తెలంగాణలో అవినీతి పాముల పట్టివేత

 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులలో మూడు అవినీతి పాములను పట్టేశారు. వారిని పదవీ బాధ్యతల నుంచి తప్పించారు. వైద్య ఆరోగ్య శాఖ సంచాటకుడు సాంబశివరావు, జాతీయ ఆరోగ్య మిషన్ ముఖ్య పాలనాధికారి శ్రీనివాసరెడ్డి, వరంగల్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ బి.రాజులను విధుల నుంచి తప్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరి అవినీతి మీద నిఘా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఈ ముగ్గురిలో శ్రీనివాసరెడ్డి పారా మెడికల్ సిబ్బంది నియామకానికి సంబంధించి ఎంపిక చేసిన ఔట్ సోర్సింగ్ సంస్థకి సన్నిహితుడు. వైద్యుల నియామకానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు, పారా మెడికల్ సిబ్బందికి లక్ష నుంచి రెండు లక్షల వరకు బేరం పెట్టి పోస్టులను అమ్ముకున్నారు. సాంబశివరావు అనే ఉద్యోగి అంబులెన్స్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడు. ఈయన, శ్రీనివాసరెడ్డి, మరికొందరు కలసి ఒక్కో అంబులెన్స్ కొనుగోలుకు లక్ష రూపాయల లంచం వచ్చేలా అంబులెన్స్ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే బి.రాజు విషయానికి వస్తే, వరంగల్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఈయన నియామకం మీదే ఆరోపణలు రావడంతో ఈయన్ని ఆ పదవి నుంచి తొలగించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu