Publish Date:Jan 31, 2013
Publish Date:Sep 21, 2012

EDITORIAL SPECIAL
  కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఇక మంత్రులకుఅన్నారం, సుందిల్ల, కన్నేపల్లి బ్యారేజీలు.. ప్రాజెక్టులోని పంప్ హౌస్ లను అధికారంగా ప్రారంభించే అవకాశం దక్కింది. అయితే కేసీఆర్ సీఎం హోదాలో కాళేశ్వరంను ఎంత పట్టుదలతో పూర్తి చేయించారో.. అంతే పట్టుదలతో హరీష్ రావు.. గడిచిన హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తయ్యేలా కృషి చేసారు. కేసీఆర్ గొప్పగా చెబుతున్నట్టు మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి అయ్యిందంటే అదంతా హరీష్ రావు కృషే అంటారు. అలాంటిది ఇప్పుడు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో హరీష్ రావుకి కనీసం చోటు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన మంత్రులు ఇప్పుడు వివిధ సహ బ్యారేజీలు, పంప్ హౌస్ లు ప్రారంభిస్తున్నారు. ప్రాజెక్ట్ కోసం అంత కృషి చేసిన హరీష్ రావుకు శిలా ఫలకంలో పేరు కాదు కదా.. కనీసం పిలుపు కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి. కష్టమొకరిది.. వాటిని అనుభవించే ఫలితం మరొకరిదిలా తయారైందని హరీష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా సభ ఏర్పాటు చేయకపోవడానికి ఓ రకంగా హరీష్ రావే కారణమని తెలుస్తోంది. ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పుడు పెద్ద సభ పెట్టటం.. తమ ఆనందాన్ని, తాము సాధించిన విజయాన్ని చెప్పుకోవటం మామూలే. కానీ అందుకు భిన్నంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేవలం పూజలకే పరిమితం చేసారు. ఒకేవేళ సభ ఏర్పాటు చేస్తే.. ప్రాజెక్ట్ కోసం కష్టపడిన హరీష్ రావు పేరుని ప్రస్తావించి ఆయనకు క్రెడిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పోనీ ఆయన పేరు ప్రస్తావించకుండా ఉందామా అంటే విమర్శలు వస్తాయి,   అటు పార్టీ శ్రేణుల్లోకి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఇదంతా ఎందుకు వచ్చిన తలనొప్పని సభ పెట్టలేదని తెలుస్తోంది.
  ఏపీ తెలుగుదేశంలో ముసలం ఏర్పడింది. చంద్రబాబు విదేశీ టూర్‌లో ఉండగా ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్ల‌మెంట‌రీ పార్టీ చీలిపోయింది.చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులుగా పేరున్న సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌తో పాటుగా గ‌రిక‌పాటి మోహ‌న‌రావు, టీజీ వెంకటేష్ టీడీపీ వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారు త‌మ నలుగురిని ప్రత్యేక గ్రూపుగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌ వెంకయ్యనాయుడికి లేఖ అందజేశారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కే జరుగుతున్నట్లు స‌మాచారం. మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌బాబు, సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే టీడీపీలో కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే వీరిద్దరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. సీతారామలక్ష్మీ బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నట్టు సమాచారం. కనకమేడల మాత్రం టీడీపీని వీడే ఆలోచనలో లేనట్టు తెలిసింది. తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. స‌రిగ్గా పార్టీ మార‌టానికి ఈ నేత‌లు ఇదే స‌రైన స‌మ‌యంగా ఎంచుకున్నారు. పార్టీ కార్యాల‌యం నుండి స‌మాచారం అందుకున్న చంద్ర‌బాబు ఈ నేతలను ఫోన్ ద్వారా సంప్ర‌దించ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నా వీరు మాత్రం ఆయ‌న‌తో మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డలేదు. అయితే క‌నీసం లోక్‌సభ స‌భ్యులైనా వెళ్ల‌కుండా అపేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు ఇప్పుడు విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొని తిరిగి ఏపీకి వ‌చ్చే అవ‌శాలు ఉన్న‌ట్లు స‌మాచారం.
  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఈరోజు అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. "గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేదు. నీతిఆయోగ్‌లో ప్రధాని, కేంద్రమంత్రిమండలి సమక్షంలో ఇదే కాపీ చదివినిపించా. విభజనతో రాష్ట్రం అన్నిరంగాల్లో నష్టపోయింది. విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. హోదా వస్తేనే రాయితీలు వస్తాయి. ఏపీకి ప్రత్యేక హోదా జీవనాడి అయినందున జాప్యంలేకుండా వెంటనే ఇవ్వాలని ఐదు కోట్లమంది ప్రజల తరపున హోదా కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నా’’ అని జగన్‌ తెలిపారు. ఈ విషయమై మాజీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం  తాము అన్ని రకాల సహకరిస్తామని స్పష్టం చేశారు. 2014 మార్చిలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని.. హోదా ఇవ్వాలని  తాము ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. హోదాను  ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని.. హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. పేరు మార్చాం కానీ.. హోదాతో వచ్చే లాభాలతో ప్యాకేజీ ఇస్తున్నామని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.  దీంతో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నట్టుగా చంద్రబాబు తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ మాత్రం ప్రత్యేక హోదా పేరుకు ఒప్పుకోలేదన్నారు. ఫైనాన్స్ కమిషన్ సూచన మేరకు హోదాకు బదులుగా ప్యాకేజీ పేరు పెట్టారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ 29సార్లు ఢిల్లీకి వెళ్లానని.. రాజకీయంగా నష్టపోయినా రాష్ట్రం కోసం పోరాటం చేశామని ఆయన చెప్పారు.  ప్రత్యేక హోదా కోసం తాను సిన్సియర్‌గా పోరాటం చేసినట్టుగా  చంద్రబాబు చెప్పారు. ప్లానింగ్ కమిషన్‌కు వెళ్లి  ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పడం సరైంది కాదన్నారు. మీకు 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ప్రత్యేక హోదా సాధించాలని జగన్ ను చంద్రబాబు కోరారు.  తనపై బురద చల్లితే ఏపీకి ప్రత్యేక హోదా రాదని  ఆయన అభిప్రాయపడ్డారు.  చంద్రబాబు ప్రసంగానికి జగన్ కౌంటరిచ్చారు. చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ కు ఒక్క లేఖ కూడ రాయలేదన్నారు.  చంద్రబాబు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా పోయిందని జగన్ వ్యాఖ్యానించారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చే వరకు ప్రత్యేక హోదాపై తీర్మానం చేయని విషయాన్ని జగన్ గుర్తు చేశారు.
ALSO ON TELUGUONE N E W S
`మ‌నం` అక్కినేని నాగేశ్వ‌ర‌రావు , నాగార్జున , నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమా  అక్కినేని కుటుంబానికి మ‌ర‌పురాని చిత్రంగా నిల‌చిపోయింది. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్ రూపొందించిన ఈ ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ అటు అక్కినేని అభిమానుల‌కే కాదు ఇటు స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు కూడా న‌య‌నానందాన్ని క‌లిగిచింది. క‌ట్  చేస్తే ఐదేళ్ళ సుదీర్ఘ విరామం త‌ర్వాత నాగార్జున, విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా  రానుంద‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే ప్ర‌స్తుతం నాని `గ్యాంగ్ లీడ‌ర్` తో బిజీగా ఉన్న విక్ర‌మ్ ఆ సినిమా పూర్త‌య్యాక త‌న త‌దుప‌రి చిత్రాన్ని నాగ్ తో ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అంతేకాదు ఈ ఏడాది చివ‌ర‌లో ప‌ట్టాలెక్కే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 2020 ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం నాగ్ `మ‌న్మ‌థుడు 2` , బంగార్రాజు, `బ్ర‌హ్మాస్త` (హిందీ) తో బిజీగా ఉన్నాడు. వీటిలో `మ‌న్మ‌థుడు 2 ` ఆగ‌ష్టులో రిలీజ్ కానుండగా `బంగార్రాజు`, `బ్ర‌హ్మాస్త‌` వ‌చ్చే ఏడాది తెర‌పైకి రానున్నాయి.మ‌రి `మ‌నం` త‌ర్వాత మ‌రోసారి జ‌ట్టుక‌డుతున్న నాగ్, విక్ర‌మ్ కాంబినేష‌న్ ఈసారి ఎలాంటి చిత్రంతో ప‌ల‌క‌రిస్తుందో చూడాలి.
టాలీవుడ్ లో ప్ర‌జంట్ టాప్ హీరోయిన్ల స‌ర‌స‌న నిలిచింది గ్లామ‌ర్ బ్యూటి పూజా హెగ్డే.  ఇటీవ‌ల మ‌హ‌ర్షితో సంద‌డి చేసిన ఈ భామ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తోంది. అలాగే స్టైలిష్ స్టార్ బ‌న్ని , త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న చిత్రంలో కూడా పూజానే హీరోయిన్ . అలాగే వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న `వాల్మీకి` లో కూడా న‌ట‌స్తోంది.  ఇలా వ‌రుస సినిమాల‌తో స్టార్ హీరోల‌తో న‌టిస్తోన్న పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా బిజీ కాబోతుంది.  ఒక‌సారి వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ లో ప్ర‌స్తుతం `హౌస్ ఫుల్ ` చిత్రంలో న‌టిస్తోంది పూజా. దీనితో పాటు మ‌రో రెండు బాలీవుడ్ లో చేయ‌నుంద‌ని స‌మాచారం. అందులో ఒకటి సునీల్ శెట్టి, జాన్ అబ్ర‌హమ్ , ఇమ్రాన్ హ‌ష్మీ హీరోలుగా సంజ‌య్ గుప్త ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `ముంబయి సాగా` లో హీరోయిన్ గా ఫైల‌న్ అయింద‌ట పూజా. అలాగే మ‌రో సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయట‌. ఇలా తెలుగు , హిందీ సినిమాల‌తో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది పూజా హెగ్డే.
 `చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చాడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. ఆ సినిమా ఉత్సాహంతో మ‌రో సినిమాకు గ్నీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో జిఏ2, యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ప్ర‌తి రోజు పండ‌గే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభించారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జంటగా రాశీఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది.  త‌మ‌న్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్యూన్స్ కంపోజింగ్ కూడా పూర్తైన‌ట్లు తెలుస్తోంది. `శైల‌జా రెడ్డి అల్లుడు` సినిమాతో కాస్త తడ‌బ‌డ్డ ద‌ర్శ‌కుడు మారుతి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో వ‌ర్స్ చేస్తున్నాడ‌ట‌. జూలై నుంచి కంటిన్యూ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.
  గ‌తంలో మ‌హేష్ రీమేక్ సినిమాలు చేస్తారా? అని అడిగితే కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు `చేయ‌ను` అని చెప్పేవారు. మ‌రి హిందీ సినిమాలు చేసే ఆలోచ‌న ఉందా? అంటే కూడా అదే స‌మాధానం వ‌చ్చేది. కానీ ఇప్పుడు హిందీ సినిమాలు చేసే అవ‌కాశాలున్నాయా? అంటే మాత్రం ఏమో `చెప్ప‌లేను` అంటున్నారు. అంటే చేసే ఆలోచ‌న ఉన్న‌ట్లేన‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. అవును ప్ర‌జంట్ తెలుగు సినిమా అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. అందుకు  `బాహుబ‌లి` చిత్రం ఆరంభం అన్న సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తోన్న `సాహో` సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. దీంతో ప్ర‌భాస్ బాలీవుడ్ కు కూడా ఎంట‌ర్ అవుతున్నాడు.  మ‌రి మీరెప్పుడు హిందీ సినిమాలు చేస్తారు అనే క్వ‌చ్చ‌న్ లేటెస్ట్ గా ఓ జ‌ర్న‌లిస్ట్ అడ‌గ్గా  `రాబోయే త్రి ఇయ‌ర్స్ వ‌ర‌కు నా డైరీలో ఖాలీ లేదు. అందువ‌ల్ల ఇప్పుడేం చెప్ప‌లేను`` అంటూ ఆన్సర్ ఇచ్చారు మ‌హేష్ బాబు.  దీంతో మ‌హేష్ బాబుకు బాలీవుడ్ లో సినిమా చేయాల‌న్న ఆలోచ‌న ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఇక అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే `స‌రిలేరు నీకెవ్వ‌రు` జూలై లో షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు.
2016 సంక్రాంతికి విడుద‌లై నాగార్జున కెరీర్ లో హయ్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిల‌చిన చిత్రంం `సోగ్గాడే చిన్ని నాయ‌నా`. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. `బంగార్రాజు` పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ కొన‌సాగింపు చిత్రం తొలి భాగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొంద‌నుంది. మొద‌టి భాగంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేసిన నాగార్జున‌. ఈ సినిమాలో `బంగార్రాజు` గా టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా అత‌ని మ‌న‌వ‌డి పాత్ర‌లో నాగ‌చైత‌న్య ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ని టాక్. అంతేకాదు ఈ సినిమాలో చైతూ స‌ర‌స‌న `మ‌హాన‌టి` ఫేమ్ కీర్తి న‌టించ‌నుంద‌ని స‌మాచారం. కీర్తి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన `మ‌హాన‌టి` లో చైతూ అతిథి పాత్ర‌లో క‌నిపించిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు అదే చైతూ స‌ర‌స‌న కీర్తి హీరోయిన్ గా న‌టిస్తుండ‌డం విశేషం. అలాగే నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ `మ‌న్మ‌థుడు 2` (`మ‌న్మ‌థుడు`కి సీక్వెల్), `బంగార్రాజు`(సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి సీక్వెల్) కి కీర్తి భాగ‌మ‌వ‌డం కూడా ఇంట్ర‌స్టింగ్ క్రియేట్ చేస్తోంది. 
  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా వేదిక విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దాన్ని కూల్చేయాలని జగన్‌ ఆదేశించారు. ప్రజావేదిక నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిద్దామని, సమావేశం ముగియగానే కూల్చివేత పనులు మొదలుపెట్టాలని జగన్ కలెక్టర్ల సమీక్షలో స్పష్టం చేసారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్.. ప్రజా వేదిక విషయంలో కూడా సంచలన నిర్ణయం తీసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఏదో తన హీరోయిజం చూపించుకోవడం కోసం జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజా వేదిక కూల్చివేయడం అంటే ప్రజా ధనాన్ని వృథా చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ చెప్పినట్టు అది అక్రమ నిర్మాణమే అవ్వొచ్చు. కానీ అది దాదాపు రూ.10 కోట్ల ప్రజాధనంతో కట్టిన నిర్మాణం. మరి ఇప్పుడు ఉన్నపళంగా దాన్ని కూల్చేస్తే ఆ డబ్బంతా వృథానే కదా. దానికి తోడు ఇప్పుడు కూల్చడానికి కూడా ప్రజాధనమే ఖర్చు చేయాలి. మరి ఇదంతా నష్టమే కదా. మంగళవారం కలెక్టర్లతో సమీక్ష ముగుస్తుంది. బుధవారం నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టమన్నారు. మరి కలెక్టర్లతో తదుపరి సమీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు. వాటి కోసం మరో నిర్మాణం చేపడతారా. ఏదైనా భవనం అద్దెకి తీసుకుంటారా?. మరి ఇవన్నీ అదనపు ఖర్చులే కదా. ప్రజావేదిక కూల్చివేత పుణ్యమా అని పది కోట్లు బూడిద పాలు అవ్వడమే కాక.. మళ్ళీ ఇవన్నీ అదనపు ఖర్చులు. అంటే జగన్ ఇదంతా ఆలోచించకుండా అక్రమ కట్టడం కూల్చాలంటూ తొందరపడి నిర్ణయం తీసుకొని ప్రజా ధనాన్ని వృధా చేసినట్లే అవుతుంది కదా అంటున్నారు. సరే అవినీతి మీద, అక్రమ కట్టడాల మీద జగన్ ఉక్కుపాదం మోపుదాం అనుకుంటున్నారు అనుకుందాం. మరి ప్రజావేదిక విషయంలో చూపిన దూకుడు మిగతా కట్టడాల మీద చూపుతారా?. కరకట్ట సమీపంలో పలు అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రజావేదికను వెంటనే కూల్చేయమని చెప్పిన జగన్.. మరి మిగతా అక్రమ కట్టడాలను కూడా వెంటనే కూల్చేయమని చెప్తారా?. ఒకవేళ ప్రజావేదిక విషయంలో చూపిన చొరవ, ఉత్సాహం మిగతా అక్రమ కట్టడాలపై చూపకపోతే మాత్రం జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ప్రజావేదికను ప్రతిపక్ష నాయకుడిగా తనకి కేటాయించాలని చంద్రబాబు లేఖ ద్వారా జగన్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆ లేఖకు బదులివ్వకుండానే ప్రజావేదికను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు కూల్చడానికి సిద్దపడింది. మరి ఇప్పుడు జగన్ సర్కార్ ప్రజావేదికను మాత్రమే కూల్చి మిగతా అక్రమ నిర్మాణాల విషయంలో చూసీచూడనట్టు వదిలిస్తే.. ఇది కచ్చితంగా బాబు మీద కక్ష సాధింపు చర్య అనే అభిప్రాయం వ్యక్తమయే అవకాశముంది. దానికితోడు అసలే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ ఆరోపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజావేదిక ఒక్క నిర్మాణాన్ని మాత్రమే కూల్చితే.. నిజంగానే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ మరింత ప్రచారం చేసే అవకాశముంది. మరి జగన్ వారికి ఆ అవకాశం ఇస్తారో లేదో చూడాలి. 
  'నాయకుడు వారసత్వంలోనుంచి పుట్టడు. ప్రజల్లోనుంచి పుడతాడు. అలా పుట్టిన నాయకుడే ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు.' ఈ విషయాన్ని 4 దశాబ్దాల అనుభవమున్న చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉండడం, కొడుకుని గొప్ప స్థాయిలో చూడాలనుకోవడం సహజం. కానీ తన కొడుకు అసలు ఈ రంగంలో రాణించగలడా లేదా అన్న ఆలోచన లేకుండా.. వారసత్వమే తన కొడుకుని నిలబెడుతుందన్న భావనతో బాబు లోకేష్ ని అందలం ఎక్కించారు. తీరా ప్రజా తీర్పు చూసి ఏడుపు మొహం పెట్టారు. ఎందరో వారసులు రాజకీయాల్లోకి వచ్చారు.. కొందరు రాణించారు. వారసులు రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదు. కానీ ఆ వచ్చే విధానంలోనే మార్పు కనపడాలి. ముందు పార్టీ గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ద్వితీయ శ్రేణి నేతలతో, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ.. క్షేత్రస్థాయిలో పని చేయాలి. ప్రజల్లో ఉండాలి. కానీ లోకేష్ రాజకీయ ప్రవేశం ఎలా ఉంది?. అంతా హైటెక్ మయం. మీడియా, సోషల్ మీడియాలో కనిపించడమే తప్ప ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండానే డైరెక్ట్ గా మంత్రి పదవి పొందారు. దీంతో సహజంగానే ప్రజల్లో లోకేష్ మీద వ్యతిరేక భావన ఏర్పడింది. దీనికి తోడు లోకేష్ తన చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని నిజమైన కార్యకర్తలను దూరం పెట్టారు. భజన చేసేవారిని, నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడేవారిని, సోషల్ మీడియానే నిజమైన సమాజం అనుకునేవారిని లోకేష్ తన చుట్టూ పెట్టుకున్నారు. దీంతో ఆయన కార్యకర్తలకు, ప్రజలకు దగ్గరవ్వలేకపోయారు. ఇక లోకేష్ మాటల తడబాటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నాయకుడికి చేతలతో పాటు వాక్చాతుర్యం కూడా ఉండాలి. తన ప్రసంగాలతో కార్యకర్తలను ఉత్తేజ పరచాలి, ప్రజలను ఆకట్టుకోవాలి. వాక్చాతుర్యంతో ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టాలి. కానీ లోకేష్ మైక్ పడితే  ప్రత్యర్థి పార్టీలకు పండగే. పదాలను సరిగ్గా పలకకపోవడం లేదా ఒక పదానికి బదులు మరో పదం పలకడం.. ఇలా పదాలతో విన్యాసాలు చేసి ప్రత్యర్థులను కూడా నవ్వించి తాను నవ్వులపాలయ్యాడు. పప్పు అనే పేరు తెచ్చుకున్నాడు. దీన్ని ప్రత్యర్థులు లోకేష్ పేరు వింటే పప్పు అని గుర్తొచ్చే అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సరే మాటలు తడబాటు సహజం. మిగతా నాయకులు అప్పుడప్పుడు తడబడితే ఈయన ఎక్కువసార్లు తడబడతారు అనుకోవచ్చు. ఇక్కడ లోకేష్ చేసిన ప్రధాన తప్పు.. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం. క్షేత్రస్థాయిలో పార్టీలో పనిచేస్తూ కార్యకర్తలకు దగ్గరై, ప్రజల్లోకి వెళ్తే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన మాటలు తడబడినా ఆయన చేతలు చూసి ఆయన వెంట కొందరైనా నడిచేవారు. కానీ లోకేష్ అలా చేయలేదు. డైరెక్ట్ గా మంత్రి అయ్యి తనకి తిరుగు లేదు అనుకున్నారు. తనకి తాను యువరాజులా ఫీలయ్యారు. ఇదే ప్రత్యర్థులకు వరమైంది. ఒక్కసారి గెలిపిస్తే బాబు కొడుకుని మంత్రిని చేసాడు, మరోసారి గెలిపిస్తే ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తారని ప్రజలకు పదే పదే చెప్పారు. దీంతో ప్రజలు లోకేష్ ని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించకుండా ఇంటికి పంపారు. పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేసారు. మరి ఈ అనుభవాల నుంచైనా లోకేష్ తన పద్దతి మార్చుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.  
  ఒక్క మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందా? ఎవరీ అన్నదమ్ములెవరు? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో మంత్రి పదవుల రేసులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఐదుగురు పేర్లు విన్పించగా, అందులో ముఖ్యులుగా ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం నిలిచారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎంపిక చేసారు. సీనియారిటీ, గత అనుభవాల దృష్ట్యా ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పదవి లభిస్తుందని ఆయనతో పాటు ఆయన వర్గం ముందు నుంచే ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అయితే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ధర్మాన ప్రసాదరావుకు కాక ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ధర్మాన ప్రసాదరావుకు కాకుండా కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోందట. మంత్రిగా అనేక పర్యాయాలు పనిచేసి, సుధీర్ఘ అనుభవం కలిగిన ధర్మాన ప్రసాదరావును కాకుండా ధర్మాన కృష్ణదాస్‌ను మంత్రిగా నియమించడంపై జిల్లా పార్టీలో వ్యతిరేక స్వరం మొదలయ్యిందట. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అగాథం పెంచిందట. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి జిల్లాకు విచ్చేసిన ధర్మాన కృష్ణదాస్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసారు. రైల్వే స్టేషన్ నుంచి పార్టీ కార్యాలయం చేరుకునే వరకు ధర్మాన కృష్ణదాస్ కు స్వాగతం పలికేందుకు ఎక్కడా ధర్మాన ప్రసాదరావు రాలేదు. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ధర్మాన ప్రసాదరావు వస్తారని కొద్దిసేపు కార్యక్రమాన్ని వాయిదా వేసినా ఆయన రాకపోవడంతో చేసేదేమిలేక కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యాలయంలోనే ఉండి కూడా కార్యక్రమానికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోగానే ధర్మాన ప్రసాదరావు అనుచరులు ధర్మాన కృష్ణదాస్‌ ఫ్లైక్సీలను వెంటనే తొలగించారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ధర్మాన ప్రసాదరావు వర్గీయులు ఇలా చేసారని జిల్లాలో కొందరు నాయకులు గుసగుసలాడుకుంటున్నారట. మొత్తం మీద ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల అంతర్గత విభేదాలతో పార్టీ బలహీన పడుతుందన్న చర్చ ఒకవైపు నడుస్తుండగానే తాజాగా తెరపైకి వచ్చిన అన్నదమ్ముల పదవీ వైరం ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయట. మరి సోదరుల పంచాయితినీ, వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
  బంతిని నేలకి ఎంత బలంగా విసిరితే.. నింగికి అంత బలంగా ఎగురుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇదే జరగబోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ తరువాత హరీష్ రావు పేరు వినిపించేది. కష్ట కాలంలో కేసీఆర్ కి అండగా ఉంటూ పార్టీని బలపరచడానికి హరీష్ కృషి చేసారు. గెలుపు అసాధ్యం అనుకున్న స్థానాల్లో కూడా హరీష్ పార్టీని గెలిపించి చూపించారు. ట్రబుల్ షూటర్ గా పేరుతెచ్చుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు లెక్క పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేసీఆర్ కి పార్టీలో ఏ వ్యవహారమైనా ముందుగా మేనల్లుడు హరీష్ పేరు గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఈ మార్పు ఇటీవల స్పష్టంగా కనిపిస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసాధ్యమనుకున్న స్థానాల్లో హరీష్ టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేసారు. అయితే అప్పటికే కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం హరీష్ ని పక్కన పెడుతున్నారనే ప్రచారం జరిగేది. ఎన్నికల తరువాత ఆ ప్రచారం మరింత బలపడింది. హరీష్ కి మంత్రివర్గంలో చోటులేదు, పార్టీలో సరైన స్థానంలేదు. దీంతో హరీష్ అభిమానుల్లో ఆవేదన మొదలైంది. అయితే హరీష్ మాత్రం ఎప్పుడూ కేసీఆర్ కి కానీ, పార్టీకి కానీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. తన విధేయత చూపుతూ వస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో.. హరీష్ కి అన్యాయం జరుగుతుందనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం ఎంతో శ్రమించిన హరీష్‌కు.. కనీసం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పార్టీ శ్రేణుల్లోనూ, అటు సామాన్య ప్రజల్లోనూ హరీష్ పై సానుభూతి వ్యక్తమవుతోంది. అయితే హరీష్ మాత్రం ఇంత జరుగుతున్నా తన విధేయత చాటుకుంటూనే ఉన్నారు. సిద్దిపేటలో ఘనంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి.. ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా కేసీఆర్ దే అనేసారు. దీంతో హరీష్ మీద ప్రజల్లో మరింత సానుభూతి, అభిమానం పెరిగాయి. అయితే ఇవన్నీ మౌనంగా భరిస్తూ విధేయత చూపుతున్న హరీష్.. ఎప్పుడో అగ్నిపర్వతంలా పేలి పార్టీలో ప్రళయం సృష్టిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ చూపు కూడా ఇప్పుడు హరీష్ పై పడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తెలంగాణలో 2023 లో అధికారమే లక్ష్యంగా పార్టీని బలపరచాలని అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలను కూడా పార్టీలో చేర్చుకుంది. అయితే బీజేపీ ఇలా నెమ్మది నెమ్మదిగా బలపడటం కంటే ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టాలని చూస్తోందట. అందుకే ఇప్పుడు హరీష్ ని పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోందట. హరీష్ చేరితే టీఆర్ఎస్ లో చీలిక వచ్చి బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనేది ఆ పార్టీ పెద్దల భావనగా తెలుస్తోంది. ఎలాగూ ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకొనే పరిస్థితి లేదు. హరీష్ వస్తే టీఆర్ఎస్ బలం కూడా తగ్గుతుంది. దీంతో 2023 అధికారంలోకి రావాలనే ఆశ నెరవేరుతుంది. ఇదే ప్రస్తుతం బీజేపీ ప్లాన్ అని తెలుస్తోంది. మరి హరీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
  నాయకులు చేసే పనులు మాత్రమే కాదు, వారి మాటలు కూడా.. వారి మీద, వారి పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే నాయకులకు నాలుక అదుపులో ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. కానీ టీడీపీ అధికార ప్రతినిధులు ఈ విషయాన్ని మరచి మీడియా ముందు నోటికొచ్చినట్లు వాగి పార్టీ ప్రతిష్టను దెబ్బ తీశారు. అలాంటి వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేసిన చంద్రబాబు పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. అసలు పార్టీ అధికార ప్రతినిధులంటే ఎలా ఉండాలి? పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలను ఉత్తేజ పరిచేలా ప్రసంగించాలి. కానీ టీడీపీ అధికార ప్రతినిధులు ఎలా ఉన్నారు?. బాబు, లోకేష్ లకు భజన చేయడం, ఇతర పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, బూతులు తిట్టడం. వీళ్లా అధికార ప్రతినిధులు?. యామిని సాధినేని ఏమో మల్లెపూలు అంటారు, సీఎం రమేష్ 'నీ అమ్మ' అంటారు, రాజేంద్ర ప్రసాద్ ఏమో ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే వాళ్ళ అమ్మ, చెల్లెలే చేశారు అంటారు. ఇలా వీరు నోరు అదుపులోలేకుండా మాట్లాడిన మాటలు కోకొల్లలు. బూతులు మాట్లాడేవారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారు అధికార ప్రతినిధులా? అసలు వీరికి ఏ అర్హత ఉందని అధికార ప్రతినిధులుగా నియమించారు?. బాబుకి, లోకేష్ కి డప్పు కొట్టడమేనా వీరికున్న అర్హత?. గతంలో టీడీపీ శిక్షణ తరగతులు నిర్వహించేది. పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవారిని, అద్భుతంగా ప్రసంగించే వారిని అధికార ప్రతినిధులుగా నియమించేవారు. కానీ ఇప్పుడు.. బాబు, లోకేష్ లు మెచ్చేవారు, వాయిద్దరికి భజనచేసేవారు అధికార ప్రతినిధులు అయ్యారు. వారేం చేశారు?. నోటిదూలతో పార్టీ ప్రతిష్ట దెబ్బదీసారు, ప్రజల్లో పార్టీపై చులకన భావం వచ్చేలా చేశారు. మొత్తానికి పార్టీ ఓటమికి కారణమయ్యారు.  
  కేంద్రంలో అఖండ మెజార్టీతో రెండోసారి గద్దెనెక్కిన బీజేపీ ఇప్పుడు తమ శత్రువైన చంద్రబాబుని టార్గెట్ చేసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ప్రాంతీయ పార్టీల కూటమి కట్టి కాంగ్రెస్ కు సపోర్టుగా రాజకీయం చేసిన చంద్రబాబుకు తమ దెబ్బ రుచి చూపిస్తున్నారు. అటు కేంద్రంలో మోదీ, ఇటు ఏపీలో వైపీపీ అధికారంలోకి రావ‌టంతో త‌మ‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని టీడీపీ నేత‌లు ముందుగానే ఊహించారు. అయితే ఇంత త్వ‌ర‌గా బీజేపీ ఆప‌రేష‌న్ మొద‌లు పెడుతుంద‌ని, చంద్ర‌బాబును ఇంత త్వ‌ర‌గా కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఎవ‌రూ ఊహించ‌లేదు. త‌న‌ను అవ‌మానించిన చంద్రబాబును అదే స్థాయిలో మోదీ ఇప్పుడు దెబ్బ కొడుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో మోదీ, చంద్రబాబు మిత్రులు. ప్ర‌త్యేక హోదా పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం నుండి టీడీపీ బ‌యటకు వచ్చి ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. ఏపీకి మోదీ, అమిత్ షా వ‌చ్చిన స‌మ‌యంలో టీడీపీ నేత‌ల నిర‌స‌న‌లు శృతి మించాయి. ఏపీకి మోదీని శ‌త్రువుగా క్రియేట్ చేయ‌టంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. అదే మోదీకి ఆగ్ర‌హం తెప్పించింది. ఏపీలో తాను తిరిగి అధికారంలోకి రావ‌టం కోసం నాడు చంద్ర‌బాబు మోదీని ప్ర‌ధాన ముద్దాయిగా చూపించి, మోదీని తాను మాత్ర‌మే ఎద‌ర్కోగ‌ల‌న‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పుకొన్నారు. మోదీ ఏపీకి ఏమీ చేయ‌లేద‌ని, మోదీని ఏపీలో విల‌న్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు. ఇక‌, మోదీని ప‌దేప‌దే త‌న‌కంటే జూనియ‌ర్ అనీ, గోద్రా అల్లర్లలో మోదీ రాక్ష‌సంగా వేలాది మంది మైనారిటీలను చంపించార‌ని చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. గోద్రా కేసులో మోదీని అరెస్ట్ చేయాల‌ని తొలుత డిమాండ్ చేసింది తానే అంటూ చంద్ర‌బాబు ప‌లు మార్లు చెప్పుకొచ్చారు. మోదీ ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను మేనేజ్ చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. చంద్ర‌బాబుని మోదీ ఈ స్థాయిలో టార్గెట్ చేయటానికి కార‌ణం ఆయన మోదీపైన చేసిన వ్య‌క్తిగ‌త ఆరోపణలే కారణం అని సమాచారం. ఏపీలో టీడీపీ లేకుండా చేట‌య‌మే ల‌క్ష్యంగా ఇప్పుడు మోదీ, అమిత్ షా ప‌ని చేస్తున్నారు. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడ్డ సన్నిహిత పారిశ్రామికవేత్తలు - టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్ లతోపాటు మరో ఇద్దరు ఎంపీలు గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ లు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. వీరు త‌మ నలుగురిని ప్రత్యేక గ్రూపుగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌ వెంకయ్యనాయుడి కి లేఖ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కే జరుగుతున్నట్లు స‌మాచారం. మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌బాబు, సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే టీడీపీలో కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే వీరిద్దరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. రాజ్యసభ ఎంపీలతో పాటు లోక్‌సభ ఎంపీలను కూడా లాక్కునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని ఆయన కలిసొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే నాని కమలం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బుధవారమే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. మరి ఈ సంక్షోభ స‌మ‌మంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచేదెవరో వేచి చూడాలి!!
  అది ఓ మారుమూల పల్లెటూర్లోని చిన్న పెంకుటిల్లు. పెద్దగా సంపద లేకపోయినా ఆ ఇంట్లో సంతోషానికి మాత్రం లోటు లేదు. ఓ భార్యాభర్తా, వారికి ఓ కొడుకూ కూతురు... ఇలా నలుగురూ హాయిగా ఆ ఇంట్లో జీవిస్తుండేవారు. వాళ్లు మిగిల్చిన చిన్నా చితకా ఆహారం మీద ఓ ఎలుక బతుకుతూ ఉండేది. ఇలా ఉండగా ఓ రోజు ఆ ఇంటి యజమాని ఏదో కొత్త వస్తువుని తీసుకురావడం ఆ ఎలుక గమనించింది. అదేమిటా అని తన కన్నంలోంచి చూసిన దాని గుండె పగిలిపోయింది. తనని పట్టేసేందుకు యజమాని ఒక బోను తీసుకువచ్చాడు.   ఎలుక లబోదిబోమంటూ పెరట్లోకి పరుగులెత్తింది. ఆ ఇంటి పెరట్లో ఒక కోడి, మేక, పొట్టేలు ఉన్నాయి. ముందుగా కోడి దగ్గరకి వెళ్లి ‘మీ యజమాని నాకోసం ఒక బోను తీసుకువచ్చాడు. అది ఎవరికైనా హాని చేయవచ్చు జాగ్రత్త! వీలైతే దాన్ని నీ కాళ్లతో లాగి అవతల పారేయ్‌,’ అంటూ హెచ్చరించింది ఎలుక.   ఎలుక మాటలకు కోడి నవ్వేస్తూ- ‘నీ కోసం తెచ్చిన బోనుతో నాకు ప్రమాదం ఎలా ఉంటుంది. నేను దాని జోలికే పోను. నువ్వే జాగ్రత్త!’ అంది. అయినా ఎలుక తన పట్టు విడవకుండా పక్కనే ఉన్న మేక, పొట్టేలు దగ్గరకు కూడా వెళ్లి ఇదే హెచ్చరికను చేసింది. కానీ వాటి నుంచి కూడా కోడి చెప్పిన జవాబులాంటి సమాధానమే వినిపించింది.   తన మాటని ఎవ్వరూ వినకపోగా, తనని హేళన చేయడంతో ఎలుక చిన్నబుచ్చుకొని తన కలుగులోకి చేరింది. ఇక మీదట తనే కాస్త జాగ్రత్తగా ఉండేందుకు నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బోనులో ఏదో పడిన చప్పుడి వినిపించింది. అదేమిటా అని తెలుసుకునేందుకు ఇంటి యజమానురాలు ఆసక్తిగా బయటకి వచ్చింది. అంతే! బోనులో తోక ఇరుక్కుపోయిన ఓ త్రాచుపాము పడగ మీద ఆమె కాలు పడింది. తన తల మీద కాలు పడితే పాము ఎందుకు ఊరుకుంటుంది. వెంటనే యజమానురాలిని ఒక్క కాటు వేసింది.   యజమానురాలి అరుపులు విన్న యజమాని వెంటనే పాముని చావబాది, భార్యని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. వైద్యుడు ఏదో చికిత్స చేసి పంపాడే కానీ, రోజులు గడిచేకొద్దీ యజమానురాలి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. భార్యకు నయమయ్యేందుకు భర్త అన్ని ఉపాయాలూ పాటించడం మొదలుపెట్టాడు. అలా ఎవరో అతనికి కోడిమాంసంతో చేసిన కషాయంతో గుణం కనిపిస్తుందని చెప్పగానే వెంటనే పెరట్లోని కోడిని ఒక్క వేటు వేశాడు.   రోజులు గడిచినా యజమానురాలి ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ రాలేదు సరికదా మరింత క్షీణించసాగింది. దాంతో ఆమెను ఆఖరిసారి చూసేందుకు దగ్గరి బంధువులంతా తరలి వచ్చారు. మరి వారందరికీ భోజనం ఎలా! అందుకని ఆ రోజు వారికి ఆహారంగా మేకని బలిచ్చారు. ఇక మరో వారం గడిచేసరికి యజమానురాలు కన్నుమూసింది. ఆమె అంత్యక్రియల కోసమని బంధువులతో పాటుగా వీధివీధంతా కదిలి వచ్చింది. ఆ రోజు వారికి ఆహారంగా పొట్టేలు తల తెగిపడింది. ఇదంతా తన కలుగులోంచి చూస్తున్న ఎలుక మాత్రం బతుకుజీవుడా అనుకుంది.   ‘సంఘంలో బతుకుతున్నప్పుడు, ప్రతి ఒక్కరి సమస్యా ఇతరులని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’ అన్న సూత్రం ఈ కథలో బయటపడుతుంది. కష్టం మనది కాదు కదా! అనుకుని దాన్ని అశ్రద్ధ చేస్తే చివరికి అదే కష్టం మన తలుపు తట్టే రోజు వస్తుంది. అలా కాకుండా తోటివారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే, అది మనకి తెలియకుండానే ఏదో లాభాన్ని అందిస్తుంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  అనగనగా ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడన్న పేరుండేది. ఆ భిక్షువు దగ్గర ఎలాంటి సమస్యకైనా సలహా లభిస్తుందని ప్రజల నమ్మకం. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో జనం ఆయన దగ్గర తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చేవారు. ఆ సమస్యలకి భిక్షువు చెప్పే పరిష్కారాలు విని సంతోషంతో తిరిగి వెళ్లేవారు. అలాంటి భిక్షువు ఆశ్రమం ముందు ఒకరోజు రాచరికంతో ఉట్టిపడుతున్న గుర్రపుబగ్గీ ఆగింది. ఆ బగ్గీలోంచి ఆ దేశ సేనాపతులలో ఒకరు దిగారు. సేనాధిపతిని సకల మర్యాదలతో భిక్షువు దగ్గరకు తీసుకువెళ్లారు ఆశ్రమవాసులు.   భిక్షువుకి నమస్కరించిన సేనాపతి తన గోడునంతా ఒక్కసారిగా ఏకరవు పెట్టాడు- ‘స్వామీ! నేను గొప్ప వీరుడినని ఈ రాజ్యమంతా నమ్ముతుంది. ఆ నమ్మకానికి అనుగుణంగా నేను చాలా సాహసకార్యాలే చేశాను. ఎన్నో యుద్ధాలను ఒంటిచేత్తో గెలిపించాను. మరెన్నో ఆక్రమణలను తిప్పికొట్టాను. శత్రుదేశాల వారికి నేనంటే సింహస్వప్నం. రాజుగారికి నా మీద మహా అభిమానం. కానీ ఏం లాభం! నేనెందుకూ పనికిరానివాడినన్న ఆత్మన్యూనత నిరంతరం నన్ను వేధిస్తూ ఉంటుంది. నాకంటే శక్తిసంపన్నులైన రాజుగారిని చూసినా, నాకంటే తెలివితో ఉన్న మంత్రులను గమనించినా..... అంతదాకా ఎందుకు, దైవత్వం ఉట్టిపడే మీవంటి భిక్షువులను చూసినా నేను చాలా అధముడినన్న ఆలోచన బాధిస్తుంటుంది. దీనికి పరిష్కారమే లేదా?’ అంటూ బాధపడ్డాడు. సేనాపతి మాటలను చిరునవ్వుతో విన్న భిక్షువు- ‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. కానీ దీనికి జవాబుని వినేముందు నువ్వు కాస్త ఓపికపట్టాలి. ఇవాళ నాతో తమ బాధలను చెప్పుకొనేందుకు చాలామంది పౌరులు వచ్చారు. వారందరినీ పంపించాక తీరికగా నీతో మాట్లాడతాను. అప్పటిదాకా ఆ అతిథుల గదిలో విశ్రమించు,’ అంటూ సేనానిని పంపారు.   తన సమస్యకు భిక్షువు దగ్గర పరిష్కారం ఉందని తెలుసుకొన్న సేనాని అతిథి గదిలో నిశ్చింతగా విశ్రమించాడు. చుట్టూ ఉన్న ఆశ్రమ వాతావరణం, భిక్షువుల ఆధ్మాత్మిక సాధనలు, నిష్కల్మషమైన మనసుతో అక్కడికి చేరుకుంటున్నా పౌరులు... అతనిలోని అలజడిని కొంతవరకూ ఉపశమింపచేశాయి. ఇంతలో నిదానంగా చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆశ్రమమంతా వెన్నెల వెలుగుతో నిండిపోయింది. ఆ వాతావరణంతో మైమరచిపోయిన ఉన్న సేనాపతి గదిలోకి భిక్షువు అడుగుపెట్టాడు.   