60 కోట్లతో ఎన్టీఆర్ బయోపిక్...
on Feb 4, 2018
బాలకృష్ణ, తేజ కాంబోలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా గురించి వార్తలు బయటకు వచ్చినా ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే... వచ్చే మార్చి నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని, దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయట..హాలీవుడ్ నుంచి వచ్చిన ఓ టీమ్ ఈ చిత్రంకోసం రాత్రింబవళ్ళు పని చేస్తోందని, సినిమాలోని 72 క్యారక్టర్లకు సంబంధించి స్కెచ్ లు రూపొందిస్తోందని అంటున్నారు. అంతేకాదు.. ఓ రీసర్చ్ బృందం ఎన్టీఆర్ గురించి బాగా తెలిసిన 125 మంది నుంచి సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేసి ఆ తరువాత ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి, యువకుని, మధ్య వయస్కుని పాత్రలను వేర్వేరు నటులు, సీనియర్ రోల్ ని బాలయ్యే పోషిస్తాడని ఈ చిత్ర వర్గాలు తెలిపాయి.