జస్టిస్ కర్ణన్ కు వైద్య పరీక్షలు చేయండి...
posted on May 1, 2017 3:14PM

కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ పై కోర్టు ధిక్కారణ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కర్ణన్‌కు ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేల్కర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దీంతో కర్ణన్ కు మే 4వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నివేదికను మే 8వ తేదీన కోర్టుకు సమర్పించనున్నారు.
కాగా సుమారు 20 మంది జడ్జిలు అవినీతికి పాల్పడ్డారంటూ గత ఏడాది జస్టిస్ కర్ణన్ ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని కూడా ఆయన ఆరోపించారు. ఈ కేసులో జస్టిస్ కర్ణన్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయ్యింది.