ప్రత్యేక హోదా ఏం జిందా తిలిస్మాత్ కాదు ఇవ్వడానికి.. వెంకయ్యనాయుడు

 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రత్యేక హోదాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అవసరమే కానీ.. దానితోనే అన్నీ తీరిపోవని ఆయన అన్నారు. అన్నీ సమస్యలకు పరిష్కారం జిందా తిలిస్మాత్ మాదిరి.. ప్రత్యేక హోదాతో అన్నీ సమస్యలు పరిష్కారం కావన్నారు. ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగిఉన్నాయి. కాని ఇప్పటికీ సమస్యల పరిష్కారానికి మావద్దకు వస్తున్నారని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా పై నీతి అయోగ్ పర్యవేక్షిస్తుంది.. ఈ కమిటీ నిర్ణయం తీసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడటం ఏంటంని ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu