దక్షణాఫ్రికా పర్యటనకు భారత జట్టు, జహీర్ కు చోటు

 

 

 

దక్షణాఫ్రికాలో పర్యటించే భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ఈ రోజు ప్రకటించింది. గత కొంతకాలంగా ఫిట్ నేస్ సమస్యలతో జట్టులో చోటును కోల్పోయిన పేసర్ జహీర్ ఖాన్ తిరిగి జట్టులో చోటును సంపాదించాడు. అయితే ఓపెనర్లు గౌతమ్, సెహ్వాగ లకు మరోసారి నిరాశ తప్పలేదు. అంబటి రాయుడుకు ఈసారి అవకాశమిచ్చారు.

 

భారత్ దక్షిణాఫ్రికా ఇన్విటేషనల్ ఎలెవన్ జట్టుపై భారత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత మొదటి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 18వ తేదీ నుంచి న్యూ వాండరర్స్‌లో జరుగుతుంది. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ డిసెంబర్ 25వ తేదీ నుంచి దర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరుగుతుంది. భారత్ డిసెంబర్ 5,8,11 తేదీల్లో దక్షిణాఫ్రికాపై వరుసగా జోహన్నెస్‌బర్గ్, దర్బన్, సెంచూరియన్‌ల్లో మూడు వన్డే మ్యాచులు ఆడుతుంది.



వన్డే జట్టు: మహేంద్ర సింగ్ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, అజింక్యా రహనే, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్



టెస్టు జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహనే, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ, ప్రజ్ఞాన్ ఓజా, ఇషాంత్ శర్మ