కవిత సాక్షి గా...!

అదే మరి
అర్ధాలు,అపార్ధాలు
వ్యర్ధాలు,వ్యవహారాలు
కాస్తంత పక్కన పెడితే,
పయనించిన మన దారినలా
వెనక్కి తిరిగి చూస్తే
నీకేమనిపిస్తుందో కానీ,
నాకైతే
ప్రవహిస్తున్న స్తబ్దు కాలాన్ని
అనుభూతుల ఆనకట్టతో
అలా నిలిపుంచుకున్నాను..!
కరిగిపోయే రోజుల సమయాన్ని
చూసిన నా మదికీ..,
ఒక క్షణం రెండు ముక్కలయ్యి,
వికర్షించుకుంటున్న సంఘటన్ని చూసి..
యుగాలనాటి మన ప్రమాణం,
ఫక్కున నవ్వుతున్నట్లుంది..!
నిజం
చిన్నగానే పట్టుకున్నా కలాన్ని
పాళీ విరిగిందెందుకో...
అ..సంపూర్తిగా మిగులుతున్న
కవిత సాక్షి గా!!!!!
-Raghu Alla



