తెలంగాణలో ఎన్నికలు..877 వాహనాలు స్వాధీనం

 

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు 877 టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వీటిని అందిస్తున్నారని స్ధానిక కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో  ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ లోని న్యాయమూర్తి హోదా అధికారి విచారణ జరిపి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లోని 1012 మంది మత్స్యకారులకు సరఫరా చేయాల్సిన టీవీఎస్ వాహనాలను ఎన్నికల కోడ్ కు ముందే మత్స్యశాఖ మంజూరు చేసింది. కంపెనీ నుంచి వాహనాలు ఆలస్యంగా రావడం, ఈలోపు ఎన్నికల కోడ్ అమలులోకి రావడం జరిగింది. వచ్చిన వాహనాలను షోరూమ్ లో డంప్ చేసేందుకు స్థలం లేకపోవడంతో స్ధానిక బీపీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఉంచారు. గోదాం అద్దెకు లభించడంతో తరలింపు ఏర్పాట్లు జరుగుతుండగా మహాకూటమి నాయకులు అడ్డుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయటంతో ఆయన ఆదేశాల మేరకు వాహనాలను సీజ్ చేసి మత్స్యశాఖకు అప్పగించారు. ఎన్నికల అనంతరం వాటిని పంపిణీ చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu