నడిరోడ్డుపై డ్రగ్స్ దందా...

 

ఇప్పటికే హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. డ్రగ్స్ గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఈ నేపధ్యంలోనే కొంతమంది బిక్కుబిక్కుమంటుంటే.. తాజాగా మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. అదికూడా అమీర్ పేట్, మైత్రివనం ప్రాంతంలో. కోచింగ్ సెంటర్లు.. విద్యార్ధులతో నిత్యం రద్దీగా ఉండే అమీర్ పేట్.. మైత్రివనంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురిని గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారం వచ్చిన వెంటనే మూడు వైపుల నుండి దాడి చేశామని.. దీంతో పట్టుబడ్డారని... వారి నుంచి 2.5 కిలోల అల్ఫ్రాజోలం, అరకిలో డైజోఫామ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.  వీరిని ప్రస్తుతం విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి, ఆపై కస్టడీకి తీసుకుంటామని తెలిపారు. వారు ఎవరెవరికి మత్తు పదార్థాలు సరఫరా చేశారన్న విషయమై వారి సెల్ ఫోన్లను విశ్లేషిస్తున్నట్టు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu