కామ కథలు... తెలుగులో కొత్తగా!
on Nov 6, 2019

లస్ట్ అంటే తెలుగులో కామం అని అర్థం. హిందీలో ‘లస్ట్ స్టోరీస్’ నెట్ ఫ్లిక్స్‌లో ఓ సంకలనం విడుదలైంది. టైటిల్‌ను తెలుగులో ట్రూ ట్రాన్స్‌లేషన్ చేస్తే ‘కామ కథలు’ అని అర్థం. అందులో నాలుగు వేర్వేరు కథలను నలుగురు పేరున్న దర్శకులు కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ తెరకెక్కించారు. నాలుగు కథల్లో సెంటర్ పాయింట్ ఒక్కటే... కామం! లీగల్, ఇల్లీగల్ ఎఫైర్స్‌ను బోల్డ్‌గా తీసి పడేశారు. దాంతో దేశవ్యాప్తంగా ‘లస్ట్ స్టోరీస్’ హాట్ టాపిక్ అయింది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ‘లస్ట్ స్టోరీస్’ను తెలుగులో తీస్తున్నారు. ఓ కథకు తరుణ్ భాస్కర్, ఇంకో కథకు నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట హిందీలో చూసేసిన ‘లస్ట్ స్టోరీస్’ను తెలుగులో తీయడం ఎందుకని నందినీరెడ్డి ప్రశ్నించారు. తాను తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించడం లేదన్నట్టు మాట్లాడారు. అయితే... నందినీరెడ్డి దర్శకత్వంలో ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్ షూటింగ్ పూర్తి చేశానని అమలాపాల్ ట్వీట్ చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. నందినీరెడ్డి దర్శకత్వం వహించారని! ఇప్పుడు నందినీరెడ్డి ఏం చెబుతున్నారంటే... ‘హిందీలో చూసేసిన కథలు ఏవీ తెలుగులో ఉండవు’ అని! కొత్త కథలతో తెలుగులో తీశారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



