TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తెలుగు గీము (ఇల్లు)
1. ఆ|| వె|| ముందు వాకిలలికి ముగ్గులిడు మగువ
అంచురవిక వాణి - అమరెలంగ
పసుపువేప నొడల - పారాణిపాదాలు
వెలుగు చున్నదదిర - తెలుగు గీము
2. ఆ|| వె|| ఉట్టి మీద యూగు - గట్టి పెరుగు కుండ
అటక మట్టు మీద - ఆవజాడి
క్రింద కుదురు మీద చింత బొట్టల బుట్ట
చెలుగు ధాన్యరాశి - తెలుగు గీము
౩. ఆ|| వె|| సుబ్బలక్ష్మి పాడు - సుప్రభాతస్వరం
పొద్దు పొడవకుండ - బోరుమంటు
ఇంటి మద్య నుండి - వినిపించునట్టిల్లు
కులుకు తోరణమది తెలుగు గీము
4. ఆ|| వె|| పనసతొనల కన్న - పంచదారలకన్న
జుంటు తేనె కన్న - జున్నుకన్న
చెరుకు రసము కన్న - చెలియ మాటలకన్న
తేట తెలుగు మాట - తేనెతిపి
అనుచునుడివె - యోగివేమనపుడు
రచన : శ్రీ పోతనపల్లి పాపయ్య