తెలంగాణ బడ్జెట్ పై పెదవివిరుపు

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు పెదవివిరుస్తున్నాయి. ఆర్భాటపు ప్రచారం తప్ప బడ్జెట్ తో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని మండిపడుతున్నాయి. అంకెల గారడీ తప్ప నిధులు ఎలా సమకూరుస్తారో బడ్జెట్ లో క్లారిటీ ఇవ్వలేదని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, నిరుపేదలకు ఇళ్ల స్థలాలపై బడ్జెట్ లో క్లారిటీ ఇవ్వలేకపోయారని మండిపడుతున్నారు. అసలు ఈ బడ్జెట్ లో 17 వేల కోట్ల లోటు ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రజాకోర్టులో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరిస్తున్నారు.