రూ.2,91,159 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్

తెలంగాణ వార్షిక బడ్జెట్ ను డెప్యుటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. మొత్తం 2,91,159 కోట్ల‌తో భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తన బడ్జెట్ ప్రసంగాన్ని నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో  ప్రారంభించారు. గత పదేళ్లో  బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగిందని విమర్శించారు.   ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సారిగా అసెంబ్లీకి హాజరయ్యారు.   
కాగా భట్టి విక్రమార్క బడ్జెట్ లో వివిధ రంగాలకు జరిపిన కేటాయింపులుఇలా ఉన్నాయి.

* హోం శాఖ రూ. 9,564 కోట్లు
* వైద్యం ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
* ఐటీ రంగం రూ. 774 కోట్లు
* నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 22,301 కోట్లు
* ఆర్ అండ్ బీ రూ. 5,790 కోట్లు
* ప‌రిశ్ర‌మ‌ల శాఖ రూ. 2,762 కోట్లు
* విద్యారంగం రూ. 21,292 కోట్లు
* ట్రాన్స్‌కో, డిస్కంలు రూ. 16,410 కోట్లు
* అడ‌వులు ప‌ర్యావ‌ర‌ణం రూ. 1,064 కోట్లు
* బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు
* ఎస్టీ సంక్షేమం రూ. 17,056 కోట్లు
* మైనార్టీ సంక్షేమం రూ. 3,003 కోట్లు
* స్త్రీ, శిశు సంక్షేమం రూ. 2,736 కోట్లు
* ఎస్సీ సంక్షేమం రూ. 33124 కోట్లు
* మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ - రూ. 3,385 కోట్లు
* హైడ్రా సంస్థ - రూ. 200 కోట్లు
* జీహెచ్ఎంసీలో మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న - రూ. 3,065 కోట్లు
* హెచ్ఎండీఏలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న రూ. 500 కోట్లు
* విమానాశ్ర‌యం వ‌ర‌కు మెట్రో విస్త‌ర‌ణ రూ. 100 కోట్లు
* హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు
* మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూఏ. 1500 కోట్లు
* ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ. 1525 కోట్లు
* పాత‌బ‌స్తీ మెట్రో విస్త‌ర‌ణ‌కు రూ. 500 కోట్లు
* మ‌ల్టీ మోడ‌ల్ స‌బ‌ర్బ‌న్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్ రూ. 50 కోట్లు
* ఔట‌ర్ రింగ్ రోడ్డుకు రూ. 200 కోట్లు
* రూ. 500 గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కం కోసం రూ. 723 కోట్లు
* గృహ‌జ్యోతి ప‌థ‌కం కోసం రూ. 2,418 కోట్లు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu