ఆడపిల్ల పుట్టిందని.. టీఆర్ఎస్ లీడర్ రెండో పెళ్లి....


టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ ఆడపిల్లా.. మగపిల్లవాడా అన్న తేడా పెద్దగా ఎవరు పట్టించుకోవడంలేదు. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు పోటీ పడుతున్నారు. ఎక్కడో కొంత మంది ఉన్నారు.. ఆడపిల్లా.. మగపిల్లాడా అని చూసేవారు. అది కూడా చదవుకోనివారు.. కాస్త మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నవారు. కానీ ఇక్కడ ఓ ప్రజా ప్రతినిధి కూడా ఆడపిల్ల పుట్టిందని ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అతను ఎవరో కాదు...ఓ టీఆర్ఎస్ ప్రతినిధి. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పులకండ్ల శ్రీనివాస్‌రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో పనిచేస్తున్నాడు. అయితే అతనికి  చందానగర్‌కు చెందిన సంగీతతో నాలుగేళ్ల క్రితమే వివాహం జరిగింది. వారికి రెండేళ్ల క్రితం ఆడపిల్ల కూడా పుట్టింది. కానీ ఆడపిల్ల పుట్టడం శ్రీనివాస్ రెడ్డికి నచ్చలేదు. దీంతో అతను మరొక యువతిని రెండో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇక ఇది చూసి సహించలేని సంగీత తన భర్తను నిలదీసింది. ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.అంతేకాకుండా సంగీతను దారుణంగా కొట్టి ఇంటినుండి గెంటివేశాడు. ఇక ఈ తతంగం అంతా అక్కడ ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియీలో వదలగా.. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.

 

మరోవైపు తీవ్రగాయాల పాలైన సంగీత తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు ఆందోళన చేపట్టడంతో అసలు కథ బయటపడింది. ఇక విషయం వెలుగుచూడటంతో శ్రీనివాస్‌రెడ్డి ఇంటి నుండి పరారయ్యాడు. ఈ ఘటనతో.. టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది. మరి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా ఉంటే ఏం చేస్తాం...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu