మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే?
posted on Mar 13, 2012 5:12PM
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చోటా మోటా నాయకులకు నిరాశే మిగిలింది. మున్సిపల్ ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఏడాదిన్నర క్రితం ముగిసింది. ప్రస్తుతం ఇవన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఉన్నాయి. టిఆర్ ఎస్ శాసనసభ్యుల రాజీనామాలతో వచ్చిన ఉప ఎన్నికలతోనూ, వైయస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులపై వేటు వేయడం వాళ్ల నాలుగైదు నెలల్లో జరుగబోయే ఉప ఎన్నికలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఎన్నికల తరువాత మున్సిపల్ ఎన్నికల గురించి ప్రభుత్వం ఏమైనా ఆలోచించవచ్చు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఫలితాలు తమకు ప్రతికూలంగా ఉంటే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ మరింత జాప్యం అయిన ఆశ్చర్యపోనక్కరలేదు.