పిల్లి, గురుస్వామి బుజ్జగింపులు విఫలం.. ఎంపీగా రాజీనామా చేసిన విజయసాయి

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చెప్పిన విధంగా శనివారం (జనవరి 25)న ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో  రాజ్యసభ చైర్మన్  జగదీప్ ధన్కడ్ కు అందజేశారు.

తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాననీ, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాననీ శుక్రవారం (జనవరి 24) విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఈ ప్రకటనతో వైసీపీ హై కమాండ్ ఉలిక్కిపడింది. ఆయన ఏదో ఒత్తిడితో రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటారనీ, ఆయనతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయాలన్న పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గురుస్తామిలను హుటాహుటిన ఢిల్లీకి పంపింది.

వారిరువురూ వేరువేరుగా విజయసాయి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. అయితే విజయసాయి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. ముందుగా ప్రకటించిన విధంగా తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో జగదీశ్ ధన్కడ్ కు అందజేశారు. విజయసాయి నిర్ణయం తనను షాక్ కు గురి చేసిందని ఎంపీ గురుస్తామి అన్నారు. పిల్లి కూడా విజయసాయి రాజీనామాపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu