మరో వివాదంలో దంగల్ భామ

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిని కలిసి వివాదంలో చిక్కుకుని..కశ్మీరీలకు క్షమాపణలు చెప్పిన దంగల్‌ సినిమాలో బాలనటి జైరా వసీం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్‌. అనంతరం ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న ఆయనకి బుర్ఖా ధరించి ఉన్న యువతి, ఆ పక్కనే పంజరంలో ఉన్న యువతి ఫోటో బాగా నచ్చింది. దీనిని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు విజయ్. ఈ ఫోటో జైరాం వసీం ప్రస్తుత పరిస్థితికి అర్థం పట్టేలా ఉంది. మన బాలికలు పంజరాన్ని బద్దలు కొట్టి ముందుకు సాగుతున్నారు..అని పోస్ట్ చేశారు..

 

దీనికి కొద్దిసేపట్లోనే సమాధానమిచ్చింది జైరా..గౌరవ మంత్రిగారూ.. మీరు వర్ణించినట్లు ఈ బొమ్మతో నేను కనెక్ట్ కాను..? అసలీ బొమ్మకు, నాకు కొంచెం కూడా పోలీక లేదు..అయితే బురఖా వేసుకునేవాళ్లు అందంగానే కాదు..స్వేచ్ఛగానూ ఉంటారు అని బదులిచ్చింది..ఈ సమాధానంతో ఖంగుతిన్న మంత్రి తన పోలికను సమర్థించుకుంటూ నా ఉద్దేశ్యాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావ్. నేను నిన్ను పొగిడాను, పురుషాధిక్య అభిప్రాయాలు మారాలని చెప్పాను..అయితే నువ్వింకా నన్ను అర్థం చేసుకోవడం బాధాకరం అని రీ ట్విట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu