ధనుర్మాసంలో రోజూ ఈ ఒక్క పని చేసినా చాలు.. భగవంతుని అనుగ్రహం తథ్యం..!

 

ధనుర్మాసంలో రోజూ ఈ ఒక్క పని చేసినా చాలు.. భగవంతుని అనుగ్రహం తథ్యం..!

ధనుర్మాసం అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం,  ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం,  ముగ్గులు పెట్టడం,  విష్ణుభగవానుడిని మధుసూదన రూపంలో ఆరాధించడం,  నైవేద్యాలు,  విష్ణుసహస్రనామ పారాయణ,  తిరుప్పావై పఠనం.. ఇలా చాలా ఉంటాయి.  చేసుకున్నవారికి చేసుకున్నంత భగవంతుని సేవ ఉంటుంది ఈ ధనుర్మాసంలో. అయితే ఇవన్నీ చేయలేని వారు, అనారోగ్యం,సరైన సౌకర్యాలు,  వెసులుబాట్లు లేనివారు కొందరు ఉంటారు.  అలాంటి వారికి పురాణ పండితులు ఒక చక్కని మార్గాన్ని ఉపదేశిస్తున్నారు.  ధనుర్మాసంలో భగవంతుని సేవ ఏది చేయలేక పోయినా ఆళ్వారుల చరిత్రలు మాత్రం తప్పనిసరిగా వెంటే చాలని అంటున్నారు. అసలు ఎవరు ఈ ఆళ్వార్లు? వీరి గురించి తెలుసుకుంటే..

ఆళ్వార్లు..

మహావిష్ణువు ఆయుధాలు 12.  ఆ ఆయుధాలను ఈ సృష్టిలో దుష్ణ శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఆ భగవంతుడు ఉపయోగిస్తాడు.  చెడు వ్యక్తులను అంతమొందించడం వీటి కర్తవ్యం.  అయితే కలియుగంలో దుష్ణులు ఎక్కువ.  వారిని అంతం చేసుకుంటూ పోతే ఈ భూమి మీద ప్రజలు అనేవారు మిగలరు. ఈ కారణంగానే ఆ మహా విష్ణువు తన ఆయుధాలకు మానవ జన్మ ప్రసాదించారు.  మహా విష్ణువు 12 ఆయుధాలు,  12 మంది ఆళ్వార్లుగా జన్మించి ప్రజలను భక్తి మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేశారు. ఈ ఆళ్వార్ల భక్తి, వారికి భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం,  వారి కరుణ చాలా అమోఘమైనవి.  ఈ ఆళ్వార్ల గురించి తెలుసుకుంటే..

ఆళ్వార్ల పేర్లు..

ఆళ్వార్లలో మొదటివాడు పోయ్ గై ఆళ్వార్.  భూతత్తాళ్వార్,  పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, నమ్మళ్వార్,  మధురకవి ఆళ్వార్,  కులశేఖర ఆళ్వార్,  పెరియాళ్వార్, ఆండాల్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్.


ఈ 12మంది ఆళ్వారులు, మహా విష్ణువు ఆయుధాల అంశలుగా భూమి మీద ఆళ్వార్లుగా జన్మించారు. 64మంది నాయనార్లు శైవాంశ సంభూతులుగానూ,  8మంది మధ్వాచార్యులు కలియుగంలో మానవజాతి సముద్దరణకు,  మానవజాతి మనుగడకు భంగం కలుగకుండా కాపాడాలనే ఉద్దేశ్యంతోనూ,  ముఖ్యంగా ఈ కలియుగంలో ప్రజలు కలిపురుష ప్రభావానికి లోనుకాకుండా ప్రజలను  భగవంతుని పాదాలకు దగ్గర చేసేందుకు ఈ భూమి మీద జన్మించారు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఈ ఆళ్వార్ల చరిత్రలు తెలుసుకోవడం వల్ల భగవంతుని అనుగ్రహానికి దగ్గర కాగలుగుతారు.

                               *రూపశ్రీ.