నెల్లూరును వైజాగ్ గా మార్చేస్తానంటున్న సుబ్బిరామిరెడ్డి

నెల్లూరు లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.సుబ్బిరామిరెడ్డి క్రమంగా పుంజు కుంటున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆయనకు నెల్లూరు టిక్కెట్టు ఇచ్చిన తరువాత ఈ నెల 4వ తేదీన మందీమార్భాలంతో నియోజకవర్గానికి వచ్చారు. ఆనాటి నుంచి ఇప్పటివరకూ ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలతో సుబ్బిరామిరెడ్డి బిజీనిజీగా ఉన్నారు. జన్మభూమి ఋణం తీర్చుకోడానికే తాను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నానని వైజాగ్ తరహాలో నెల్లూరును కూడా అభివృద్ధి చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా, ఎవరినీ నొప్పించకుండా, తాను ఏది చేయాలనుకున్నానో వివరిస్తూ చేస్తున్న ప్రసంగాలకు ప్రజలనుంచి మంచి స్పందన లబిస్తోంది.

 

 

అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలోని గూపులన్నింటినీ ఏకం చేయటానికి కృషి చేస్తున్నారు. తాను ఎంపిగా గెలిస్తే అసంతృప్తనేతలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలోని సగం ప్రాంతాల్లో ఆయన ప్రచారం పూర్తి చేశారు. స్థానిక ప్రజా సంఘాలు, వివిధ కుల సంఘాల ప్రతినిధులను సుబ్బిరామిరెడ్డి అనుయాయులు స్వయంగా కలుసుకుని వారి మద్దతు కోరుతున్నారు. మరోవైపు ఆయన ప్రధాన ప్రత్యర్థి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డికి కొన్ని చోట్ల ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అల్లూరు మండలం నార్త్ మోపూరులో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు రైతులపై దాడి చేయడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కలిగిరిలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకవైపు మేకపాటి సమస్యలు ప్రజాప్రతిఘటనలతో సతమతమవుతుండగా, మరోవైపు టి.సుబ్బిరామిరెడ్డి మాత్రం ఏకంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటూ తన పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu