కాంగ్రెస్ చెప్పింది ఈ శతాబ్దపు జోక్ లా ఉంది.. వెంకయ్య

దేశ రాజకీయాల్లో ఇప్పుడు అందరూ మాట్లాడే అంశం ఒకటే మత అసహనం. ఎవరు చూసినా ఈ విషయం గురించే మాట్లాడుతున్నారు. అయితే అందరూ అంతలా చర్చించుకుంటున్న ఈ విషయాన్ని మాత్రం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జోక్ గా అభివర్ణించడం గమనార్హం. అందరిలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మత అసహనంపై వ్యాఖ్యలు చేసింది. దేశంలో సహనం తగ్గిందని.. అసహనం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ అనగా దానిపై వెంకయ్యనాయుడు స్పందించి.. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఈ శతాబ్దపు జోక్ గా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో విభజన రాజకీయాలకు బీజం వేస్తుందని..సహనశీలతపై బీజేపీకి కాంగ్రెస్ పాఠాలు చెప్పటం దెయ్యాలు వేదాలు బోదించినట్లు అవుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తన హయాంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పి ఇప్పుడు సహనశీలతపై మాటలు చెబితే బాగుంటుందని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu