English | Telugu

ఎన్టీఆర్‌తో పెట్టుకున్నందుకు బాల‌య్య‌కు `బొమ్మ‌` క‌నిపిస్తోంది!

on Mar 6, 2018


 

నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న సినీ జీవితంలోనే అత్యంత ఛాలెంజింగ్ సినిమా చేస్తున్నాడు. అదే.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌. త‌న తండ్రి ఎన్టీఆర్ జీవిత క‌థ‌ని సినిమాగా మ‌ల‌చాల‌నుకోవ‌డం నిజంగా తెలివైన ఎత్తుగ‌డే.  ఏ సినిమా అయినా.. అంతిమ ల‌క్ష్యం... లాభాలు ఆర్జించ‌డం అయితే - ఈ సినిమా విడుద‌ల‌కు ముందే అత్యంత భారీ టేబుల్ ప్రాఫిట్ ద‌క్కించుకోవ‌డం ఖాయం.  పెట్టుబ‌డి కి మించిన రాబ‌డి అనే ప‌రీక్ష‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ప్ప‌కుండా పాస్ అయిపోతుంది. కాక‌పోతే.. మేకింగే చాలా క‌ష్టం.  ఈ విష‌యంలో బాల‌య్య ముందు చాలా స‌వాళ్లున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఏఎన్నార్‌, సావిత్రి, బ‌స‌వ‌తార‌కం మొద‌లుకుని... నారా చంద్ర‌బాబు నాయుడు, ల‌క్ష్మీ పార్వ‌తి వ‌ర‌కూ కొన్ని కీల‌క పాత్ర‌ల్ని చూపించాలి. ఒక‌ట్రెండు స‌న్నివేశాలైనా స‌రే.. ఎన్టీఆర్‌తో ప‌రిచ‌యం ఉన్న ప్ర‌ముఖులంద‌రినీ ప్ర‌స్తావించాలి. అదే... అస‌లైన స‌వాల్‌. ఏఎన్నార్‌, సావిత్రిల‌ను పోలిన న‌టీన‌టుల్ని ఎంపిక చేయ‌క‌పోతే ఆయా పాత్ర‌లు తేలిపోతాయి. ఎన్టీఆర్‌గా మార‌డం కూడా బాల‌య్య‌కు స‌వాలే. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ పోలిక‌లు బాల‌య్య‌లో అస్స‌లు క‌నిపించ‌వు. ఎంత జిమ్మిక్కు చేసినా...  బాల‌య్యే క‌నిపిస్తాడు. ఎన్టీఆర్ లా మార‌డానికి బాల‌య్య చాలా చాలా క‌ష్ట‌ప‌డాలి. ఇప్పుడున్న భారీ ప‌ర్స‌నాలిటీ కొంచెం త‌గ్గించాలి. పైగా ఎన్టీఆర్ జీవితంలో కొన్ని వివాదాస్ప‌ద కోణాలున్నాయి. చంద్ర‌బాబుని నెగిటీవ్‌గా చూపించ‌క‌పోతే... ఓ వ‌ర్గం వేలెత్తి చూపిస్తుంది. ఒక‌వేళ నిజాలు దాస్తే.. మ‌రో వ‌ర్గం త‌ప్పుబ‌డుతుంది. అన్నింటికీ మించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ పై సానుభూతి పెంచ‌డానికి ఇదో అస్త్రం. కాస్త అటూ ఇటూ అయినా.. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ మూలాధార‌మైన ఓట్లు గ‌ల్లంత‌య్యే ప‌రిస్థితి ఉంది. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకుని బ‌యోపిక్‌ని రూపొందించాల్సిందే. మ‌రి.. ఈ స‌వాళ్ల‌న్నీ బాల‌య్య ఎలా దాటుకొస్తాడో చూడాలి.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here