వెంకటేశ్‌తో ఆ దర్శకుడేంటి?
on Nov 6, 2019
తమిళంలో ధనుష్ హీరోగా కలైపులి ఎస్. థాను నిర్మించిన ‘అసురన్’ తెలుగు రీమేక్‌కు వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేశ్‌బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను తెలుగు రీమేక్ నిర్మిస్తారు. వెంకటేశ్ కోసం ‘అసురన్’ స్పెషల్ షో వేశారాయన. చూసి చూడంగానే వెంకీకి నచ్చేసింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే... ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది క్వశ్చన్. ‘రాజుగారి గది 3’తో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోని ఓంకార్ పేరు తెర మీదకు వచ్చింది. అన్నీ కుదిరితే ఈ పాటికే వెంకటేశ్, ఓంకార్ కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
వెంకటేశ్‌తో ‘రాజుగారి గది 2’ తీయాలని ఓంకార్ ప్రయత్నించాడు. కానీ, ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో నాగార్జునతో తీశానని మూడో గది విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఒకవేళ ‘రాజుగారి గది 2’లో వెంకటేశ్ నటిస్తే ఎలా ఉండేదో? గతం గతః. ప్రజెంట్‌లోకి వస్తే... ‘అసురన్’ రీమేక్ దర్శకుడిగా ఓంకార్ పేరు వినిపించగానే కొందరు ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా తమిళంలో ‘అసురన్’ చూసిన తెలుగు ప్రేక్షకులు. వెంకటేశ్‌తో ఆ దర్శకుడేంటి? అని కామెంట్లు చేస్తున్నారు. ఇదొక రూమర్‌గా మిగిలిపోవాలని కోరుకుంటున్నారు. త్వరలో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన ‘వెంకీమామ’తో వెంకటేశ్ థియేటర్లలోకి వస్తారు. ఆ తర్వాత ‘అసురన్’ రీమేక్ పట్టాలు ఎక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.