ట్రంప్ భార్యకు 'వెయ్యి కోట్ల' కోపం వచ్చింది!
posted on Sep 2, 2016 4:43PM
.jpg)
ఆమె ఆషామాషి ఆడది కాదు! అంత స్పెషలా అంటారా? అవును చాలా స్పెషల్! ఎందుకంటే ఆమె అంతా సవ్యంగా సాగితే అమెరికా ఫస్ట్ లేడీ అవుతుంది కాబట్టి! కాని, అంతటి ఇంపార్టెన్స్ వున్న సదరు సెలబ్రిటీ మహిళపై ఓ అమెరికన్ టాబ్లాయిడ్ నోరు పారేసుకుంది. అందుకే, ఆమె కూడా తిక్కరేగి కోర్టు మెట్లెక్కింది. ఏకంగా వెయ్యి కోట్లు పరువు నష్టం దావా వేసింది!
అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతోన్న డోనాల్డ్ ట్రంప్ తెలుసుగా? యూఎస్ ప్రెసిడెంట్ అవ్వకుండానే ఫుల్ ఫేమస్ అయిపోయాడు అతను. సహజంగానే బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎలాంటి వ్యూహాలు పన్నాలో బాగా తెలిసిన వాడు. దాంతో వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో వుంటున్నాడు!
ట్రంప్ తనకు నొటికి వచ్చిందల్లా మాట్లాడటం మనకు కొత్తేం కాదు. కాని, అతడి గురించి అమెరికన్ మీడియా కూడా అత్యుత్సాహంతో చాలానే రాసింది. అతడి భార్యని కూడా వదల్లేదు. డైలీ మెయిల్ అనే టాబ్లాయిడ్ ట్రంప్ భార్య మెలానియా ఒకప్పుడు సెక్స్ వర్కర్ అంటూ ఇష్టానుసారం కూతలు కూసింది. అందుకు పెద్దగా సాక్ష్యాలు కూడా చూపలేదట ఆ పేపర్!
1990లలో మోడల్ గా పని చేసి 2005లో ట్రంప్ ను పెళ్లాడింది మెలానియా. కాని, ఆమె అంతకు ముందు సెక్స్ వర్కర్ గా, ఎస్కార్ట్ పొట్ట పోసుకుందని డైలీ మెయిల్ రిపోర్ట్ చేసింది. ఈ వార్తపై ఆగ్రహంతో ఊగిపోయిన మెలానియా కోర్టుకు వెళ్లింది. తన పరువుకు భంగం కలిగించిన ఆ పత్రిక తనకు 150మిలియన్ డాలర్లు నష్టపరిహారం ఇవ్వాలని కేసు వేసింది!
కోర్టులో మెలానియా వేసిన కేసు ఏమవుతుందో ముందు ముందు తెలుస్తుంది. అలాగే, హిల్లరీ క్లింటన్ తో పోటీ పడుతోన్న ఆమె భర్త ట్రంప్ కూడా అమెరికా అధ్యక్షుడు అవుతాడో లేదో మరి కొన్ని నెలల్లో తేలిపోతుంది! అంతలోపు ఈ పరువు నష్టం దావా మంచి పబ్లిసిటీ ఇష్యూగా మాత్రం ఊపయోగపడుతంది!