Home

»

Latest News

మ‌రో ప్ర‌యోగం చేస్తోన్న సంక‌ల్ప్ రెడ్డి!!

Jan 25, 2019 1:39PM

ఘాజీ , అంత‌రిక్షం లాంటి విభిన్న‌మైన క‌థ‌ల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారు డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ రెడ్డి. ఘాజీ సినిమా మంచి ఘ‌న విజ‌యం సాధించ‌గా,  అంత‌రిక్షం సినిమా  మాత్రం ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. అయినా కూడా సంక‌ల్ప్ రెడ్డి ఎక్క‌డా త‌గ్గ‌కుండా మ‌రో ప్ర‌యోగానికి సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది. ఈసారి కూడా మ‌రో విభిన్న‌మైన కాన్సెప్ట్ తో రాబోతున్న‌ట్టు స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం సంక‌ల్ప్ రెడ్డి త‌ర్వాత చిత్రం మంచు ఖండం అంటార్కిటికా నేప‌థ్యంలో ఉండ‌బోతోంద‌ట‌. ఓ తెలుగు ఎక్స్ ప్లోర‌ర్ అంటార్కిటికా వెళ్ల‌డం.. అక్క‌డ రీసెర్చ్ సెంట‌ర్ లో జాయిన్ కావ‌డం.. ఆ త‌రువాత  అక్క‌డ అత‌ను ఎద‌ర్కొనే స‌వాళ్ల నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై క్లారిటీ  రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com