టెక్సాస్ కాలేజీలో కాల్పులు..ఇద్దరి మృతి
posted on May 4, 2017 12:25PM

అమెరికాలో తుపాకులు మళ్లీ గర్జించాయి. టెక్సాస్‌లోని నార్త్ లేక్ కాలేజీలో ఓ మహిళపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం సమయంలో నార్త్ లేక్ కాలేజీలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగుడు మహిళపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు..దీంతో భయభ్రాంతులకు గురైన కాలేజీ సిబ్బందిలో ఒకరు గది తలుపులు మూసేసి యజమాన్యానికి సమాచారం అందించారు..దీంతో వారు మిగిలిన గదుల్లో ఉన్నవారికి హెచ్చరికలు జారీ చేయడంతో ఎక్కడివారు అక్కడ గదుల్లో తలుపులు లాక్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని దుండగుడి కోసం గాలించగా...పై అంతస్తులో అతని మృతదేహం దొరికింది..అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు..అయితే మృతులిద్దరి మధ్యా ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.