రిజర్వేషన్ల కోసం.. నిన్న జాట్లు.. నేడు రాజ్ పుట్లు
posted on Mar 21, 2016 11:49AM
.jpg)
రిజర్వేషన్ల కోసం రోజుకో ప్రాంతంలో రోజుకో ఉద్యమం మొదలవుతుంది. మొన్నటి వరకూ తమకు రిజర్వేషన్లు కావాలని జాట్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో రాజ్ పుట్లు కూడా ఉద్యమానికి తెరతీయనున్నాయి. తమకు కూడా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని గళమెత్తుతున్నారు. దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన బిజ్నూర్, ముజఫర్ నగర్ ల కేంద్రంగా ‘రవా రాజ్ పుట్ సేవా సమితి’ ఓబీసీ రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర జనాభాలో 7 శాతం ఉన్న రాజ్ పుట్లు ఆర్థికంగానే కాక సామాజికంగానూ అభివృద్దికి ఆమడదూరంలో ఉన్నారని సమితి ప్రతినిధి దేవేంద్ర కుమార్ చెప్పారు. సీఎం అఖిలేశ్ యాదవ్ తో తమ ప్రతినిధి బృందం త్వరలో సమావేశం కానుందని, ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కుమార్ చెప్పారు. మరి వీరి ఉద్యమం ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో..