ఏది శాశ్వతం

హితులుఎవరు..! సుతులుఎవరు..!!
మాయ మాయ.. అంతా మాయ ..!!
జగమే మాయ మనిషి బతుకే మాయ..!!
ఎవరికెవరు పుత్రుల్..!మిత్రుల్ ..!!
నీపాపమెంత ..!పుణ్యమెంత..!!
ఎవరికెరుక......!!!!!!
ఆటుపోట్లు..!సూటుపోట్లు..!!
హృదయపోట్లు..! ఎవరికోసం..!!
విమర్శరాని..!ప్రశంసరాని..!!
నీప్రశంసతో నాదు:ఖాల్..!!
నీవిమర్శతో సుఖాల్..!!
తీరవు..!తీరవు..!తీరనే తీరవు..!!
వస్తేరా..!పోతేపో ..!!
ఎవరురమ్మనారు..!ఎవరుపొమ్మన్నారు..!!
నీవురాకపోతే..! కాలమాగునా..!!
అంతేకదా .....!!!!!
ఆగితే ఆగని..!సాగితే సాగని..!!
భయాల్లేవ్..!బంధాల్లేవ్..!!
దేహ..జీవాల్..మధ్య మమతల్లేవ్..!!
నాకెరుకవ్వావ్.. ఏవీశాశ్వతం..!!
రుచులెందుకు..!సుచులెందుకు..!!
ఘడియ కూడ నమ్మకం లేని దేహముల్..!!
కోపమేల..!శాపమేల..!!
కష్టములకు భయమేల..!!
సుఖములకు ఆనందమేల..!!
కావేవి శాశ్వతం నాకెరుకలే ఓ నీలకంఠ..!!
.jpg)
కలం:-అఖిలాశ
- జాని.తక్కెడశిల..!



