భద్రంగా పెట్టమని డబ్బు ఇచ్చాడు...
posted on May 1, 2017 3:43PM

తన ప్రసంగాలతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఇస్లామిక్ మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు అక్రమంగా డబ్బు సంపాధించాడని ఆయనపైనా, ఆయన సంస్థ ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్‌ఎఫ్)పైనా ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఈకేసు దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తన దగ్గర భద్రంగా పెట్టమని రూ.148.9కోట్లను జకీర్ ఇచ్చినట్లు ఆయన కీలక సహచరుడు, వ్యాపార భాగస్వామి ఆమిర్ అబ్దుల్ మన్నన్ గజ్దార్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు తెలియజేశారు. జకీర్ నాయక్ మేనేజర్ అస్లామ్ ఖురేషి తనకు ఈ మొత్తం ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాదు.. ఆగస్టు నుంచి అక్టోబర్ 2016 మధ్య ఈ మొత్తం డబ్బును.. ఇచ్చాడని... దఫాల వారీగా ఈ నగదును తీసుకెళతానని చెప్పినట్లు వివరించాడు. జకీర్‌పై ఎప్పుడైతే నిఘా అధికారుల కన్ను పడిందో ఆ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు.