EDITORIAL SPECIAL
  పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం కూడా ఉంది. పాదయాత్రలో జగన్ ఈ పెన్షన్ గురించి చెప్పారు. చేనేతలు, ఇతర వృత్తుల్లో ఉండే బలహీనవర్గాలకు చెందిన వారు కష్టం చేసి.. 45 ఏళ్లకే సర్వశక్తులు కోల్పోతున్నారని.. వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ.. ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం దీని గురించి రాయలేదు.  అయితే తాజాగా అసెంబ్లీలో టీడీపీ ఈ హామీ గురించి ప్రస్తావించింది. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమవగానే.. 45 ఏళ్లకే పెన్షన్ అంశాన్ని హైలెట్ చేసింది. 45 ఏళ్లకే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇస్తామన్న పెన్షన్ ను ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే జగన్ మరియు వైసీపీ నేతలు మాత్రం మేనిఫెస్టోలో ఆ హామీ లేదన్నట్లుగా మాట్లాడారు. మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు మాత్రం.. జగన్ హామీని అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఈ అంశాన్ని బలంగా వినిపించిన నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడులపై.. స్పీకర్ చైర్ లో కూర్చున్న కోన రఘుపతి.. సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించేశారు. దీంతో వైసీపీ సర్కార్ టీడీపీ చేతికి ఆయుధం ఇచ్చినట్లు అయింది. జగన్ హామీ విషయంలో మాట తప్పారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేసినా, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సస్పెండ్‌ చేశారని విమర్శించారు. హామీలు విస్మరిస్తున్నారని సభలో ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా?అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారని, దానిని విస్మరిస్తున్నారని చెబితే సస్పెండ్‌ చేస్తారా?అని దుయ్యబట్టారు. పెన్షన్లపై ప్రశ్నించడమే తన తప్పయిందని, దీనిపై మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన్ ఏం సమాధానం చెబుతారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా జగన్ మీద విమర్శలు గుప్పించారు. 46 ఏళ్లకి వైఎస్ జగన్ గారికి ఉద్యోగం వచ్చింది.. 45 ఏళ్ల పెన్షన్ రత్నం మాయమయ్యింది అని ఎద్దేవా చేసారు. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కగానే మర్చిపోయారా? అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి వారిని మోసం చేసారని లోకేష్ విమర్శించారు. టీడీపీ నేతలనే కాదు నెటిజన్లు కూడా 45 ఏళ్ళ పెన్షన్ పై జగన్ యూటర్న్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు.. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో.. టీడీపీకి చెందిన మిగతా ఎమ్మెల్యేలు కూడా సభ నుండి వాకౌట్ చేసారు. మొత్తానికి 45 ఏళ్ల పెన్షన్ హామీతో టీడీపీ జగన్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి జగన్ ఈ హామీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మేనిఫెస్టోలో లేదని లైట్ తీసుకుంటారో, లేక మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పకుండా అమలు చేస్తాను అంటారో చూడాలి.
  అసెంబ్లీలో చంద్రబాబు కాకుండా టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు కారణం ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరే అని చెప్పాలి. గెలిచిందే 23 మంది ఎమ్మెల్యేలు అంటే.. వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అసలు వారి వాయిస్ నే వినిపించట్లేదు. ఎమ్మెల్యేల వైఖరి పట్ల బాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అధికారపక్షం వైసీపీ తరఫున అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య, రామానాయుడు తప్ప మిగిలిన వారెవరూ పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలు బాబుపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా కూడా పెద్దగా స్పందించడం లేదు. గతంలో అసెంబ్లీలో ఉన్న సమయంలో కరణం బలరామ్, పయ్యావుల కేశవ్‌ వంటి వారు టీడీపీ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. వారి వాగ్ధాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందిపడే వారు. అలాంటిది ఇప్పుడు వారి గొంతు అసెంబ్లీలో అసలు వినిపించడం లేదు. అనవసరంగా వైసీపీకి టార్గెట్ అవ్వడం ఎందుకని కొందరు, టీడీపీలో ఇంకెన్ని రోజులు ఉంటామో తెలీదు ఈ మాత్రం దానికి హడావుడి ఎందుకని మరికొందరు.. సైలెంట్ గా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి టార్గెట్ అవుతామనే భయం సంగతి పక్కనబెడితే.. టీడీపీ నుంచి పది మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎలాగూ పార్టీ మారిపోతాం కదా.. ఇప్పుడెందుకు అసెంబ్లీలో చొక్కాలు చించుకోవడం అని బీజేపీ గూటికి చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు సైలెంట్ అవుతున్నారట.  కరణం బలరాం, పయ్యావుల కేశవ్, వల్లభనేని వంశీ బీజేపీలో చేరతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ముగ్గురూ నోరు విప్పడం లేదట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నుంచి అసలు స్పందనే లేదు. బీజేపీలో చేరే వారిలో తొలి వ్యక్తి గంటానే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు గొట్టిపాటి రవి, గద్దెరామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ బాబు ఎందుకు నోరెత్తడం లేదనేది మరో ప్రశ్న. సాధారణంగా గొట్టిపాటి రవి అసెంబ్లీలో మితంగా మాట్లాడతారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఇక మంచి వాగ్ధాటి ఉన్న గద్దె రామ్మోహన్ కూడా ఈసారి అస్సలు మాట్లాడటం లేదు. బాబు గురించి అవహేళనగా మాట్లాడుతున్నప్పుడు కూడా గద్దె రామ్మోహన్ స్పందించడంలేదు. వెలగపూడి రామకృష్ణబాబుది కూడా ఇదే తీరు. దీంతో ఎమ్మెల్యేల తీరుపై బాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
  ప్రపంచ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది.  Working Group on International Financial Institutions (WGonIFIs) మరియు అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ యొక్క బాధిత సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ప్రజల ఉద్యమాలు, పౌర సమాజ సంస్థల వ్యతిరేకత మరియు ప్రభావిత వర్గాల వారి నుంచి తనిఖీ ప్యానెల్ కి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంపై నర్మదా బచావ్ ఆందోళన్ మరియు నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ యొక్క సీనియర్ కార్యకర్త మేధా పట్కర్ స్పందించారు. "అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టులో పాల్గొన్న స్థూల ఉల్లంఘనలను ప్రపంచ బ్యాంక్ గ్రహించి, ఈ నిర్ణయం తీసుకోవడం మాకు సంతోషంగా ఉంది. నర్మదా మరియు టాటా ముంద్రా తరువాత, ఇది ప్రపంచ బ్యాంక్ గ్రూపుపై సాధించిన మూడవ అతిపెద్ద విజయం. నర్మదా బచావ్ ఆందోళన్ పోరాటం కారణంగా ఏర్పడిన తనిఖీ ప్యానెల్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ప్రజల అనుమతి లేకుండా వారి ఎజెండాను ముందుకు తీసుకురావద్దని మేము ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తున్నాం" అన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ కు 2014 లో శ్రీకారం చుట్టినప్పటి నుండి.. పర్యావరణ నిపుణులు, పౌర సమాజ సంస్థలు మరియు ఉద్యమ సంఘాలు.. పర్యావరణ చట్టాల ఉల్లంఘన, ఆర్థిక అసమర్థత, సారవంతమైన భూమిని భారీగా స్వాధీనం చేసుకోవడంపై తమ ఆవేదన వ్యక్తం చేశాయి. సారవంతమైన వ్యవసాయ భూములు తీసుకోవడం వల్ల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసాయి. రాజధాని ప్రాంత రైతు సమాఖ్యకు చెందిన మల్లెల శేషగిరిరావు మాట్లాడుతూ.. "మా భూమి మరియు జీవనోపాధికి సంబంధించి అనిశ్చితితో మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ పోరాటం మా జీవితంలో మరచిపోలేని ఒక ముద్ర వేసింది. ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో ఇప్పటికైనా రాష్ట్రం మరియు ఇతర ఫైనాన్షియర్లు అర్డంచేసుకొని.. ప్రజల ఆందోళనలను నిజాయితీ మరియు నిబద్ధతతో పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాము." అన్నారు. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) యొక్క మరొక సహ-ఫైనాన్షియర్.. తమను తాము పారిస్-పోస్ట్ బ్యాంక్‌గా అంచనా వేస్తూ.. వాతావరణ అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి నిబద్ధతను సూచిస్తూ, ఇప్పుడు దృష్టి సారించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ వారి అధికారిక పత్రాలలో పరిశీలనలో ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టులో కో-ఫైనాన్షియర్‌గా మాత్రమే ప్రవేశించి.. AIIB ఈ ప్రాజెక్టులో కట్టుబడి ఉండటానికి ప్రపంచ బ్యాంక్ విధానాలను ఉపయోగించింది. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు వైదొలగడంతో సహ-ఫైనాన్షియర్‌గా, ఇప్పుడు AIIB యొక్క స్థితి అస్పష్టంగా ఉంది. WGonIFIs రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవల్సినవి: 1. సిఆర్‌డిఎ ల్యాండ్ పూలింగ్ యాక్ట్‌.. 2013 కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉంది. అమరావతి క్యాపిటల్ రీజియన్‌లోని బాధిత ప్రజలందరి విషయంలో భూసేకరణ మరియు పునరావాస చట్టం, 2013 ను పూర్తిగా అమలు చేసి. అలాగే, ప్రజల నుండి అసంకల్పితంగా తీసుకున్న స్థలాలను ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి.  2. వ్యవసాయం, కార్మికులు, అద్దెదారులు, భూమిలేని కుటుంబాలు, భూసేకరణ మరియు స్థానభ్రంశం ప్రక్రియ కారణంగా తీవ్రమైన ఒత్తిడి మరియు భయానికి గురైన దళితుల సామాజిక-ఆర్థిక నష్టం, భూ లావాదేవీలు అంశాలపై న్యాయ విచారణను ప్రారంభించాలి. 3. గత ఐదేళ్లలో వారి సామాజిక జీవితం చాలా వరకు దెబ్బతిన్నందున దళితులు మరియు భూ యజమానుల కోసం ప్రత్యేక పరిహార ప్యాకేజీని ప్రకటించాలి. 4. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు క్యాపిటల్ రీజియన్ ప్రకటించిన తరువాత కేటాయించిన భూములను కొనుగోలు చేసిన ఇతర వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయాలి. 5. డాక్యుమెంటరీ తారుమారు ద్వారా దళిత రైతులను రికార్డుల నుండి తొలగించే ప్రయత్నాలను ఆపివేసి, 2013 చట్టం ప్రకారం పరిహారం మరియు ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకున్న భూమికి అసలు యజమానులుగా దళితులని పరిగణించాలి. ప్రాజెక్ట్ గురించి: జూన్ 2014 లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తరువాత, కొత్తగా ఏర్పడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని నిర్ణయించుకున్నాయి. 2014 సెప్టెంబరులో, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అమరావతిని ప్రతిపాదిత రాజధాని నగరంగా ప్రకటించారు, దీనిని చాలా సంవత్సరాలు పాటు అభివృద్ధి చేయనున్నారు. 715 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ మరియు AIIB పరిశీలనలో ఉన్నాయి. రిస్క్ అసెస్‌మెంట్‌లో కూడా, ప్రపంచ బ్యాంక్ సామాజిక మరియు పర్యావరణ ప్రభావాలను సూచిస్తూ ఈ ప్రాజెక్ట్ కి కేటగిరి A ని కేటాయించింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో నగరాన్ని నిర్మించడం, సారవంతమైన వ్యవసాయ భూములు మరియు అడవులను తొలగించడం, సుమారు 20 వేల కుటుంబాలను స్థానభ్రంశం చేయడం, బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవడం మరియు నగర నిర్మాణానికి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి విషయాల్లో ఈ ప్రాజెక్టుపై విమర్శలు వచ్చాయి. ప్రపంచ బ్యాంకు యొక్క భద్రతా విధానాలను ఉల్లంఘించినందుకు ఈ ప్రాజెక్టుపై దర్యాప్తు చేయడానికి ప్రపంచ బ్యాంకు యొక్క తనిఖీ ప్యానెల్ కు 2017 లో బాధిత సంఘం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ప్రక్రియలో ఉంది మరియు తనిఖీ బోర్డు నుండి దర్యాప్తు అర్హతపై సిఫారసు కోసం బ్యాంక్ బోర్డు వేచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకోవడంపై.. అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో అమరావతి నిర్మాణం మీద వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా మరింతగా ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించింది. కానీ వైసీపీ నేతలు కొందరు రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు, గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కి కూడా ఫిర్యాదులు చేశారు. వ‌ర‌ద‌ముప్పు, వివిధ పంట‌లు పండించే ప్రాంతం, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ కోణంలో జ‌రిగేన‌ష్టం వంటి అంశాల‌ను ముందుకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగక ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వెళుతుందంటూ రాజ‌ధాని ప్రాంత రైతుల పేరిట కొంద‌రు 2017 మే 25 నాడు ప్ర‌పంచ‌బ్యాంక్ కి ఈమెయిల్స్ పంపి ఫిర్యాదు చేశారు. ఆ విషయాలను గుర్తుచేస్తూ టీడీపీ విమర్శిస్తోంది. ప్రతిపక్షం నుంచి అధికారంలోకీ వచ్చిన వైసీపీ ఇప్పుడు రాజధాని విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
  బిగ్ బాస్ మూడో సీజన్ మొదలైంది. ప్రారంభానికి ముందే వివాదాలతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సీజన్.. ముందు ముందు ఇంకెన్ని వివాదాలతో క్రేజ్ పెంచుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఈ సీజన్.. బిగ్ బాస్ హౌస్ లోకి 15 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. వీరిలో ఆడియన్స్ ని మెప్పించి చివరివరకు నిలిచేది ఎవరు? ఆడియెన్స్ ని విసిగించి త్వరగా బయటికొచ్చేది ఎవరంటూ విపరీతంగా చర్చ జరుగుతోంది. అయితే అనూహ్యంగా.. హౌస్ నుంచి త్వరగా బయటికొచ్చే వారి లిస్ట్ లో యాంకర్ శ్రీముఖి పేరు వినిపిస్తోంది. శ్రీముఖికి యాంకర్ గా యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తన కెరీర్ కూడా దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో ఓ షోలో పార్టిసిపేట్ చేయడం కోసం శ్రీముఖి తను హోస్ట్ చేస్తున్న షోస్ కి బ్రేక్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. సరే.. బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చి వచ్చింది, చివరి వరకు ఉండి ఎంటర్టైన్ చేస్తోంది, టైటిల్ కూడా గెలవచ్చు అని ఆడియెన్స్ భావిస్తున్నారు. అయితే శ్రీముఖి చివరివరకు ఉండరట. కేవలం షో కి హైప్ తీసుకురావడం కోసమే నిర్వాహాకులు ఆమెని తీసుకొచ్చారట. శ్రీముఖి కూడా కేవలం రెండు, మూడు వారాలు మాత్రమే హౌస్ లో ఉంటానన్న కండీషన్ మీద వచ్చారని ప్రచారం జరుగుతోంది. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ఓ యాంకర్ వంద రోజులు ఇలా బందీ అయిపోయి.. మిగతా షోలకు దూరమవ్వడం నిజంగా కెరీర్ ని రిస్క్ లో పెట్టడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. శ్రీముఖి కూడా అదే ఆలోచించి కేవలం రెండు మూడు వారాలు మాత్రమే హౌస్ లో ఉంటానని కండీషన్ పెట్టారట. నిర్వాహాకులు కూడా శ్రీముఖి వల్ల షో కి ఎంతో కొంత కచ్చితంగా ప్లస్ అవుతుందని భావించి.. భారీ రెమ్యూనరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిబట్టి చూస్తుంటే శ్రీముఖి త్వరగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
 ఏస్ డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ , రామ్  చ‌ర‌ణ్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో రామ్ చ‌ర‌ణ్ కు జంట‌గా బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ న‌టిస్తోంది. ఇక ఎన్టీఆర్ స‌ర‌స‌న మొద‌ట హాలీవుడ్ భామ డైసీ ఎడ్గ‌ర్ ను హీరోయిన్ గా ఫైన‌ల్ చేశారు. కానీ, ఆమె కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. ఈ  క్ర‌మంలో చాలా మంది ఇంగ్లీష్ బ్యూటీస్ ని అనుకుని  హలీవుడ్ సింగ‌ర్ , న‌టి ఎమ్మా రాబ‌ర్ట్స్ ని తీసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. దీంతో ఎన్టీఆర్ కు కూడా హీరోయిన్ దొర‌కిన‌ట్టే అంటున్నారు ఫిలింన‌గ‌ర్ జ‌నాలు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మా హాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టించింద‌ట‌. ఇండియ‌న్ సినిమాలో ఇదే ప్ర‌థ‌మం. అయితే ఇటీవ‌ల రాజ‌మౌళి ఎమ్మా ని ఫైన‌ల్ చేయడానికే అమెరికా వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను డివివి దాన‌య్య గ్రాండ్ గా నిర్మిస్తుండ‌గా ఎమ్ ఎమ్ కీర‌వాణి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.
                       ఇటీవ‌ల విడుద‌లైన `చిత్రలహరి` చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా "ప్రతిరోజు పండగే ``  చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని షూటింగ్ కి విళ్ళిన విష‌యం తెలిసిందే.. ఈ సినిమా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ని ఎనౌన్స్ చేయ‌గానే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. కొన్ని ప్రాజెక్ట్ కి అంతే అన్ని అలా క‌ల‌సివ‌స్తోంది.  ఈ చిత్రం లో సాయితేజ్‌, రాశిఖ‌న్నా లు జంట‌గా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ ఇంత‌కు ముందు సుప్రీమ్ లాంటి ఎంట‌ర్‌టైనింగ్ ఫిల్మ్ లో చేశారు. అలాగే ఈ బ్యాన‌ర్ పై మారుతి కాంబినేష‌న్ లో వ‌చ్చిన భ‌లేభ‌లేమ‌గాడివోయ్ లాంటి ఎంట‌ర్‌టైనింగ్ ఫిల్మ్ వ‌చ్చింది. ఇప్ప‌డు వీరంతా ఓకే సెట్ పై వుంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాక ఇంకేమిటి ప్ర‌తిరోజు పండ‌గే అనే టైటిల్ జ‌స్టిఫికేష‌న్ లా షూటింగ్ జ‌రుగుతుంది. సుప్రీమ్ హీరో సాయితేజ్‌, రాశిఖ‌న్నా లు క‌లిసి వున్న సెల్ఫి పిక్ ని హీరోయిన్ రాశిఖ‌న్నా ట్వీట్ చేయ‌టం మెగా అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.
                               'బాహుబలి చిత్రం తరువాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుండి ఏ అప్‌డేట్ వ‌చ్చినా అది సంచ‌ల‌న‌మే అవుతుంది. అస‌లు ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా  యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్  న‌టిస్తున్న సాహో చిత్రం వైపుకి తిరిగింది. ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కొసం సాహో మూవీ గురించి అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ వారి అల‌రిస్తున్నాడు. ఈరోజు స్ట‌న్నింగ్ రొమాంటిక్ పోస్ట‌ర్ ని పోస్ట్ చేశాడు. అగ‌ష్టు 30 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము అనే సందేశం తో హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ కి నెటిజ‌న్ లు ఫిదా అయిపోయారు. ఇక డైహ‌ర్ట్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు.. ఇప్పటి వ‌ర‌కూ వ‌చ్చిన సాహో ప్ర‌మెష‌న్ అంతా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా క‌నిపించినా ఇప్పుడు వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ లో ల‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ క‌నిపించ‌డం విశేషం. సాహో లో ఇంకా షేడ్స్ వున్నాయని విడుద‌ల తేది లోపు సాహో లు వున్న షేడ్స్ ఆప్ సాహో తెలియ‌జేస్తాం అని యూనిట్ స‌బ్యులు అంటున్నారు.ఈ చిత్రం ఇండియాలో  మెట్ట‌మెద‌టిగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతుంది.  ఈ చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యం లో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైస్టాండ‌ర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ చిత్రానికి సంబందించి మెద‌టి సింగిల్ ని విడుద‌ల చేశారు. రెండ‌వ సింగిల్ ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తున్నారు.  యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'స‌క్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టిని... స‌క్సెస్ ఈజ్ ఏ జ‌ర్నీ' - 'మహర్షి'లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్. నిజానికి, ఇంగ్లీష్‌లో పాపుల‌ర్ కోట్ ఇది. ప్రముఖ తమిళ హీరో, సింగమ్ సూర్య నోట ఇదే డైలాగ్ వచ్చింది... 'బందోబస్త్' తమిళ్ మాతృక 'కప్పాన్' ఆడియో వేడుకలో. 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన ఈ సినిమాలో మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్ ప్రధాన పాత్రలు పోషించారు. తీవ్రవాదం, నదీజలాల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని సూర్య నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు ముందు వచ్చిన సూర్య సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. వాటిని దృష్టిలో పెట్టుకుని 'సక్సెస్ అనేది గమ్యం కాదు... అదొక ప్రయాణం' అని చెప్పి ఉంటారు. 'బందోబస్త్' తమిళ ఆడియో రజనీకాంత్ చేతుల మీదుగా విడుదలైంది. సూర్య తొలి చిత్రం చూసి తనకు నటించడం రాదని అనుకున్నానని, అతణ్ణి అతను గొప్ప నటుడిగా మలచుకుని 'గజినీ', 'శివపుత్రుడు', 'సింగం' వంటి ఎన్నో గొప్ప చిత్రాలు చేశాడని రజనీకాంత్ అన్నారు.
  తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో టీడీపీ ఓటమికి పునాది వేసాయా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న పార్టీని బ్రతికించడం కోసం బాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి.. ఏపీలో కూడా పార్టీని ప్రమాదంలో పడేశారని చెప్పక తప్పదు. అసలు టీడీపీని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీగా భావిస్తున్నారు. అలాంటిది మహాకూటమి పేరుతో బాబు కాంగ్రెస్ తో దోస్తీ చేయడంతో టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారనేది వాస్తవం. టీడీపీ, కాంగ్రెస్ ల దోస్తీ.. ఇరు పార్టీలకు తెలంగాణలో నష్టం చేయడమే కాకుండా.. ఏపీలో టీడీపీకి తీవ్ర నష్టం చేసిందనే చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రా పెత్తనం అంటూ బాబుని కార్నర్ చేసి కాంగ్రెస్ గట్టిదెబ్బ కొట్టారు. మరోవైపు అసలే తెలంగాణ టీడీపీ అంతంత మాత్రం ఉందంటే.. ఈ దోస్తీ మూలంగా మరికొందరు కూడా టీడీపీకి దూరమయ్యారు. ఈ దోస్తీ ఎఫెక్ట్ ఏపీలో కూడా బాగా పనిచేసింది. ఎందరో కార్యకర్తలు టీడీపీకి దూరమయ్యారు. అదేవిధంగా ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం ఉండటంతో బాబు మీద పడింది. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపారని.. ఏపీ ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత ఏర్పడింది.
  ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు నేతలకు బీజేపీ గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కోట అని ఫీలవుతున్న తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీ జోష్‌లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా బలపడాలని అధికారంలోకి రావాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీలోకి ఆహ్వానించింది.  గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన కూడా బీజేపీలో చేరడానికి పచ్చ జెండా ఊపారట. ఈరోజు బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా బీజేపీలో చేరతారని సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ అనూహ్యంగా బాల్క సుమన్ చేతిలో ఓడారు.  అనంతర పరిణామాల్లో గులాబీ తీర్ధం పుచ్చుకున్న ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు కేసీఆర్. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్‌ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ తనదేనని వివేక్ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్ నేత పోటీ చేసి ఆ తర్వాత టీఅయేఎస్ లో చేరిన వెంకటేష్ కి టికట్ ఇచ్చారు.  ఆయన అలా ఇవ్వడానికి కారణం సామాజిక వర్గమే అయినా అప్పటి నుండి వివేక్ ఆ పార్టీకి దూరం అయ్యారు.  అలా కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వివేక్, వినోద్ సోదరులు టీఆర్ఎస్‌ కి కాంగ్రెస్ కంటే కూడా బీజేపీయే సరైన ప్రత్యామ్నయం అని భావించారని అందుకే ఆహ్వానం రాగానే వీరు కాషయ కండువా కప్పుకునేందుకు సిద్దమయినట్టు చేబుతున్నరు. వివేక్ బీజేపీలో చేరితే వినోద్ కంటే భాజ‌పాకే ఎక్కువ లాభం ఉంది.  ఎందుకంటే తెలంగాణ‌లో భాజ‌పాకి సొంత మీడియా అంటూ ఇంత‌వ‌ర‌కూ ఏదీ లేదు. అధికార పార్టీకి కొన్ని మీడియా సంస్థ‌లు తమ సహాకారం అందిస్తుండగా, టీవీ 9 మాజీ సీఈవో పెట్టె కొత్త ఛానల్ బీజేపీకి సపోర్ట్ గా ఉంటుందని అనుకున్నారు. దానితో పాటు ఇప్పుడు వినోద్ రాక‌తో ఒక న్యూస్ ఛానెల్‌, ఒక ప‌త్రిక భాజ‌పాకి అండ‌గా నిలిస్తుందని చెప్పచ్చు. అండగా నిలుస్తుంది అనడం కంటే కూడా బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్ అయిన వీ6 ఛానెల్‌తోపాటు వెలుగు పత్రిక దొరికినట్టే. ఎందుకంటే వీటిని రన్ చేసేది వివేక్ కుటుంబీకులే. ఒకప్పుడు టీఆర్ఎస్ కి మద్దతుగా వార్తలు ప్రచురించిన ఈ రెండూ ఆ తర్వత న్యూట్రల్ గా ఉంటూ వచ్చింది. తాజాగా పరిణామాలతో ఆ రెండూ ఇప్పుడు బీజేపీకి బాకా ఊదనున్నాయన్నమాట !     
  ఓ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్ తో సత్సంబంధాలు కలిగి ఉండటం చూస్తుంటాం. అయితే గత ఐదేళ్ళలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ తో బాబు సత్సంబంధాలు కొనసాగించలేదనేది వాస్తవం. నిజానికి నరసింహన్ కాంగ్రెస్ హయాంలో గవర్నర్ గా నియమించబడ్డారు. అయితే 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. కాంగ్రెస్ నియమించిన ఎందరో గవర్నర్లు మారిపోయారు కానీ.. నరసింహన్ మాత్రం అలాగే కొనసాగారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగారు. అప్పుడు బాబు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. నరసింహన్ తమకి అంత అనుకూలంగా లేరని కూడా తెలుసు. అయినా బాబు ఎందుకనో ఏపీకి కొత్త గవర్నర్ ని నియమించండని బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అదే బాబు చేసిన తప్పని కొందరి అభిప్రాయం. తరువాత బాబు బీజేపీకి దూరమయ్యారు. నరసింహన్ మాత్రం బీజేపీకి దగ్గరై గవర్నర్ గా కొనసాగుతూ వచ్చారు. బాబు, గవర్నర్ ల మధ్య దూరం కూడా.. టీడీపీని అధికారానికి దూరం చేసి, ప్రతిపక్షానికి పరిమితం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో గవర్నర్ తో సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాబుకి దూరమవ్వడంలో గవర్నర్ పాత్ర ఉందని కూడా ప్రచారం జరిగింది. ఓ రకంగా గవర్నర్ బాబుని ఒంటరిని చేసారని కూడా అంటుంటారు. ఈ అంశంపై పూర్తీ విశ్లేషణ కోసం ఈ వీడియో చూడండి.
  అసెంబ్లీలో నియమించనున్న కమిటీలను ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించాల్సి ఉంది. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి సభ్యులను జగన్ నియమించినా ఛైర్మన్‌ ను మాత్రం ప్రతిపక్షం నుండి నియమించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో  పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ మొదలయ్యింది. ఈ పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని సమాచారం.  ప్రతిపక్షానికి దక్కే వాటిలో ఇది కీలక పదవి కావడంతో టీడీపీ అధినేత అన్ని రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మన్ అంటే మంత్రి పదవికి దాదాపు సమానం ఏపీలో ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రాజెక్టుల్లో అవినీతి, భూకేటాయింపులు, ఉద్యోగ నియామకాలు ఇలా అన్ని అంశాల్లో ప్రశ్నించే హక్కు ఉంటుంది. అందుకే కేబినెట్ హోదా ఉండే ఈ పదవి కోసం టీడీపీలో పోటీ ఉందని అంటున్నారు.  ఇంతటి కీలకమైన పదవి కావడంతో టీడీపీ సీనియర్ నేతలు సైతం ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. పీఏసీ ఛైర్మన్ పదవి రేసులో నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. మాజీమంత్రి అచ్చెన్నాయుడు,  సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరామ్, సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.  అయితే అధినేత చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్నది ఆసక్తిగా మారింది. తొలుత తెలుగుఎసం అధిఅకారంలోకి రాగానే వైసీపీ ప్రతిపక్షంలో ఉండి ఈ పదవిని, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రరెడ్డికి ఇచ్చింది, ఆయన పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరాక ప్రస్తుత ఆర్ధిక మంత్రి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పీఏసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఈ పదవిని అడ్డం పెట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని చాలా సార్లు కానర్ చేయడానికి చూసారు. అందుకే ఈసారి కూడా కాస్త పదునైన నేతకి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు,
  ఏపీ రాజధాని అమరావతికి  ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఏపీ రాజధాని నిర్మాణానికి 300 మిలియన్ డాలర్ల రుణ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. అయితే అలా ఎందుకు ఆపామో ప్రకటించక ముందే ఈ విషయం మీద రాజకీయంగా దుమారం రేగి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో వెనక్కు తగ్గిందని టీడీపీ ఆరోపించింది.  మరోపక్క గత ప్రభుత్వ తీరువలన విసిగిపోయి నందువలనే ప్రపంచ  బ్యాంకు ఋణం ఇవ్వడం లేదని వైసీపీ కౌంటరిచ్చింది. అయితే ఎన్ని రాజకీయ ఆరోపణలు చేసుకున్నా ప్రపంచ బ్యాంక్ సహకారం లేకుండా అమరావతి నిర్మించడం దాదాపు అసాధ్యం, అందుకే ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులని వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో అంతగా ఆసక్తి చూపలేదని, కేంద్ర ప్రభుత్వం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది.  అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని అందుకే తాము తప్పుకున్నామని తెలిపింది. అయితే రుణ సాయం చేయలేకపోయినప్పటికీ ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల రుణ సాయం యధావిధిగా కొనసాగుతోందని పేర్కొంది. వినూత్నమైన ఆలోచనలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారని స్వయం సహాయక బృందాలు వంటి సరికొత్త ఆలోచనతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏపీ కితాబిచ్చిన్న వరల్డ్ బ్యాంక్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే తప్పకుండా సాయం చేస్తామని స్పష్టత ఇచ్చింది.   అయితే కేంద్రం వ్యవహరిచిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి. ఏపీతో తమకు అవసరం లేదు కాబట్టే  సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ బీజేపీవాదుల వాదన మరోలా ఉంది, అదేంటంటే ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ చేసి నిధులు ఇస్తామని అన్నదని అలంటి సంప్రదాయాన్ని అలవాటు చేస్తే అన్ని చోట్ల అలాగే ఇన్స్పెక్షన్ లు చేస్తారని అందుకే వద్ద్దని కేంద్రం పేర్కొందని అంటున్నారు. అయితే ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ప్రపంచ బ్యాంకు ఋణం ద్వారా కట్టే ప్రాజెక్ట్ లు కడుతున్నట్టు అయితే, ఈ బ్యాంక్ ఇన్స్పెక్షన్ లకి భయపడాల్సింది ఏముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని మీద కేంద్రం సమాధానం ఏమని చెబుతుందో ? వేచి చూడాలి. 
  కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గం గా పేరొందిన ఆళ్లగడ్డలో రాజకీయాలు పలు కీలక మలుపులు తిరుగుతున్నట్టు చెబుతున్నారు. తల్లి మరణంతో వైసీపీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరి తండ్రి మరణంతో మంత్రి పదవి దక్కించుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ స్థానం నుండి ఓడిపోయారు. గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్ర రెడ్డి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.  ఆమె మాత్రమే కాక ఆమె సోదరుడు కూడా నంద్యాల నుండి పోటీ చేసి ఓడిపోవటంతో వారింట ముసలం పుట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నికల ముందే ఆమె మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ వీడి వైసీపీలో చేరిపోయారు. అలాగే సొంత బాబాయ్ గా భావించే సుబ్బారెడ్డి కూడా తనకు ప్రాధాన్యత తగ్గించిన క్రమంలో వారి కుటుంబానికి దూరం అయ్యారు. భూమా అఖిలప్రియ భార్గవ్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నాక భూమా కుటుంబంలో చీలిక వచ్చినట్టు సమాచారం.  అఖిలప్రియ భర్త అన్నీ తానై వ్యవహరించడం కూడా భూమా వర్గీయులను దూరంగా జరగడానికి కారణమైందని అంటున్నారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కూతురిని వివాహం చేసుకున్న భార్గవ్ ఆ తర్వాత అఖిల ప్రియతో ప్రేమలో పడి ఆమెకి విడాకులు ఇచ్చి మరీ అఖిల ప్రియను పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఉంది. ఆ విషయం పక్కన పెట్టినా ఆమెను వివాహం చేసుకున్న నాటి నుండే మంత్రి భర్తగా ఆయన తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు.  అధికారిక పర్యటనలు మొదలు పార్టీ పర్యటనల దాకా అఖిల్ వెన్నంటే ఉండేవారు. ఇదే భూమా వర్గీయులకి కోపం తెప్పించిందట. భూమా తర్వాత భూమ వారసుడిగా జగత్ విఖ్యాత్ రెడ్డిని తెరమీదకు తేవాలని భూమా వర్గం భావిస్తోంది, కానీ అఖిలప్రియ భర్త హోదాలో భార్గవ్ తానే భూమా వారసుడిననేలా ప్రవర్తిస్తుండడంతో అఖిలప్రియకు బదులుగా భూమా వర్గాన్ని లీడ్ చేసేందుకు విఖ్యాత్ రెడ్డిని, అలాగే వీరికి సోదరుడు వరసయ్యే కిషోర్ రెడ్డిని తెరపైకి వచ్చారు.  ఇప్పటికే వైసీపీలో గంగుల వర్గం ఉంది కాబట్టి, కిషోర్ రెడ్డి బీజేపీలో చేరి భూమా లీగసీని నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో అఖిలప్రియకు ఇప్పుడు ఆమె సోదరుడు కిషోర్ కుమారే పోటీ అని భూమా వర్గం భావిస్తుందట. విఖ్యత్ రెడ్డి ప్రస్తుతం చదువుకుంటున్నాడు, ఆయన లైన్ లోకి వచ్చే దాకా కిషోర్ రెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నారని అంటున్నారు.    
  అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించాలని తెగ కోరికగా ఉండేది. తన దాహాన్ని తీర్చేందుకు తగిన గురువు ఎక్కడ దొరుకుతారా అని, ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇక ఎలాగైనా సరే... ఓ గొప్ప గురువు దగ్గరకి వెళ్లి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలని బయల్దేరాడు. కుర్రవాడు అలా బయల్దేరాడో లేదో... అతని ఊరి చివరే ఒక పెద్దాయన కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి ‘నేను ఓ గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను. మీ దృష్టిలో అలాంటి గురువు ఎవరన్నా ఉంటే చెప్పగలరా!’ అని అడిగాడు. ‘ఓ దానిదేం భాగ్యం! నాకు తెలిసిన కొందరి పేర్లు చెబుతాను. వారి శిష్యరికంలో నీకు తృప్తి లభిస్తుందేమో చూద్దాం,’ అంటూ కొన్ని పేర్లు చెప్పాడు. పెద్దాయన చెప్పిన మాటలను అనుసరించి కుర్రవాడు ఆయా గురువులను వెతుక్కుంటూ బయల్దేరాడు. కానీ అదేం విచిత్రమో! ఎవ్వరి దగ్గరా తనకి తృప్తి లభించలేదు. అతని జ్ఞాన తృష్ణ చల్లారలేదు. అలా ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ, గాలిపటంలా దేశమంతా తిరుగుతూ తన యాత్రలను సాగించాడు. ఎక్కడా అతనికి తగిన బోధ లభించలేదు. అలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు గడిచిపోయాయి. అతనిప్పుడు కుర్రవాడు కాదు, యువకుడు! చివరికి నిరాశగా కాళ్లీడ్చుకుంటూ తన ఊరివైపు బయల్దేరాడు. యువకుడు ఊళ్లోకి అడుగుపెడుతుండానే అతనికి ఒకప్పుడు తారసపడిన పెద్దాయన కనిపించాడు. కానీ ఎందుకనో ఆ పెద్దాయన మొహం చూడగానే ఆయన గొప్ప జ్ఞానిలా తోచాడు. ఆయన దగ్గరకి వెళ్లి మాట్లాడుతున్నకొద్దీ... తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న గురువు ఆయనే అనిపించింది. ‘నేను పదేళ్ల క్రితం గురువుని వెతుక్కుంటూ మీ దగ్గరకి వచ్చినప్పుడే... మీరు నన్ను శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు! నా జీవితంలో పదేళ్లు వెతుకులాటలో వృధా కాకుండా ఉండేవి కదా!’ అంటూ నిష్టూరమాడాడు యువకుడు. యువకుని మాటలకు పెద్దాయన చిరునవ్వులు చిందిస్తూ.... ‘నువ్వు పదేళ్ల క్రితం చూసినప్పటికీ, ఇప్పటికీ నేను పెద్దగా మారలేదు. మారింది నువ్వే! ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ నువ్వు అన్ని రకాల వ్యక్తులనూ చూశావు. ఏ మనిషి ఎలాంటివారు అని బేరీజు వేయగలిగే విలువైన నైపుణ్యాన్ని సాధించగలిగావు. ఆ నైపుణ్యంతోనే ఇప్పుడు నన్ను గుర్తించగలిగావు. అందుకే ఈ పదేళ్లు వృధా కానేకాదు. ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే సరిపోదు. దాన్ని నెరవేర్చుకోగలిగే నైపుణ్యం కూడా సాధించాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలిగే అర్హత ఏర్పడుతుంది,’ అంటూ యువకుడిని తన శిష్యునిగా స్వీకరించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
  ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నానారకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వేరొకరికి చెప్పుకుంటే చాలు, సగం తీరిపోతాయని వారి నమ్మకం. ఆఖరికి వైద్యుడి దగ్గరకు వెళ్లిన రోగి కూడా, తన మనసులో ఉన్న బాధని వైద్యునితో చెప్పుకునే అవకాశం వస్తే... సగం రోగం నుంచి ఉపశమనం పొందినంతగా తృప్తి చెందుతాడు. కానీ ఇతరుల బాధని పట్టించుకునే నాథుడు ఎవడు! అంత తీరికా, ఓపికా ఈ ప్రపంచంలో ఎవరికి ఉన్నాయి. అందుకనే అందరూ మాట్లాడటానికి ఇచ్చిన ప్రాముఖ్యతని, వినడానికి ఇవ్వడం లేదు. ఇతరుల మనసుని గెలవాలన్నా, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నా... వినడం అనే కళలో ఆరితేరాలంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అందుకోసం వారు కొన్ని చిట్కాలను కూడా అందిస్తున్నారు. అవేమిటంటే...     తగిన వాతావరణాన్ని కల్పించండి చాలామంది ఇళ్లలోకి వెళ్లినప్పుడు... వాళ్లు ఒకపక్క మనతో మాట్లాడుతూనే ఉంటారు, మరో పక్క టీవీనో దినపత్రికో చూస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భాలు చాలా చికాకుని కలిగిస్తాయి. ఒక వ్యక్తి చెప్పే మాటలని వినాలీ అంటే దానికి తగిన వాతావరణాన్ని సృష్టించాలి. రణగొణధ్వనుల మధ్యా, టీవీ శబ్దాల మధ్యా, నలుగురూ మెసిలే చోటా సంభాషణ సీదాసాదాగా సాగిపోతుందే కానీ మనసులో ఉన్న మాటలు నిస్సంకోచంగా వెల్లడి కావు.     శరీర భాష వినడం అంటే శూన్యంలో చూస్తూ ఉండిపోవడం కాదు. మాట్లాడే వ్యక్తికి మీరు ఆసక్తిగా వింటున్నారన్న భావన కలగాలి. అతని కళ్లలోకి సూటిగా చూస్తూ ఉండటం. మధ్యమధ్యలో తలని ఆడిస్తూ ఉంటడం, మెడని కాస్త ముందుకి వంచడం... వంటి సంకేతాల ద్వారా మీరు అవతలి వ్యక్తిని ఆలకిస్తున్నారన్న భావనని కల్పించగలగాలి.     ప్రోత్సహించండి మీ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే అవతలివారు మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. కాబట్టి మధ్యమధ్యలో వారి నుంచి మరింత సమాచారాన్నీ, మరింత స్పష్టతనీ రాబట్టేందుకు ప్రయత్నించండి. అవునా, అలాగా, నిజమే వంటి పదాలను వాడటం ద్వారా ‘నీ ఉద్దేశం ఏమిటి?’, ‘నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు?’ వంటి ప్రశ్నల ద్వారా అవతలి వ్యక్తి తన మనసులో ఉన్న భావాలను పూర్తిగా వెల్లడించేందుకు అవకాశాన్ని ఇవ్వండి.   అడ్డుకోవద్దు ఇతరులు చెబుతున్న విషయం మీద మనకు విరుద్ధమైన అభిప్రాయాలు ఉండవచ్చు. అవతలి మనిషి చెప్పే విషయం మీద మనకే ఎక్కువ అవగాహన, తెలివి ఉన్నాయి అనిపించడమూ సహజమే! కానీ ఎదుటివారికి తన మనసులోని మాటని పూర్తిగా చెప్పే అవకాశాన్ని కల్పించాలి. అలా కాకుండా చీటికీమాటికీ అడ్డుకోవడం వల్ల మీకు అతని అభిప్రాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్న విషయం తేలిపోతుంది. ‘వినడం’ అన్న స్థానంలో ‘వాదన’ చోటుచేసుకుంటుంది.   కేవలం వినండి ఎదుటి వ్యక్తి మాటలను వింటూనే, మనం వాటి గురించి అప్పటికప్పుడు ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాము. అంటే వినడమూ, విశ్లేషణా ఏకకాలంలో జరిగిపోతూ ఉంటాయి. కొంతసేపటి తరువాత మనం ఏర్పరుచుకున్న అభిప్రాయానికి అనుగుణంగానే అతని పట్ల మన దృక్పథమూ మారిపోతుంది. ఇది నిజంగా తొందరపాటే అవుతుంది. అందుకే ముందు కాస్త స్థిమితంగా అవతలి వ్యక్తి చెప్పే మాటలన్నీ వినాలి, ఆ తరువాత వాటిని విశ్లేషించుకుకోవాలి, చివరికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి అతను చెప్పిన విషయం మీద ఒక అవగాహనకు రావాలి.   అన్నింటికీ మించి ఎదుటి వ్యక్తికి కూడా మనలాగే భిన్నమైన వ్యక్తిత్వం, విభిన్నమైన అభిప్రాయాలు ఉండే అర్హత ఉందని భావించిననాడు... ఒక సాటి మనిషిగా అతని విలువని గుర్తించినప్పుడు, అతని మాటలను కూడా శ్రద్ధగా ఆలకించాలని అనిపిస్తుంది. మన ఆలోచనే గొప్ప, మన వ్యక్తిత్వమే ఉన్నతం అనుకునే అహంకారంలో ఎవ్వరి మాటలూ వినిపించవు. వినిపించినా మనసులోకి చేరవు.   - నిర్జర.
ఒక ఊరిలో జనమంతా కలిసి తమకి ఇష్టమైన దేవుని శిల్పాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. అందుకోసం చుట్టుపక్కల అంతా వాకబు చేసి ఒక శిల్పిని రప్పించారు. శిల్పి వచ్చీరాగానే తన పనిని ప్రారంభించాడు. శిల్పం కోసం సరైన శిలను ఎన్నకున్నాడు. ఊరి ప్రజల అభీష్టాన్నీ అనుసరించి వారి ఇష్టదైవాన్ని ఆ శిల్పంలో తొలవడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. రోజులు వారాలుగా మారాయి. వారాలు కాస్తా రెండు నెలలయ్యాయి. శిల్పి చెక్కుతున్న శిల్పం తుదిరూపుకి చేరుకుంది. కానీ మనసులో ఏం తోచిందో ఏమో కానీ, ఒక రోజున ఆ శిల్పాన్ని కాస్తా పక్కనపెట్టేశాడు శిల్పి. విగ్రహాన్ని చెక్కే పనిని మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఒక రోజు శిల్పిని వెతుక్కుంటూ అతని స్నేహితుడు వచ్చాడు. దీక్షగా విగ్రహాన్ని చెక్కుతూ కూర్చున్న శిల్పిని చూశాడు. ఆ పక్కనే పడేసి ఉన్న విగ్రహమూ అతనికి కనిపించింది. ‘‘ఆ విగ్రహం ఇంచుమించుగా పూర్తయిపోయింది కదా! మళ్లీ రెండో విగ్రహాన్ని చెక్కుతున్నావేంటి’’ అంటూ వాకబు చేశాడు స్నేహితుడు. ‘‘ఆ విగ్రహం సరిగా రాలేదు’’ అంటూ బదులిచ్చి తన పనిలో నిమగ్నం అయిపోయాడు శిల్పి. ఆ మాటలకు స్నేహితుడు శిల్పం దగ్గరకి వెళ్లి పరీక్షగా చూశాడు. ఎంతగా చూసినా అతనికి ఎలాంటి లోపమూ కనిపించలేదు. ‘‘అదేంటి శిల్పం అద్భుతంగా వచ్చింది కదా! నేను చూసిన గొప్ప శిల్పాలలో ఇది ఒకటని ఖచ్చితంగా చెప్పగలను,’’ అన్నాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో ‘‘ఒక్కసారి ఆ శిల్పం కళ్లని పరీక్షగా చూడు. అవి సరిగ్గా కుదరలేదు,’’ అని చెప్పాడు. స్నేహితుడు మరోసారి ఆ శిల్పాన్ని పరీక్షగా చూస్తే ఆ మాట నిజమేననిపించింది. కానీ అంత చక్కటి శిల్పాన్ని పక్కన పెట్టడాన్ని అతని మనసు ఇంకా ఒప్పుకోలేదు. ‘‘ఆ శిల్పాన్ని ఎక్కడ ఉంచుతున్నారు!’’ అని అడిగాడు స్నేహితుడు. ‘‘ఈ ఊరి దేవాలయంలో, పది అడుగుల ఎత్తైన పీఠం మీద,’’ బదులిచ్చాడు శిల్పి. ‘‘నీకేమన్నా మతి పోయిందా! పది అడుగుల ఎత్తైన పీఠం మీద, మరో పది అడుగుల ఎత్తున్న ఈ విగ్రహంలోని కళ్లలో చిన్నపాటి లోపం ఎవరికి కనిపిస్తుంది. పైగా కాస్త రంగు పూశావంటే ఆ ఉన్న కాస్త లోపమూ ఎవ్వరికీ తెలియనే తెలియదు. దాని కోసం రెండు నెలలుగా పడ్డ కష్టాన్ని వృధా చేసుకుంటావా! ఈ పల్లెటూరి బైతుల కోసం ఇంత కష్టం అవసరమా!’’ అంటూ దులిపేశాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో- ‘‘ఈ విగ్రహంలో లోపం ఎవ్వరికీ, ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు కదా! ఒక లోపంతో ఉన్న శిల్పాన్ని చెక్కానన్న విషయం నా మనసులో నిలిచిపోతుంది. అది జీవితాంతం నా వృత్తి మీద ఒక మచ్చగానే మిగిలిపోతుంది. ఇక కష్టాన్ని వృధా చేసుకోవడం అంటావా... అది నా దృష్టిలో పనితీరుని మరింతగా మెరుగుపరుచుకోవడమే! మనం చేసే పనికి ఎంత ధర వస్తోంది? ఎవరి కోసం పనిచేస్తున్నాం? అన్న విషయం ఎప్పుడూ ముఖ్యం కాదు. మనసుకి తృప్తి కలిగించేలా పనిని పూర్తిచేశామా లేదా అన్నదే ముఖ్యం. ఆ తృప్తి కోసం పడే తపన మన పనిని మరింతగా మెరుగుపరుస్తుంది. అదే చివరివరకూ నిలుస్తుంది,’’ అంటూ చెప్పుకొచ్చాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
    ఎట్టకేలకు కర్ణాటక అసెంబ్లీ లో బల పరీక్ష జరిగింది. ఈ బలపరీక్షలో కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ  ప్రభుత్వం  ఓటమి పాలయ్యింది. కుమారస్వామి  ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 105 ఓట్లు పడగా అనుకూలంగా 99 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీనితో ప్రస్తుత జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం  పతనమైంది. త్వరలో బీజేపీ నాయకత్వం లో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. చూద్దాం బొటాబొటి మెజారిటీ తో ఆ ప్రభుత్వం ఎంత కాలం నిలుస్తుందో..   
    ఏపీలో గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి ఘన విజయం  సాధించిన  విషయం తెలిసిందే. ఐతే ఈ ఎన్నికలలో ఇవిఎం లను  టాంపర్ చేసి జగన్ గెలవటానికి బీజేపీ సహకరించిందని టీడీపీ నాయకులు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఐతే తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎపి బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ నిన్న తెనాలి లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ  సంచలన వ్యాఖ్యలు చేసారు. మొన్న జరిగిన ఎన్నికలలో బీజేపీ కి చెందిన 20 శాతం ఓట్లు వైసిపి కి పడటంతోనే అంత భారీ విజయం సాధ్యమైందని అన్నారు. 2014 లో జరిగిన ఎన్నికలలో తమతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవటంతో ఆ పార్టీ అధికారం లోకి వచ్చిందని చెప్పారు. ఐతే టీడీపీ అధికారం లోకి వచ్చిన తరువాత చంద్రబాబు  రాష్ట్రం లో మోడీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసారని అలాగే గత ఎన్నికలలో మోడీ పై లేని పోనీ ఆరోపణలు చేయటంతో బీజేపీ ఓటు బ్యాంకు ఎక్కువగా వైసిపి కి చేరిందని తెలిపారు. ఐతే 2019  లో జరిగిన ఎపి ఎన్నికలలో బీజేపీ ఓటు షేరు ౦.84 శాతం ఉండటం గమనార్హం.   
  ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకురావాలని వైసీపీ ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు సమయంలో.. శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లొచ్చారు. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యంపాలైన ఆమె, బెయిల్ పొంది.. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో.. ఆమెను తెలంగాణ క్యాడర్ కు కేటాయించారు. అయితే ఏపీలో వైసీపీ గెలిచిన తర్వాత జగన్.. కొంత మంది తెలంగాణ అధికారులను ప్రత్యేకంగా ఏపీకి తీసుకురావాలనుకున్నారు. వారిలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. కేసీఆర్ తో జరిగిన తొలి భేటీలోనే.. వీరిని ఏపీకి డిప్యూటేషన్ పై పంపాలని జగన్ కోరారు. దానికి కేసీఆర్ అంగీకరించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో.. ఫైల్ ను కేంద్రానికి పంపారు.  సివిల్ సర్వీస్ అధికారుల డిప్యూటేషన్లు చూసే.. ఢిల్లీలోని డీవోపీటీ విభాగం వీరి డిప్యూటేషన్ ఫైళ్లను పక్కన పెట్టేసింది. నిబంధనల ప్రకారం.. బలమైన కారణం లేకపోవడంతో డిప్యూటేషన్ పని జరగడం లేదు. విజయసాయిరెడ్డి.. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించినా పని కాకపోవడంతో.. నేరుగా శ్రీలక్ష్మినే ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. విజయసాయి.. శ్రీలక్ష్మిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తీసుకెళ్లారట. పార్లమెంట్ ప్రాంగణంలో అమిత్ షాను కలిసిన శ్రీలక్ష్మి.. తనను ఏపీకి డిప్యుటేషన్ పై పంపాలంటూ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే.. డిప్యూటేషన్ పై అమిత్ షా హామీ ఇచ్చారో లేదో స్పష్టత లేదు. మరో వైపు శ్రీలక్ష్మీకి ఓకే చెబితే.. స్టీఫెన్ రవీంంద్ర ఫైల్ కూడా ఓకే అవుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపధ్యంలో డిప్యూటేషన్ల పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
  ప్రపంచంలో కొందరికి కుడిచేతి వాటం ఉంటే మరికొందరు ఎడమచేతినే ఎందుకు ఉపయోగిస్తారు? ఈ చిన్న ప్రశ్నకి ఇప్పటివరకూ కూడా సరైన జవాబు కనుక్కోలేకపోయారు శాస్త్రవేత్తలు. జన్యువులో ఉండే ఏదో తేడా వల్లే కొందరికి ఎడమ చేతి వాటం అలవడుతుందని మాత్రం ఊహిస్తున్నారు. కానీ ఆ జన్యువు ఏదో ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయారు.   ప్రపంచంలోని ప్రతి వస్తువునీ కుడిచేతివారికి అనుగునంగానే రూపొందించారు. దాంతో ఎడమచేతి వాటం ఉన్నవారు చాలా ఇబ్బందులనే ఎదుర్కోవలసి వస్తుంటుంది. పులి మీద పుట్రలాగా ఇప్పుడు ఎడమ చేతివారికి మరో సమస్య ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే ఇది మనం ఏర్పరుచుకున్నది కాదు.... స్వతహాగా వారి జన్యువులలో ఉన్నదే!   అమెరికాలోని కొందరు పరిశోధకులు 13,536 మందిని పరిశీలించి తరువాత తేల్చిందేమిటంటే... ఎడమచేతి వాటం ఉన్నవారిలో కోలమొహం ఉండే అవకాశం ఎక్కువ. ఇతరులతో పోలిస్తే వీరిలో కోలమొహం ఉండే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉందట! అబ్బే... ఇదీ ఒక పరిశోధనేనా అనుకునేరు. ఎందుకంటే మన శరీరంలోని ప్రతి భాగమూ, ప్రతి మార్పూ ఏదో ఒక లక్షణానికి సూచనగా నిలిచే అవకాశం ఉంది. అలాగే కోలమొహం ఉన్నవారిలో కూడా క్షయవ్యాధి సోకే అవకాశం ఎక్కువని అంటున్నారు.   దాదాపు రెండువేల సంవత్సరాల క్రితమే ఒక గ్రీకు వైద్యుడు... క్షయవ్యాధితో బాధపడుతున్నవారిలో ఎక్కువమందికి కోలమొహం ఉండటాన్ని గమనించాడు. అది నిజమేనని ఆధునిక పరిశోధనలు నిరూపించాయి. ఏ జన్యువులైతే ఎడమచేతి వాటానికీ, కోలమొహానికి కారణం అవుతున్నాయో... అవే జన్యువుల క్షయవ్యాధికి కూడా త్వరగా లొంగిపోతున్నాయని తేల్చారు.   ఎడమచేతి వాటానికీ, క్షయ వ్యాధికీ మధ్య సంబంధం ఉందంటూ చెబుతున్న ఈ పరిశోధనని కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే ఇంగ్లండులో క్షయ వ్యాధి కేసులు చాలా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఎడమచేతి వాటం ఉన్నవారు కూడా ఇంగ్లండులోనే ఎక్కువ! ఈ పరిశోధన తరువాత ఎడమచేతి వాటం ఉన్నవారు ఊపిరితిత్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలేమో! - నిర్జర.
రోజుకో ఆపిల్ తింటే ఆహారంగా- ఉంచుతుంది డాక్టర్ ని దూరంగా. ఇది అసలు మన భారతీయ వాతావరణానికి సరిపోయే మాట కానే కాదు. నిజానికి మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో  పండే పళ్ళని మనం తింటే అవి మన ఒంటికి సరిగా సరిపోతాయట. అంటే అరటి, జామ, కమలా, బొత్తాయి, నేరేడు ఇలాంటివి మన వాతావరణంలో పండే పళ్ళు కాబట్టి ఇవి మన వంటికి కరెక్ట్ గా సూట్ అయ్యే పళ్ళు. వీటిలో అరటిపండు మనకి ఏడాది మొత్తం సులువుగా దొరుకుతుంది. కాని చేతికి అందుబాటులో ఉండటం వల్ల అరటి అంటే చాలా మందికి చులకన. నిజానికి ఒక అరటిపండులో 70% నీరు  ఉంటుందిట. ఎండాకాలంలో దీనిని తినటంవల్ల మనకి త్వరగా అలసట రాదు. అంతే కాదు ఒంట్లో నిస్సత్తువని కూడా దూరం చేస్తుందిట.     *  అరటిపండు తినటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుందిట. న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ వారు ఈ పండు తింటే గుండెపోటు 40% తగ్గే వీలుందని ప్రకటించారు కూడా. *  దీనిలో  పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె సరిగా పనిచేసేలా చేస్తుంది. ఈ పొటాషియం కిడ్నీలకి, ఎముకలకి కూడా బలాన్నిస్తుంది. *  దీనిలో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. ఆహ్హారం అరుగుదలకు తోడ్పడుతుంది. *  కడుపులో అల్సర్లు ఉన్నవారికి ఇదొక మంచి ఔషధం. కడుపు మంటని చక్కగా తగ్గిస్తుంది. *  విటమిన్ B6 చాల ఎక్కువగా ఉండటం వల్ల ఇది హిమోగ్లోబిన్ తయారుకావటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. *  ఈ అరటిపండులో విటమిన్ సి, మెగ్నీషియం, మెంగనీస్ కూడా ఉండటం తో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. *  మన అలసిపోయినపుడు ఒక్క అరటిపండు తింటే చాలు పోయిన ఓపిక తిరిగి వస్తుంది. ఇది ఒంట్లో శక్తిని పెంచటమే కాదు, స్ట్రెస్ ని కూడా బాగా తగ్గిస్తుంది.     *  రాత్రి పూట అరటి పండు ఒక గ్లాసు పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది కూడా. నిద్ర కి కూడా ఇది మంచి మందులాంటిది. *  డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. * అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది. సంస్కృతంలో కదళి ఫలంగా పిలిచే అరటిపండు ఎన్నో ఉపయోగాలకు పుట్టినిల్లు లాంటిది. ఒకప్పుడు ప్రతి పెరడులోను ఈ చెట్టు కనిపించేది. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో  మేలు చేస్తుంది. అరటి అక్కులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంభందిత వ్యాధులు దగ్గరకి కూడా రావు. ఇన్ని ఉపయోగాలు ఉన్న అరటిని రోజుకి ఒకటైన తినటం అలవాటుగా మార్చుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా చెక్ పెట్టచ్చు. - కళ్యాణి  
సెక్స్..మానవజాతి తన గమనాన్ని కొనసాగించేందుకు సృష్టి ఇచ్చిన అద్భుతమైన వరం. కేవలం పిల్లల్నికనడానికే కాదు..రెండు శరీరాలకు సాంత్వన కలిగించే క్రియ ఇది. ఎంత ఒత్తిడిలో ఉన్నా..ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటన్నింటిని చిత్తు చేసే శక్తి సెక్స్‌కు ఉంది. అందుకే భారతీయులు దానికి అంతటి ప్రాధాన్యతనిచ్చారు. లైంగిక వాంఛ అన్నది ప్రతి మనిషిలోనూ అత్యంత సహజంగా ఉండే భావన. ఇది జీవితంలోని  తృప్తికీ, గాఢమైన అనుభూతికీ, మరెన్నో భావోద్వేగాలకూ కీలకమైన కేంద్రం. అందుకే మన పురాణాల్లోనూ..దేవాలయ శిల్పాలుగానూ రతి అన్నదానిని చేర్చారు మన పెద్దలు. కాలంతో పాటే ఈ ప్రక్రియలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయి.   నాలుగు గదుల మధ్యలో సాగే వ్యవహారాన్ని..నలుగురికి తెలిసేంతగా బరితెగిస్తోంది నేటీ తరం..అతి ఎక్కడైనా పనికిరాదు అన్నట్లు విచ్చలవిడి శృంగారం వల్ల చేటు తప్పదు. ఆ తప్పుకు శిక్షగా సుఖవ్యాధులు మానవాళిని కబలిస్తున్నాయి. అయితే కాలంతో పాటే సుఖవ్యాధుల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సిఫిలిస్, గనోరియా, షాంక్రాయిడ్ వంటివే ఎక్కువగా కనబడేవి. కానీ ఇటీవలి కాలంలో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ కనిబెట్టిన తర్వాత సుఖవ్యాధులను జయించవచ్చని మనిషి సంబరపడ్డాడు. కానీ ఇప్పుడు వైరస్‌ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి.   ఒకప్పుడు యాంటీబయోటిక్స్‌కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏ మాత్రం లొంగకుండా..మొండిగా తయారవుతున్నాయి. శరీర నిర్మాణపరంగా పురుషులకంటే స్త్రీలకే సహజంగా సుఖవ్యాధులు సోకే అవకాశాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. వీరికి సుఖవ్యాధులు సోకినా వెంటనే లక్షణాలేవి కనబడకపోవచ్చు. వీటి కారణంగా దీర్ఘకాలంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, సంతాన రాహిత్యం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటివి ముంచుకొచ్చే ప్రమాదముంది. కొన్ని రకాల సుఖవ్యాధుల బారిన పడిన స్త్రీలకు పుట్టే బిడ్డలకూ ఆ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దాదాపు 20 ఏళ్లకే యువతీయువకులు సెక్స్‌లో పాల్గొంటున్నారు. ఈ వయసులో ఆకర్షణ, ప్రేమ వంటి వ్యవహారాల వల్ల ఒకరి కంటే ఎక్కువ మందితో అసురక్షిత శృంగారంలో పాల్గొని సుఖవ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.   ఇక్కడ శృంగారం అంటే సంభోగమే కాదు. ముద్దులు ఇతర లైంగిక చర్యలు కూడా శృంగారం కిందకే వస్తాయి. చాలా మంది వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ..నలుగురికీ తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతూ లోలోపల తామే కుంగిపోతున్నారు. కొందరు వైద్యుల వద్ద కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ తీవ్ర సమస్యల్లోకి జారిపోతున్నారు. ఇలాంటి వారి జీవితం నరకం కావడమే కాకుండా..వీరి ద్వారా ఇతరులకూ వ్యాపించి సమాజం మొత్తాన్ని విష వలయంలోకి నెట్టేస్తాయి. అందుకే సుఖవ్యాధులు దరిచేరకుండా పూర్తి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటించడం ఒక్కటే సరైన మార్గం.    * తెలిసీ తెలియక లైంగిక ప్రయోగాలకు దిగవద్దు. *  నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవడం మంచింది. * అపరిచితులతో సెక్స్‌లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్ ధరించాలి * శృంగారంలో అసహజ పద్ధతులకు దూరంగా ఉండాలి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.