పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఆనం....
posted on May 2, 2017 1:14PM
.jpg)
ఆనం బ్రదర్స్ టీడీపీ ను వీడి.. వేరే పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి జోరుగా ప్రచారం పొందిన సంగతి తెలసిందే. మొదట వైసీపీ పార్టీలో చేరుతారని అన్నారు..ఆ తరువాత జనసేన పార్టీలో చేరుతారని.. దానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చారు ఆనం వివేకానందరెడ్డి. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము తెలుగుదేశం పార్టీననుంచి బయటికి వస్తున్నామని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. తనతోపాటు సోదరుడు రామనారాయణ రెడ్డి కూడా టీడీపీలోనే ఉంటామని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడికి కూడా స్పష్టం చేశామని తెలిపారు. తమ సేవలు ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబుకు తెలుసని, ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో పనిచేస్తామని వివరించారు.