హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది హతం...


జమ్మూకశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌‌కు చెందిన ఉగ్రవాది హతమైనట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం... జమ్మూకశ్మీర్ లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌‌కు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని నిఘా వర్గాల సమాచారం ఇవ్వడంతో.. అక్కడ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. దీంతో ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించిన భద్రతా సిబ్బంది ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మిగిలిన ఇద్దరు.. ఉగ్రవాదులు తప్పించుకోవడంతో... ఉగ్రవాదులు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu