శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకండి.. చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..!

 

శనివారం రోజు  ఈ పొరపాట్లు చేయకండి.. చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..!

హిందువులు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి,  నరసింహ స్వామి,  హనుమంతుడు లాంటి చాలా దేవతలను పూజిస్తూ ఉంటారు. అయితే కేవలం వీరికే కాదు.. ముఖ్యంగా న్యాయ దేవుడు అని పిలువబడే శని మహాత్ముడికి శనివారం చాలా ముఖ్యం. శనివారం రోజు చేసే పరిహారాలు శనిగ్రహంతో ముడిపడి ఉంటాయి. శనిదేవుడికి పక్షపాతం ఉండదు. కర్మలను బట్టి ఫలితాలు ఇస్తుంటాడు.  ఒక వేళ శనిగ్రహ దశ బాగాలేకున్నా,  శని వక్ర దృష్టి ఉన్నా శనివారం పాటించే పరిహారాల వల్ల శనిదేవుడు తృప్తి చెంది,  పెద్ద కష్టాన్ని కూడా చిన్నగా గడిచిపోయేలా చేస్తాడని చెబుతారు. అయితే శనివారం కొన్ని పనులు చేయకుండా ఉండటం వల్ల అనవసరమైన బాధలు,  ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటివి నివారించుకోవచ్చని చెబుతారు. ఒకవేళ చేయకూడని పనులు చేస్తే శని దేవుడి ఆగ్రహానికి గురై.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతారు. ఇంతకీ శనివారం చేయకూడని పనులేంటో తెలుసుకుంటే..

శనివారం పొరపాటున కూడా చేయకూడని పనులు..

హిందూ మతం నమ్మకాల  ప్రకారం పొరపాటున కూడా శనివారం నూనె కొనకూడదట. దీనిని అశుభంగా పరిగణిస్తారట. శనివారం నూనె కొంటే ఇంటికి ప్రతికూలత,  దురదృష్టం వస్తాయని చెబుతారు. అలాగే, శనివారం ఆవనూనె కొనకుండా ఉండాలట. ఇది జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుందని చెబుతారు.  శనివారం  రోజున మినుములు, ఉప్పు, నల్ల దుస్తులు లేదా ఇనుప వస్తువులు  కొనకుండా ఉండాలి. ఇది దురదృష్టానికి కారణమవుతుంది. శనివారాల్లో  జుట్టు కత్తిరించుకోవడం కూడా మానుకోవాలట.

శనివారం ఏం చేయాలి?

శనివారం రోజు  శని మహాత్ముడిని  పూజించాలి. నల్లని వస్తువులను దానం చేయాలి. శని దేవుడికి సంబంధించిన మంత్రాలను పఠించాలి.  ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా శనివారం రోజు శనిదేవుడిని పూజించాలి.  శనిదేవుడికి సంబంధించిన మంత్రాలు,  మంత్ర జపం చేయాలి.  శనికి తైలాబిషేకం, నువ్వుల  నూనె దీపం,  నువ్వుల దానం వంటివి చేసినా మంచి ఫలితం ఉంటుంది.

                          *రూపశ్రీ.