పోరాడి ఓడిన పసికూన ఆప్ఘాన్, సౌతాఫ్రికా గెలుపు

 

సౌతాఫ్రికాతో మ్యాచ్ లో 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ పోరాడి ఓడింది. టోర్నీ ఓడిపోయినా, అందరి మనసులూ గెలుచుకుంది. బ్యాటింగ్ లో ఓపెనర్ మొహ్మద్ షాజాద్ ఇరగదీశాడు. కేవలం 19 బంతుల్లో 44 పరుగులతో సఫారీలకు చెమటలు పట్టించాడు. తర్వాత వచ్చిన వాళ్లు కూడా ధాడిగా ఆడటానికి ప్రయత్నించి అవుటయ్యారు. 20 ఓవర్లలో, సౌతాఫ్రికా లాంటి బౌలింగ్ లైనప్ పై 172 పరుగులకు ఆలౌట్ అయింది ఆఫ్ఘాన్ టీం. ఓడిపోయినా, తమ పోరాటంతో అందర్నీ ఆకట్టుకుంది. సఫారీ బౌలర్లలో రబాడా, అబ్బాట్, తాహిర్ లకు తలో రెండు వికెట్లు లభించగా, క్రిస్ మోరిస్ 4 వికెట్లతో రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా క్రిస్ మోరిస్ కే లభించింది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu