రాగి ఉంగరం ధరించడానికి సరైన నియమాలు ఏంటి.. ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి!
రాగి ఉంగరం ధరించడానికి సరైన నియమాలు ఏంటి.. ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి!
ఆభరణాలు ధరించడం భారతీయుల జీవితంలో ఒక భాగం. ఆభరణాలు కేవలం అందానికి మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ అటు ఆరోగ్యాన్ని, ఇటు గ్రహాల ప్రభావాన్ని నియంత్రించడంలో కూడా ఆభరణాలు ప్రభావవంతంగా ఉంటాయి. అయితే చాలామంది వెండి, బంగారు వంటి లోహాలు మాత్రమే ధరించడానికి ఇష్టపడతారు. కానీ రాగితో తయారు చేసిన ఆభరణాలు ధరించేవారు కొందరు ఉంటారు. ముఖ్యంగా రాగి కడియాలు, రాగి ఉంగరాలు చాలా మంది చేతుల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజాలు ఏంటి? రాగి ఉంగరం ధరించడానికి సరైన నియమాలు ఏంటి? వివరంగా తెలుసుకుంటే..
రాగి..
రాగి అటు వైద్యపరంగా, ఆయుర్వేద పరంగా, ఇటు జ్యోతిష్యం పరంగా కూడా చాలా మంచి లోహంగా పరిగణించబడుతుంది.
ఆరోగ్యానికి దివ్య ఔషధం..
హిందూ మతం, జ్యోతిషశాస్త్రంలో రాగిని పవిత్ర లోహంగా పరిగణిస్తారు. ఇది సూర్యుడు, అంగారక గ్రహానికి సంబంధించిన లోహం. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే, అది సామాజిక గౌరవం లేకపోవడాన్ని, ఆరోగ్య సమస్యలు కలగడానికి దారి తీస్తుంది.
జ్యోతిష్య, శాస్త్ర ప్రయోజాలు..
జ్యోతిష్యం, హస్తసాముద్రికం ప్రకారం, ఉంగరపు వేలుకు రాగి ఉంగరం ధరించడం వల్ల సూర్య దోష ప్రభావాలు తగ్గుతాయి. ఇది కీర్తిని పెంచడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.
ఆయుర్వేదం ప్రకారం..
ఆయుర్వేదం ప్రకారం రాగి సహజంగా యాంటీ బాక్టీరియల్. ఈ లోహం చర్మంతో కనెక్షన్ లో ఉంటే అది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. రాగి ఉంగరం ధరించడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
కీళ్ల నొప్పులు, రక్తపోటు..
పురాతన వైద్య పద్ధతుల ప్రకారం రాగి ధరించడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ తగ్గుతాయి. ఇది శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుందని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని కూడా నమ్ముతారు.
రాగి ఉంగరం ధరించడానికి నియమాలు..
రాగి ఉంగరాన్ని ఎల్లప్పుడూ ఉంగరపు వేలుకు ధరించాలి .
రాగి ఉంగరాన్ని ధరించే ముందు, గంగా జలంతో లేదా శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆదివారం సూర్యోదయ సమయంలో దీనిని ధరించడం ఉత్తమమని భావిస్తారు.
*రూపశ్రీ.