దుర్యోధన గెటప్ లో పిచ్చెక్కించిన బాలకృష్ణ
on Mar 29, 2018
ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా 60 నుండి 70 గెటప్ ల దాకా వేస్తానని బాలకృష్ణ ఇంతకు ముందు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే, మరి ఈ సినిమా లాంచ్ కి బాలకృష్ణ ఏ గెటప్ లో వస్తాడు అని ఎదురుచూసిన అభిమానులకి దుర్యోధన గెటప్ లో కనిపించి పిచ్చెక్కించాడు. ఈ సినిమా ముహూర్తంలో భాగంగా, బాలకృష్ణ పైన దాన వీర శూర కర్ణ ఓపెనింగ్ నాటి షాట్ తెరకెక్కించారు. తెలుగువాడు గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే- ఏమంటివి ఏమంటివి డైలాగ్ తో బాలకృష్ణ అదరగొట్టాడు. డైరెక్టర్ తేజ రేపు రామకృష్ణ స్టూడియో లో వేసిన ఎన్టీఆర్ చెన్నై ఇంటి సెట్లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నాడు. ఈ షెడ్యూల్ కేవలం ఒక్క రోజులో ముగుస్తుంది. మళ్ళీ, జూన్ చివరికి రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. త్వరగా పూర్తి చేసి, దసరాకి విడుదల చేస్తామని తేజ ప్రకటించారు. చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా కోసం బాలయ్య పగలు, రాత్రి అని లేకుండా పని చేద్దాం అని డిసైడ్ అయినట్టున్నారు. ఈ రోజు జరిగిన ఓపెనింగ్ కార్యక్రమానికి గౌరవ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సినిమా, రాజకీయ ప్రముఖులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు.
Also Read