జకీర్ నాయక్ తప్పేం లేదట..
posted on Jul 12, 2016 3:08PM

ఇస్లామిక్ మత గురువు జకీర్ నాయక్ కు ఊరట లభించింది. తాను చేస్తున్న ప్రసంగాల ద్వారా యువత ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని ఆయనపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఎప్పుడు భారత్ తిరిగి వస్తే అప్పుడు సమన్లు జారీ చేయాలని చూస్తున్నారు. దీంతో జకీర్ నాయక్ కూడా ముంబై రావాల్సి ఉండగా అది కూడా రద్దు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు మహారాష్ట్ర స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ (ఎస్ఐడీ) క్లీన్ చిట్ ఇచ్చేసింది. ‘పీస్ టీవీ’లో ప్రసారమైన ఆయన ప్రసంగాలను పరిశీలించిన ఎస్ఐడీ అధికారులకు జకీర్ నాయక్ వివాదాస్పద ప్రసంగాలు చేసినట్లు ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరలేదని అన్నారు. ఈ నేపథ్యంలో భారత్ కు తిరిగివచ్చాక కూడా ఆయనను అరెస్ట్ చేసే ఉద్దేశమేదీ లేదని కూడా ఎస్ఐడీ అధికారులు వెల్లడించారు.