చెత్త కోసం మర్డర్
posted on Aug 4, 2017 12:18PM

ఈ రోజుల్లో మర్డర్ అంటే సిల్లి అయిపోయింది. చిన్న చిన్న కారణాలకే సహనం కోల్పోయి ఎదుటి వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు కొందరు. ఇంటి ముందు చెత్తవేశాడన్న చిన్న కారణంతో ఓ వ్యక్తి..మరో వ్యక్తిని హత్య చేసిన ఘటన విశాఖలో జరిగింది. సబ్బవరం మండలం రావులమ్మపాలెంలో శ్రీనివాసరావు, లంక అప్పలనాయుడు కుటుంబాలు పక్క పక్క నివసిస్తున్నాయి. నిన్న రాత్రి తమ ఇంటి ముందు చెత్త వేశాడని అప్పలనాయుడు అతని కుటుంబసభ్యులు కలిసి శ్రీనివాసరావుతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌పై రాయితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.