ఉదయం నుంచి అలుపెరగకున్నా కూడా భిక్షువు మొహంలో ఎలాంటి అలసటా కనిపించలేదు. భిక్షువు గదిలోకి అడుగుపెడుతుండగానే ‘నా సమస్య సంగతి ఏం చేశారు స్వామీ!’ అంటూ ఆత్రంగా అడిగాడు సేనాని. ‘ఇవాళ పౌర్ణమి! ఆ నిండు చందమామ ఇచ్చే వెన్నెలతో పరిసరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా!’ అన్నారు భిక్షువు.   ‘నిజమే కానీ... ఆ వెన్నెల సంగతి కాస్త పక్కన పెట్టి నా సమస్య సంగతి చూడండి స్వామీ!’ అన్నాడు సేనాని అసహనంగా. ‘ఈ వెన్నెల మహా అయితే నెలకి ఓసారి వస్తుంది. అది కూడా తెల్లవారుజాముకల్లా సూర్యకిరణాల ముందు వెలవెలబోతుంది. చంద్రుడు ఎంత కాంతిని ఇచ్చినా అది సూర్యకాంతి ముందు దిగదుడుపే! అంతమాత్రాన చంద్రుడు పనికిరానివాడంటావా!’ అని అడిగారు.   భిక్షువు ప్రశ్నకి సేనాని నవ్వుతూ- ‘అలా ఎలా సాధ్యం గురువుగారూ! సూర్యడు, చంద్రుడు... రెండూ వేర్వేరు లక్షణాలు ఉన్న గ్రహాలు. దేని అందం దానిదే. దేని లక్షణం దానిదే. సూర్యడు మనకి జీవాన్ని అందిస్తే, చంద్రుడు రాత్రివేళ మనల్ని కాచుకుంటాడు. ఇక ఇలాంటి వెన్నెల రాత్రుల ముందు వంద సూర్యోదయాల అనుభూతి దిగదుడుపే కదా!’ అన్నాడు. ‘చూశావా! నీ సమస్యకి సమాధానం నీ నోటి వెంటే వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఇతరులతో పోల్చుకుని నీ ఉనికిని చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. మంత్రి నీలాగా కత్తిపట్టలేడు, రాజు నీలాగా సాహసాలు చేయలేడు. కాబట్టి ఇలాంటి పోలికలని కట్టిపెట్టి నీ వ్యక్తిత్వం మీద శ్రద్ధ పెట్టు,’ అంటూ ముగించారు భిక్షవు. సేనాని జీవితంలో అది నిజంగా వెన్నెల కురిసిన రాత్రిగా మారింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara
  కాలచక్రం గిర్రున తిరిగి మళ్లీ మొదటికి వచ్చేసింది. ఒకప్పుడు మూఢనమ్మకంగా భావించే యోగాసనాలు వెనక అద్భుతమైన సైన్స్ ఉందంటూ ప్రపంచమంతా ఒప్పుకోక తప్పటట్లు లేదు. నిన్నమొన్నటి వరకూ పతజంలి అందించిన సూచనలకు అనుగుణంగానే యోగా సాగేది. కానీ పాశ్చాత్యులను ఆకర్షించడానికో, మారుతున్న జీవనశైలికి అనుగుణంగానో రకరకాల యోగాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవిగో...   ACRO YOGA   ఏక్రోబయాటిక్స్నీ యోగానూ జతచేసి తయారుచేసిన యోగా ఇది. ఈ యోగాను చేయడానికి ఇద్దరు వ్యక్తులు ఉండాలి. అందులో ఒకరు స్థిరంగా ఉంటే, మరొకరు నేల మీద ఉన్న వ్యక్తిని పట్టుకుని విన్యాసాలు (acrobatics) చేస్తుంటారు. ఎప్పుడో తిరుమలై కృష్ణమాచార్యులవారు సరదాగా ఓ చిన్నపిల్లవాడితో చేసిన ప్రయోగమే ఈ ఏక్రోయోగాకి ఆరంభం అని చెబుతారు. కానీ ఈ ఏక్రోయోగా చాలా కష్టమైంది. ముందుగా శరీరాన్ని ఏక్రోబయాటిక్స్ని అనువుగా మార్చిన తర్వాతే ఇది సాధ్యమవుతుంది. పైగా ఇందులో పట్టుతప్పే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.   BIKRAM YOGA     పశ్చిమబెంగాల్కు చెందిన విక్రమ్ చౌదరి తెలివైనవాడు. పాశ్చాత్య ప్రపంచం ఎప్పుడైతే యోగా వైపు చూస్తోందని గ్రహించాడో... ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. దానికి తనదైన ముద్రని జోడించాడు. బిక్రమ్ యోగాలో 90 నిమిషాల పాటు ఓ 26 యోగాసనాలను వేయవలసి ఉంటుంది. అయితే- ఆ సమయంలో గదిలోని వాతావరణం 35-42 డిగ్రీల వరకూ ఉండేలా చూస్తారు. భారతీయ వాతావరణాన్ని అనుసరించేందుకే ఈ ఏర్పాటు అంటాడు విక్రమ్ చౌదరి. అతని చేత సర్టిఫై చేయబడిన యోగా గురువులు మాత్రమే ఈ యోగాను నేర్పేందుకు అర్హులు. అయితే అత్యాచారం దగ్గర నుంచీ దాడి చేయడం దాకా ఈ గురువుగారి మీద చాలా కేసులు ఉండటం కొసమెరుపు.   FORREST YOGA       అమెరికాకు చెందిన ‘అన్నా ఫారెస్ట్’ ఓ ముప్ఫై ఏళ్ల క్రితం రూపొందించిన యోగా ఇది. పాశ్చాత్య యోగానీ, యోగా గురువులైన శివానంద వంటి వారి మార్పులనీ కలబోసి తనదైన శైలిలో ఈ యోగాను రూపొందించారు. ఆధునిక జీవన సమస్యలకు అనుగుణంగా ఈ యోగాకు మరికొన్ని విధానాలను జోడించారు. ఉదాహరణకు కంప్యూటర్ దగ్గర ఎక్కువగా పనిచేయడం వల్ల మణికట్టు, మెడ, భుజాల మీద అధిక భారం పడుతూ ఉంటుంది. ఈ సమస్యలను నివారించేందుకు ఆయా శరీర భాగాలకు సంబంధించి సరికొత్త ఆసనాలను రూపొందించారు.   CHAIR YOGA     యోగా చేయాలంటే శరీరం ఎంతోకొంత సహకరించాలి. దానికోసం నిర్దుష్టమైన సమయం, సందర్భం ఉండాలి. కానీ ఎవరైనా ఎక్కడైనా యోగా చేయలనుకుంటే సాధ్యం కాదా! అనే ప్రశ్నకు సమాధానమే కుర్చీ యోగా! లక్ష్మీ ఓల్కర్ అనే అమెరికన్ రూపొందించిన యోగా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పండుముసలివారు సైతం యోగా చేసేలా, ఆఫీసులోని ఖాళీ సమయంలోనూ కాసిని ఆసనాలు వేసేలా ప్రేరేపిస్తోంది. ఇందులో ఇటు భారతీయ యోగశాస్త్రంతో పాటుగా అటు చైనా ధ్యాన భంగిమలూ కనిపిస్తాయి. ఈ కుర్చీ ఆసనాలు అన్నింటి మీదా లక్ష్మీగారికి పేటెంటు హక్కులని సాధించడం ఓ కొసమెరుపు- - నిర్జర.
  బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ధూమపానం చేయడాన్ని నేరంగా పరిగణించి పోలీసులు జరిమానా విధిస్తారన్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసినందుకు తాజాగా హీరో రామ్‌కు చార్మినార్‌ పోలీసులు రూ.200 జరిమానా విధించారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌ లోని చార్మినార్‌ ప్రాంతంలో జరుగుతోంది. షూటింగ్‌ విరామ సమయంలో రామ్‌ సిగరెట్‌ తాగుతూ కనిపించడంతో స్థానిక చార్మినార్‌ ఎస్సై పండరీ రూ.200 జరిమానా విధించారు.
  ప్రధాని మోదీ గొప్ప సేల్స్‌మ్యాన్‌. అందుకే బీజేపీ మరోసారి అధికారంలోకి రాగలిగింది అని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంపై లోక్‌సభలో నేడు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అధిర్‌ మాట్లాడుతూ.. ‘మన ప్రధాని గొప్ప సేల్స్‌మ్యాన్‌. ఆయన ముందు మేం మా ఉత్పత్తులను విక్రయించలేకపోయాం. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది’ అని అన్నారు.  రాష్ట్రపతిని విమర్శించాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, అయితే అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతున్నామని అధిర్‌ తెలిపారు. దేశం తీవ్రమైన కరవు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కనీసం ఆందోళన చెందట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. 2జీ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎందుకు జైల్లో లేరని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని పొగడడం తప్పించి వేరే పని చేయట్లేదని ఎద్దేవా చేశారు. ‘ప్రధానిని పొగిడితే చాలు.. మేం గట్టెక్కుతాం’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని అధిర్‌ ఆరోపించారు.
  సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టులో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి వేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత జీవన్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని నిర్ణయించినప్పుడు 2016లో హైకోర్టులో జీవన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం సచివాలయం కూల్చివేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుత సచివాలయం భవనాన్ని కూల్చబోమని సర్కారు తరపున అప్పటి అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన మాట మార్చిందని, సచివాలయం భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని తాజాగా సోమవారం జీవన్ రెడ్డి తరపు న్యాయవాది సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కోర్టు శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది. మరోవైపు శాసనసభ నిర్మాణం విషయంలోనూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌ లోని ఓ పురావస్తు భవనాన్ని కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని అడ్డుకోవాలంటూ కొంతమంది విద్యార్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని కూడా శుక్రవారం పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.
ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు. దీని శాస్త్రీయ నామము " Coriandrum sativum ". ఆహార పదార్దాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరపాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు,కాయగూరల వంటకాలలో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమిర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి . అంతేకాదు సమృద్ధి గా ఐరన్ కుడా లభిస్తుంది .కొత్తిమిర రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం,కేమోతెరఫి వల్ల కలిగే నష్టము తగ్గించడానికి పోరాడుతుంది.. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.రక్తనాళాలలో ఆటంకాలను తొలగిస్తుంది.   దీనిని కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. ఈమధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. తాజాగా సేకరించిన కొత్తిమీరలో డుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాని నిర్వీర్యపరుస్తుందని గమనించారు. కొసమెరుపేమిటంటే, సాధారణంగా ఫుడ్ పాయినింగ్‌లో జెంటామైసిన్ వాడుతుంటారు. అయితే దీనికన్నా కొత్తిమీర ప్రభావవంతంగా, సురక్షితంగా పనిచేసినట్లు రుజువయ్యింది. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర కార్మినేటివ్‌గా (గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది. కొత్తిమీర ఆకుల స్వరసాన్ని ఔషధంగా వాడుకోదలిస్తే 10మి.లీ. (రెండు టీస్పూన్లు) మోతాదులో వాడాలి.కొత్తిమీర ఆమాశయాన్ని శక్తివంతం చేయటమే కాకుండా దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదరంలో చేరిన గ్యాస్‌ని తగ్గించటంతోపాటు మూత్రాన్ని చేయటం, జ్వరాన్ని తగ్గించటం చేస్తుంది. అలాగే శృంగారానురక్తిని పెంచటం, శ్వాసనాళికల్లో సంచితమైన కఫాన్ని కరిగించి వెలుపలకు వచ్చేలాచేయటం వంటి పనులను కూడా చేస్తుంది. ఉదర కండరాలు పట్టేసి నొప్పిని కలిగిస్తున్నప్పుడు ఉపశమనాన్ని కలిగిస్తుంది.   కొత్తిమీర రసం విటమిన్-ఎ, బి1, బి2, సి, ఐరన్ లోపాల్లో హితకరంగా ఉంటుంది. గృహ చికిత్సలు అజీర్ణం, వికారం, శరీరంలో మంటలు తాజా కొత్తిమీర రసం అజీర్ణం, వికారం, ఆర్శమొలలు, బంక విరేచనాలు, హెపటైటిస్, అల్సరేటివ్ కోలైటిస్(పెద్ద పేగులో వ్రణం తయారుకావటం) వంటి వ్యాధుల్లో హితకరంగా పనిచేస్తుంది. జీర్ణక్రియా సమస్యల్లో కొత్తిమీర రసాన్ని(10-20 మి.లీ) 1 గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకోవాలి. నోటి పూత, నోటి దుర్వాసన, చిగుళ్లవాపు, చిగుళ్లనుంచి రక్తం కారటం. కొత్తిమీర ఆకులను నమిలి మింగుతుంటే నోటికి సంబంధించిన సమస్యల్లో ఉపయుక్తంగా ఉంటుంది. దంతాలు దెబ్బతినకుండా ఉంటాయి. కొత్తిమీర రసానికి లవంగ మొగ్గల పొడి కలిపి వాడితే మరింత హితకరంగా ఉంటుంది.  మొటిమలు, మంగు మచ్చలు చర్మంమీద నల్లని మచ్చలు, పొడి చర్మం, పెద్దసైజు మొటిమలు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. దీని ప్రయోగానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవటం అవసరం. దీనిని ప్రతిరోజూ రాత్రి నిద్రకుముందు ప్రయోగిస్తే కొద్దిరోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ముక్కునుంచి రక్తం కారటం, ముక్కులో కొయ్యగండలు పెరగటం (పాలిప్స్) 20గ్రాముల కొత్తిమీర ఆకులకు చిటికెడు పచ్చకర్పూరం పలుకులు కలిపి ముద్దగా నూరి రసం పిండి రెండుముక్కు రంధ్రాలలోనూ రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. అలాగే కొద్దిగా రసాన్ని తలకు కూడా రాసుకోవాలి. దీంతో ముక్కునుంచి జరిగి రక్తస్రావం ఆగుతుంది.   ముక్కులో పాలిప్స్ పెరిగిన సందర్భాల్లోకూడా ఇది హితకరంగా ఉంటుంది. నొప్పి, వాపు 20 మిల్లీలీటర్ల కొత్తిమీర రసానికి 10 మిల్లీలీటర్ల వెనిగర్‌ని కలిపి రాసుకుంటే నొప్పి, వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్శమొలలు కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి ఎర్రగా వేయించిన ఎర్రమట్టికి కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే మొలలు ఎండిపోయి నొప్పి, దురదలనుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంనుంచి రక్తస్రావమవటం తాజాగా కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి, రసం పిండి, పంచదార కలుపుకొని తాగితే బహిష్టుస్రావం ఎక్కువగా కావటం, ఆర్శమొలలనుంచి రక్తం కారటం వంటి సమస్యలు తగ్గుతాయి. విటమిన్ల లోపం కొత్తిమీరను చట్నీగా చేసుకొని తినాలి. లేదా ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు తాజాగా తీసిన కొత్తిమీర రసానికి చెంచాడు తేనె కలుపుకొని తాగుతుండాలి. దీనిని క్రమంతప్పకుండా తీసుకుంటే విటమిన్-ఏ, విటమిన్-బి1, విటమిన్-బి6, విటమిన్-సి, లోహం వంటి పదార్థాల లోపం ఏర్పడకుండా ఉంటుంది. ఈ ఆహార చికిత్స క్షయవ్యాధి, ఉబ్బసం, ఎలర్జీలు, మెదడు బలహీనత, కళ్ల బలహీనత వంటి సమస్యల్లో బాగా పనిచేస్తుంది. అమ్మవారు (స్మాల్‌పాక్స్) కొత్తిమీర రసాన్ని తాజాగా తీసి, చెంచాడు రసానికి ఒకటి రెండు అరటి ‘గింజలు’ పొడిని కలిపి రోజుకు ఒకసారి చొప్పున వారంపాటు తీసుకుంటే స్మాల్‌పాక్స్ వంటి పిడకమయ వ్యాధుల్లో నివారణగా సహాయపడుతుంది. స్మాల్‌పాక్స్ వ్యాధి తీవ్రావస్థలో ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని పరిశుభ్రమైన పద్ధతులతో తీసి, రెండు కళ్లలోనూ చుక్కలుగా వేసుకుంటే కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. తలనొప్పి, మైగ్రెయిన్ కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి కణతలకు, నుదుటికి పూసుకుంటే తలనొప్పి, ఒంటి కణత నొప్పి వంటివి తగ్గుతాయి.  కళ్లమంటలు, కళ్లకలక కొత్తిమీర ఆకులను తాజాగా తెచ్చి, బాగా కడిగి, ముద్దగా నూరి, రసం పిండి, చనుబాలతో కలిపి కళ్లల్లో బిందువులుగా వేసుకుంటే కళ్లమంటలు, కనురెప్పలు అంటుకుపోవటం, కళ్లుమెరమెరలాడటం, కళ్లకలక వంటి సమస్యలు తగ్గుతాయి. నొప్పితో కూడిన వాపులు కొత్తిమీర ఆకులను, బాదం పలుకులతో ముద్దగా నూరి వాపు, నొప్పి ఉన్నచోట పట్టుగా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. దద్దుర్లు కొత్తిమీర ఆకుల రసానికి తగినంత తేనెనూ బాదాం నూనెనూ కలిపి దద్దురు తయారైనచోట పైకి రాసుకోవాలి. అలాగే పంచదార కలిపి లోపలకు తీసుకోవాలి. విష పురుగులు కుడితే కొత్తిమీర ఆకులను ముద్దగా నూరి బాదం పలుకులనూ, పెసర పిండినీ కలిపి స్థానికంగా ప్రయోగిస్తే విషపురుగులు కరిచినచోట తయారైన నొప్పి,  వాపులు తగ్గుతాయి.  కొత్తిమీర ఆకుల రసానికి కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే మంటలు తగ్గుతాయి. స్మాల్‌పాక్స్ (బృహన్మసూరిక) తాజా కొత్తిమీర రసం స్మాల్‌పాక్స్‌లో నివారణగా పనికి వస్తుంది. దీనిని ఒక చెంచాడు మోతాదులో అరటి పండుతో కలిపి ఏడు రోజులపాటు తీసుకోవాలి. స్మాల్‌పాక్స్‌లో నేత్రాలు దెబ్బతినకుండా కొత్తిమీర రసాన్ని కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. సాధారణంగా కొత్తిమీరను సువాసనకోసం వంటల్లో వాడుతుంటారు. లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీలకోసం వాడుతుంటారు. కొత్తిమీర ఆకులను సూప్స్,  కూరల వంటి వాటికి చేర్చుతుంటారు.   పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి. కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి... ఏదైనా కూర వండేటపుడు కాకుండా చివరలో అంటే దించివేసే ముందు వేస్తేనే కూరకు మంచి సువాసన వస్తుంది. కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే ఓ గ్లాసులో నీరు పోసి వాటి వేర్లు మునిగేటట్లు ఉంచండి. మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా?  ఉంటే కాసిన్ని ధనియాలు చల్లి నీరు చిలకరించండి కొత్తిమీర వస్తుంది. ఒకవేళ స్థలం లేకపోయినా పూలకొండీలలో చల్లినా చాలు.
