బిగుతు డ్రస్సులు వేశారని...
posted on Mar 16, 2015 3:46PM

అమ్మాయిల డ్రస్స్లులు బిగుతుగా ఉన్నాయని జరగబోయే ఫుట్ బాల్ మ్యాచ్ నే రద్దుచేశారంట. ఈ ఘటన ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా... ఎక్కడో కాదు మన దేశంలోనే. వివరాలలోకి వెళితే మల్టా జిల్లాలోని చండీపూర్లో స్థానికి క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలో భాగంగా కోల్కతా, ఉత్తర బెంగాల్ మహిళా ఫుట్ బాల్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు. కానీ మ్యాచ్ ప్రారంభానికి ముందురోజు అమ్మాయిలు ధరించాల్సిన దుస్తులు చాలా బిగుతుగా ఉన్నాయని, అని వేసుకొని ఆడితే మగవాళ్లని రెచ్చగొట్టినట్లవుతుందని మ్యాచ్ ని రద్దు చేశారు. ఈ వ్యవహారంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. వీళ్ల వ్యవహారం చూస్తే సానియామీర్జాను కూడా ప్యాంటు వేసుకొని ఆడమనేలా ఉన్నారని భారత ఫుట్బాల్ టీమ్కు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రీడాకారుడొకరు విమర్శించారు. కొన్ని రాజకీయ పక్షాలు సైతం దీనిపై నిరసనలు తెలుపగా, తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సావిత్రి మిశ్రా మాత్రం ఈ మ్యాచ్ రద్దును సమర్దించారు. కొందరు తనపై మతపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంవల్లే మ్యాచ్ను రద్దుచేసినట్లు ప్రధాన నిర్వాహకుడు రేజా రజీర్ పేర్కొన్నారు.