జగన్ దీక్షకు ఆదినారాయణరెడ్డి దూరం.. దీంతో అర్ధమైపోయింది



 వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ పార్టీకే చెందిన కడప జిల్లా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అతని సోదరుడు ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డికూడా దీక్షకు దూరంగా ఉన్నారు. దీంతో ఎప్పటినుండో ఆదినారాయణ రెడ్డి పార్టీ మారుతున్నా అని వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టుంది.

ఇదిలా ఉండగా ఎప్పటినుండో ఆదినారాయణ రెడ్డి వైకాపా ను వీడి టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే తాను టీడీపీ అధినేత చంద్రబాబు తో కూడా మంతనాలు జరిపారు. చంద్రబాబు కూడా ఈ రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈలోపు ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడాల్సి వస్తుందని టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆదినారాయణ రెడ్డి ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టు తెలస్తోంది. కానీ ఆదినారాయణను టీడీపీలోకి ఆహ్వీనించడానికే ఎక్కవ సముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని రామసుబ్బారెడ్డి నేరుగా ఫిర్యాదు చేసినప్పుడు చంద్రబాబు మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారే తప్ప పార్టీలో చేర్చుకోబోమని చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే రామ సుబ్బారెడ్డిని ఒప్పించి ఆదినారాయణను పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్నారు. మరో వైపు వైకాపా నేతలు కూడా ఆదినారాయణను పార్టీలో ఉంచడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఆదినారాయణ రెడ్డి మాత్రం పార్టీ లో ఉంటానని ఏ ఒక్కరికి చెప్పిన దాఖలాలు లేవు. మొత్తానికి ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరాలంటే ఇంకా టైం పట్టేలా ఉన్నట్టు తెలుస్తోంది.