పసికూనకు సౌత్ ఆఫ్రికా భారీ లక్ష్యం, డివిలియర్స్ వీరంగం

 

వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో, సౌతాఫ్రికా చెలరేగిపోయింది. వరసగా రెండో సారి ప్రత్యర్ధి టీం కు 200 పైగా స్కోరును నిర్దేశించింది. డివిలియర్స్ (29 బంతుల్లో 64) వీర విహారం చేశాడు. బ్యాటింగ్ కు వచ్చిన ప్రతీ ఒక్కరూ బ్యాట్ ఝళిపించడంతో, టోర్నీలో వరసగా రెండో సారి 200 స్కోరును దాటగలిగింది సౌతాఫ్రికా. ఈ ఘనత సాధించిన మొదటి టీం సౌతాఫ్రికాయే కావడం విశేషం. ఇంతకు ముందు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ 229/4 స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శనతో, సౌతాఫ్రికా ఓడిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu