ఇదే క్లైమాక్స్.. టీడీపీలోకి వంగవీటి రాధా!!
posted on Mar 12, 2019 12:02PM

వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీలో చేరబోతున్నారన్న సంకేతాలు వచ్చాయి. కానీ తర్వాత ఎందుకో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే ఆయన ఈ మధ్య లగడపాటి రాజగోపాల్ తో భేటీ అయ్యారు. దీంతో రాధా టీడీపీలో చేరడానికి లగడపాటి రాయబారం అంటూ ప్రచారం జరిగింది. ఇంతలో ఆయన వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో భేటీ అయ్యారు. దీంతో రాధా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారో అర్థంగాక తెగ చర్చలు జరిగాయి. అయితే తాజాగా రాధా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సోమవారం రాత్రి రాధా, లగడపాటి తో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ తర్వాతనే రాధా టీడీపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన డిమాండ్లపై చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీలు లభించిన తర్వాత సైకిలెక్కాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాధాకు నర్సారావుపేట లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.