ఇప్పటికీ తండ్రి సలహానే పాటిస్తున్న వెంకటేష్
on Jan 17, 2020

ప్రతి ఒక్కరికి వయసుతోపాటు పద్ధతులు, అలవాట్లు మారుతూ ఉంటాయి. కాలంతో పాటు కొన్ని సంప్రదాయాలను సైతం మన సమాజం మార్చుకుంటూ ఉంది. ఈ కాలంలో పెద్దల సలహాలను ఎంతమంది తు.చ తప్పకుండా పాటిస్తున్నారో తెలియదు. కానీ, విక్టరీ వెంకటేష్ మాత్రం ఇప్పటికీ ఓ విషయంలో తండ్రి సలహానే పాటిస్తున్నారు. ప్రతిరోజు ఫ్యామిలీతో కలిసే లంచ్, డిన్నర్ ఆయన చేస్తున్నారు. దీనికి కారణం వెంకటేష్ తండ్రి, మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు ఇచ్చిన సలహానే.
"ప్రతి రోజు మా ఇంట్లో అందరం కలిసే లంచ్, డిన్నర్ చేస్తాం. అది కంపల్సరీ. నాన్నగారు 'మీరు ఎక్కడైనా తిరగండి. ఎక్కడికైనా వెళ్లండి. లంచ్ టైం కి, డిన్నర్ టైంకి ఇంట్లో ఉండాలి. దాని తర్వాత మీరు ఏమైనా చేసుకోండి' అని చెప్పారు. దాంతో అది మాకు ఒక అలవాటు అయ్యింది. ఇప్పటికీ అలవాటును కొనసాగిస్తున్నాం. కుటుంబంతో కలిసి భోజనం చేస్తుంటాను. నా జీవితంలో ప్రతిరోజు అదొక బ్లాక్ బస్టర్ మూమెంట్" అని వెంకటేష్ అన్నారు. ఒకప్పుడు అన్ని రకాల వంటలను చాలా ఇష్టంగా తినే వాడిని అనీ, ఇప్పుడు వయసును దృష్టిలో పెట్టుకొని ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను అని ఆయన చెప్పారు. తనకు వంట చేయడం చాలా ఇష్టం అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



