అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన... మహిళను చెట్టుకు కట్టేసి కోడిగుడ్లతో దాడి
posted on Jul 25, 2024 2:12PM
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం షికారిపాలెంలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. కొందరు మహిళలు కర్రలతో కొడుతూ కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. సదరు మహిళ ఇటీవల భర్త నుంచి విడిపోయి మరో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె తప్పుచేసిందంటూ పలువురు మహిళలు చిత్రహింసలు పెట్టారు. స్థానికుల సమాచారంతో వీరబల్లి పోలీసులు బాధితురాలిని పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆమె నుంచి ఎస్సై ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె నుంచి ఫిర్యాదు అందుకున్న అనంతరం చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.