విరాట్ ఎత్తుకున్న పాపాయి ఎవరో తెలుసా..?

 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా అది తప్పకుండా వైరల్ అవుతుంది. ఇప్పుడు తాజాగా కోహ్లీ పెట్టినా ఒక ఫొటో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ బుజ్జాయిని ఎత్తుకొని సెల్ఫీ తీసుకొని.. పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ పాప ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ.. క్రికెటర్ హర్బజన్ కూతురు హినయ. 'చిన్నారులు ఎంతో క్యూట్‌గా, అందంగా ఉంటారు. ఇక్కడ చూడండి.. బేబీ హినయ నా గడ్డంలో ఏదో వెతుకుతుంది.. హర్బజన్, గీతాబస్రా దంపతులకు దేవుడు అంతా మంచి జరిగేలా చూడాలి' అని తన పోస్ట్‌లో కోహ్లీ రాసుకొచ్చాడు. కాగా గతంలో కూడా ఎంఎస్ ధోనీ కూతురు జీవాతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేయగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu