రేపటి నుంచి ఇంకొంచెం ఫన్ తో `ఎఫ్2`
on Jan 25, 2019
సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో వంద కోట్ల గ్రాస్ తో వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు హైదరాబాద్ లోని ఆవాసా హోటల్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. `` వంద కోట్ల క్లబ్ లో మా సినిమా చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలన్న ఎగ్జైటింగ్ లో ఉన్నాం. అయితే గతంలో లాగా యాభై రోజుల, వంద రోజుల ఫంక్షన్స్ లేవు . ఇక మీదట యాభై కోట్ల క్లబ్, వంద కోట్ల క్లబ్ అనే వే ఉంటాయి . మా సినిమాతో ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. అదేమిటంటే... ఎఫ్ 2 వంద కోట్ల షీల్డ్స్ రెడీ చేసి మా సినిమా ఆడుతున్న థియేటర్స్ కు పంపించనున్నాం. ఇక మీదట కూడా ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నాం అన్నారు దిల్ రాజు. ఇంకా ఆయన మాట్లాడుతూ...`` ఇటీవల తిరుపతి మా టీమ్ అంతా వెళ్లాం. అక్కడ ఓ థియేటర్ లో సినిమా చూశాం. ఆడియన్స్ ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు మా డైరక్టర్ అనిల్ ...ఈ సినిమా కోసం చేసిన నాలుగైదు బిట్ సీన్స్ ఎడిటింగ్ రూమ్ లో ఉన్నాయి . వాటిని కూడా యాడ్ చేద్దామా ? అన్నాడు. ఓకే అన్నాము...రేపటి నుంచి ఆ నాలుగు సీన్స్ బిట్స్ కూడా యాడ్ చేస్తున్నాం. కచ్చితంగా కొత్తగా యాడ్ చేసే బిట్ సీన్స్ ప్రేక్షకులను ఫుల్ గా నవ్విస్తాయన్నారు.