‘బతికుంటే బలుసాకు తినొచ్చు’... ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే... 100 గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి. అంటే 20 గ్రా. మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ, సి - విటమిన్లూ, 100 గ్రా. ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి. అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్‌. అంతేనా... రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది. ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే... కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, వ్యాధులన్నీ పారిపోతాయి.
  మానవ శరీరం లో ఉన్న ప్రతీ అవయవం చాల గొప్పది.. ఏది సరిగా పని చేయకపోయినా దాని ప్రభావం పూర్తిగా శరీరం పై పడుతుంది. కానీ ఒక్క అవయవం తో  మనం మానసిక స్థితిని, భౌతిక స్థితిని , ఆధ్యాత్మిక స్థితిని కూడా పొందవచ్చని మీకు తెలుసా..  అది ఎలా అంటారా మనం చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, మనకు తెలియదు. చేతి వేళ్ళని కొన్ని భంగిమలలో పెట్టె ప్రక్రియని ముద్ర అంటారు. మరి ఆ ముద్రలలో రకాలు వాటి వాళ్ళ మనకి కలిగే ప్రయోజనాలు అవి ఎలా వేయాలో చూద్దాం.. 1.జ్ఞాన ముద్ర: ఈ జ్ఞాన ముద్ర వేయడం వల్ల మనలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది , నాలెడ్జి కూడా ఇంప్రూవ్ అవుతుంది ,ఇంకా మన జ్యపకశక్తిని కూడా పెంచుతుంది. ఇంకా ఈరోజుల్లో చాల మంది నిద్రలేమి తో బాధపడుతున్నారు. ఈ ముద్ర వేయడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. మరి ఈ ముద్ర వేయడం ఎలా అంటారా చాల సులభం. మనం బొటన వేలుని చూపుడు వేలుతో కలిపి ఉంచి మిగిలిన మూడు వెళ్ళాను నిటారుగా నిలపడమే ఈ జ్ఞాన ముద్ర. ఇది మనం ఎపుడైనా వేయవచ్చు నిల్చున్నపుడు , కూర్చున్నపుడు , నిద్రపోయేటప్పుడు ఇలా ఎప్పుడైనా వేయవచ్చు 2.సూన్య ముద్ర: ఈ ముద్ర ని ఎలా వేయాలంటే మన మధ్య వేలుని బొటన వేలు తో ఒత్తి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టాలి ,ఇలా రోజుకి కనీసం నలభై నిమిషాలైనా చేస్తే మన శరీరంలో ఉన్న dullness అనేది లేకుండా పోతుంది ,చెవి నొప్పి లాంటి సమస్యలేమైనా ఉన్న కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు ఇంకా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ముద్ర  బాగా  ఉపయోగపడుతుంది 3.ప్రాణ ముద్ర: ఈ ముద్ర ఎలా వేయాలంటే మన ఉంగరపు వేలుని ,చిటికెన వేలుని బొటనవేలికి టచ్ చేసి మిగిలిన రెండు వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ ప్రాణ ముద్ర ,ఇది ఎప్పుడు ఐన వేయవచ్చు. ఇది వేయడం వల్ల మనలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది , ఇంకా బద్దకాన్ని నివారిస్తుంది, ఇంకా మానసికంగా , శారీరకంగా దృఢం గ ఉండేలా చేస్తుంది ,ఇంకా మన కంటిచూపు మందగించడాన్ని మెరుగుపరుస్తుంది ,ఈ ముద్ర వేయడం వల్ల మనిషి చాల ఆక్టివ్ గ ఉంచేలా చేస్తుంది 4.ధ్యాన ముద్ర: ఇది ఎలా చేయాలంటే మన రెండు చేతుల్ని అరచేతులు పైకి వచ్చేలా మన ఒడిలో పెట్టుకుని రెండు బొటన వేళ్ళు మాత్రమే టచ్ అయేలా ఉంచాలి. దీన్ని కదలకుండా నిటారుగా కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచి ఎంతసేపైనా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది చిరాకు,డిప్రెషన్, స్ట్రెస్ లాంటి వాటినుండి చాల రిలీఫ్ ఉంటుంది. ఇది చాల పవర్ఫుల్ ముద్ర 5.బుద్ది ముద్ర: ఇది కూడా చాల ముఖ్యమైన ముద్ర మన చేతి బొటన వేలుని చిటికెన వేలితో కలిపి ఉంచి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ  బుద్ధి ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా , మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడానికి ఇది  బాగా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతని కోరుకునే ప్రతి ఒక్కరు  ఈ ముద్ర లు తప్పక  కంటిన్యూ చేయండి. 6.సూర్య ముద్ర: మన చేతి ఉంగరం వేలు ని బొటన వేలు కింద మడిచి పెట్టి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ సూర్య ముద్ర ఈ సూర్య ముద్ర వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు ఈ ముద్ర చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. 7.ఆపాన ముద్ర: మన చేతి మధ్య వేలుని , ఉంగరం వేలుని బొటన వేలుతో కలిపి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ ఆపాన ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇంకా మన శరీరంలోని  వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపిస్తుంది. 8.గణేష్ ముద్ర: మన రెండు చేతులను సగం పిడికిలి బిగించి ,రెండు చేతులను కలిపి బిగించి , మన ఛాతి భాగానికి పెట్టి నిటారుగా కూర్చుని ఈ ముద్ర వేయాలి. ఈ ముద్ర వేయడం వల్ల మన శరీర దారుఢ్యం చక్కగా ఉంచడానికి , మన కండరాల తీరు పని చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 9.వాయు ముద్ర: మన చేతిలో చూపుడు వేలుని మధ్యకి మడిచి బొటనవేలితో అదిమిపెట్టి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే వాయు ముద్ర ఈ ముద్ర ని వేయడం వల్ల మన శరీరం లో ఉన్న చేదు గాలి బయటికి వచ్చి మన కి ఉన్న నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాదు విపరీతమైన కీళ్ల, కండరాల నొప్పులను రాకుండా చేస్తుంది, ఇంకా మనం చిరాగ్గా అనిపించినపుడు కూడా ఈ ముద్ర వేస్తె ప్రశాంతంగా ఉంటాం.. https://www.youtube.com/watch?v=BFMHOO_XUE8  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.