ఞ జారీ చేశాడు.  అప్పుడు ఊహించని విదంగా అక్బర్ మహల్ లోకి వేలాది వానరాలు స్వైర విహారం చేస్తూ వచ్చేసాయి.  తులసీ దాసు గారు మాత్రం కళ్లు మూసుకుని ఏదో చదువుకుంటూ ఉన్నారట.  ఇదంతా గమనించిన అక్భర్ తులసిదాసు గారెతో మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి, మిమ్మల్ని బంధించి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఏదో జరుగుతోంది అని చెప్పారట.  తులసీదాసు గారు వెనక్కు తిరిగి వస్తుండగా ఆయనకు ఒకచోట పెద్ద కొండ మీద ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారట.

తులసిదాసు గారు ఆంజనేయ స్వామిని చూసిన ఆనందంలో తన్మయత్వంలో అశువుగా ఒక స్తోత్రం చేశారు. ఆ స్తోత్రమే హనుమాన్ చాలీసా. నిజానికి హనుమాన్ చాలీసా హిందీ లో కాదు.. అది అయోధ్య బాషలో ఉంటుందట.   ఆ స్తోత్రం వినేసరికి ఆంజనేయ స్వామి పొంగిపోయారట.  వెంటనే తులసీదాసుతో.. నీ స్తోత్రం విని పొంగిపోయాను,  నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారట. అలా అడగగానే తులసీదాసు గారేమో..నాకేమీ వద్దు.. మీ దర్శనమే చాలా గొప్ప వరం అన్నారట. అయినా సరే.. ఏదో ఒక వరం ఇవ్వాల్సిందే అని హనుమంతుడు తులసిదాసుతో .. ఎవ్వరైతే  నువ్వు ఇప్పుడు చెప్పిన స్తోత్రాన్ని భక్తితో రోజూ చదువుతూ ఉంటారో.. వారి రక్షణ బాధ్యత నాదే.. నేను వారిని ఎప్పుడూ ఏ సమస్యలో అయినా సరే తప్పకుండా కాపాడతాను అని మాట ఇచ్చాడట.

స్వయంగా హనుమంతుడే రక్షణ  బాధ్యత నాదని చెప్పాడు. అందుకే హనుమాన్ చాలీసా అంత శక్తివంతమైన స్తోత్రం అయ్యింది.  చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను ఎంతో తన్మయత్వంతో చెబుతూ ఉంటారు.  ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తుంటే హనుమంతుడే రక్షణ కవచంలా నిలుస్తాడు.  అలాంటి వారిని ఏ గ్రహ బాధలు ఇబ్బంది పెట్టవు,  ఏ చెడు శక్తులు వారి వైపు వెళ్లలేవు.  జీవితంలో ఎన్నో సమస్యలు క్లిష్ట స్థాయి నుండి సాధారణ సమస్యలుగా మారి మాయమవుతాయి. అంతటి శక్తి హనుమాన్ చాలీసాకు ఉంది. కేవలం 5నిమిషాలు వెచ్చించి  హనుమాన్ చాలీసాను రోజూ పారాయణ చేస్తుంటే జీవితంలో చాలా గొప్ప మార్పులు కనిపిస్తాయి.

                            *రూపశ్రీ.