TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రవాణా పన్నుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Published on: Wed Apr 1, 2015 4:27PM

 

తెలంగాణ రాష్ట్రం సరిహద్దుల దగ్గర కొత్తగా ప్రవేశపెట్టిన రవాణా పన్నుపై ప్రైవేట్ ట్రావెల్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ చెక్‌పోస్టుల వద్ద హామీ పత్రాలు ఇవ్వాలని పిటిషనర్లకు సూచించింది. పిటిషన్ దాఖలు చేసిన వారికే వర్తించేలా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రవాణా పన్ను వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ హైకోర్టుకు తెలిపింది. తమ విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయని వారు న్యాయస్థానానికి తెలిపారు. జీవో నంబర్ 15ని రద్దు చేయాలని వారు హై కోర్టును అభ్యర్థించారు.